Sandeep Reddy Vanga: వామ్మో ‘స్పిరిట్’లో ప్రభాస్ పాత్ర అలా ఉంటుందా? ఆసక్తికర కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి వంగా
Sandeep Reddy Vanga: డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ ప్రభాస్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్ చెప్పారు. 'స్పిరిట్'లో ప్రభాస్ రోల్ ఏంటో ఆయన మీడియాతో పంచుకున్నారు.
Sandeep Reddy Vanga Comments On Prabhas Spirit Movie : ‘యానిమల్’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘యానిమల్ పార్క్' సినిమాకి సంబంధించి ఇప్పటికే వర్క్ మొదలుపెట్టినట్లు గతంలో ప్రకటించారు ఆయన. ఇక ఇప్పుడు ప్రభాస్ 'స్పిరిట్' తర్వాతే వేరే ప్రాజెక్టులు అని ప్రకటించారు ఆయన. ఆ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు 'స్పిరిట్' కోసం.. ఇక ఇప్పుడు ఆ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చెప్పారు సందీప్.
పోలీస్ ఆఫీసర్‌గా డార్లింగ్..
'దుకాణ్'.. అనే బాలీవుడ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. దాంట్లో భాగంగా నెక్ట్స్ 'యానిమల్ పార్క్' రెడీ అయ్యిందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. "ప్రభాస్ 'స్పిరిట్'పైన వర్క్ చేస్తున్నాను. ఆ తర్వాతే 'యానిమల్ పార్క్'. 'స్పిరిట్' ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ" అని చెప్పారు సందీప్ రెడ్డి. దీంతో ఇప్పుడు ప్రుభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. డార్లింగ్‌ని గతంలో ఎప్పుడూ చూడని గెటప్‌లో ఇప్పుడు చూడబోతున్నామంటూ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. చాలా పవర్‌ఫుల్ క్యారెక్ట్స్‌లో చూశామని, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ఫిజిక్ కరెక్ట్‌గా సూట్ అవుతుందని కామెంట్స్ పెడుతున్నారు. ‘యానిమల్’లో రణబీర్ క్యారెక్టర్ ఎంత ఇంటెన్స్‌గా ఉందో.. ‘స్పిరిట్’లో ప్రభాస్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుందేమో అని ఫ్యాన్స్ ఊహించుకోవడం మొదలుపెట్టారు.
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు సందీప్‌రెడ్డి వంగ. ఆ తర్వాత అదే సినిమాని 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశాడు. అలా బాలీవుడ్‌లో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు ఆయన. ఇక ఆ తర్వాత 'యానిమల్' సినిమాతో వేరే లెవెల్‌కి వెళ్లిపోయాడు. ఎంతోమంది ప్రశంసలు దక్కించుకున్నాడు. 'యానిమల్' సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఆ సినిమాకి ఎన్ని ప్రశంసలు దక్కాయో అన్ని విమర్శలు సైతం వచ్చాయి. అయితే, వాటిని పట్టించుకోని సందీప్ 'యానిమల్ పార్క్'పై తన వర్క్ మొదలుపెట్టారు. అయితే, ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి చేస్తున్న ‘స్పిరిట్’ పూర్తి అయిన తర్వాతే సీక్వెల్ వస్తున్నట్లు ప్రకటించారు ఆయన.
మరోవైపు ప్రభాస్ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ కెరీర్‌లో 25వ చిత్రంగా ‘స్పిరిట్’ తెరకెక్కనుంది. కాగా.. ఇప్పటికే ఈ పాన్ ఇండియా హీరో చేతిలో ‘కల్కి 2898 ఏడీ’, ‘రాజా సాబ్’లాంటి సినిమాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాలు అయ్యాకే.. సందీప్ రెడ్డితో సినిమా అవకాశాలు ఉన్నయానే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి ముందు ఏ సినిమా రిలీజ్ అవుతుందో.
ఇక సందీప్ రెడ్డి వంగ లాంచ్ చేసిన 'దుకాణ్' సినిమా ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. సరోగసిపై తెరకెక్కించారు ఈ సినిమా. ఎమోషనల్‌గా సాగే ఈ సినిమా ఫస్ట్‌లుక్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: మనశ్శాంతి లేదు.. ఎటైనా వెళ్లిపోవాలని ఉంది - 'ధృవ నక్షత్రం' వాయిదాపై గౌతమ్ మేనన్ ఆవేదన!