By: ABP Desam | Updated at : 26 Sep 2023 12:22 PM (IST)
సందీప్ కిషన్, దామోదర ప్రసాద్ (Photo Credit : Sundeep Kishan/Twitter)
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. ఎప్పుడూ కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ జానర్ మూవీస్ తో కొత్త తరహా చిత్రాలు చేస్తూ తనదైన నటనతో తెలుగుతోపాటు తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రిజల్ట్ తో సంబంధం లేకుండా తెలుగు, తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 'ఊరు పేరు భైరవకోన' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఇదే బ్యానర్ లో ఇప్పుడు మరో సినిమా చేసేందుకు సైన్ చేశారు ఈ యంగ్ హీరో.
గతంలో వచ్చిన 'మాయామన్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో సందీప్ కిషన్, దర్శకుడు సివి కుమార్ ఈ చిత్రం కోసం మరోసారి కలిసి పని చేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 26 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రారంభమైంది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో రామ బ్రహ్మం సుంకర భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మాయావన్ వరల్డ్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం గతంలో వచ్చిన 'మాయావన్' కి సీక్వెల్ గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.
An auspicious start for an exciting journey💥
— AK Entertainments (@AKentsOfficial) September 25, 2023
Our Production No-26 Pooja ceremony commenced today with the presence of esteemed guests 🪔✨
Starring @sundeepkishan
Directed by @icvkumar @AnilSunkara1 @Music_Santhosh @dopkthillai @kishore_Atv @AKentsOfficial pic.twitter.com/6AqFiky0Jx
టాప్ ప్రొడక్షన్, హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఒక సామాన్యుడి ఘర్షణ కథగా ఉండబోతోంది. సోమవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ క్రమంలోనే ముహూర్తపు షాట్ కి దామోదర ప్రసాద్ క్లాప్ కొట్టగా, వెంకట్ బోయినపల్లి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షార్ట్ కి జెమినీ కిరణ్ దర్శకత్వం వహించారు. నవంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.
కార్తిక్ కే. తిల్లై ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, నాని దసరా సినిమాకి అదిరిపోయే ఆల్బమ్ అందించి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సంతోష్ నారాయణన్ ప్రభాస్ పాన్ వరల్డ్ ఫిలిం 'కల్కి 2898AD' కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
రీసెంట్ గా 'మైఖేల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్ కిషన్. మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం 'ఊరు పేరు భైరవకోన' అనే సినిమాలో నటిస్తున్నాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్కక్షణం' వంటి సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్ సరసన వర్ష బొల్లమ్మ కకథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ సలహాలు చేస్తున్నారు.
Also Read : ‘చంద్రముఖి 2‘ విడుదలకు ముందు రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న రాఘవా లారెన్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
నయనతార సినిమాకి చిక్కులు, ‘నాసామిరంగ’ హీరోయిన్ రివీల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్
Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ
Hi Nanna: షారుఖ్ ఖాన్ క్లాసిక్ చిత్రంతో ‘హాయ్ నాన్న’కు పోలికలు! - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ
Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
/body>