News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Chandramukhi 2: ‘చంద్రముఖి 2‘ విడుదలకు ముందు రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న రాఘవా లారెన్స్

మరో రెండు రోజుల్లో ‘చంద్రముఖి-2‘ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో రాఘవ లారెన్స్, సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ‘జైలర్‘ ఘన విజయం పట్ల శుభాకాంక్షలు చెప్పారు.

FOLLOW US: 
Share:

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన హారర్, థ్రిల్లర్ మూవీ ‘చంద్రముఖి‘  తమిళంతో పాటు తెలుగులోనూ సంచలన విజయాన్ని అందుకుంది. 2005లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకుంది.  పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీ కాంత్‌తో పాటు నయనతార, ప్రభు, జ్యోతిక కీలక పాత్రలు పోషించారు. హారర్, కామెడీ కలిసి ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. సుమారు 18  సంవత్సరాల తర్వాత ‘చంద్రముఖి‘ సినిమా సీక్వెల్ విడుదలకు రెడీ అయ్యింది. ఇందులో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించారు. ‘చంద్రముఖి 2‘ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న లారెన్స్

మరో రెండు రోజుల్లో ‘చంద్రముఖి-2‘ సినిమా విడుదలకానున్న నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్‌ను, రాఘవ లారెన్స్ కలిశారు. ఆయన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ మేరకు లారెన్స్ ట్విట్టర్ వేదికగా ఫోటోలను షేర్ చేశారు.  “హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్, ఈ రోజు నేను గురువు గారు రజనీకాంత్ ను కలిశాను. ‘జైలర్’ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం పట్ల శుభాకాంక్షలు చెప్పాను.  సెప్టెంబర్ 28న ‘చంద్రముఖి2’ విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆశీస్సులు పొందాను. ఈ చిత్రం చక్కటి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. గురువే శరణం” అంటూ ట్వీట్ చేశారు.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం చక్కటి విజయాన్ని అందుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.  

ప్రీరిలీజ్ ఈవెంట్ లో లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

తాజాగా హైదరాబాద్ లో జరిగిన ‘చంద్రముఖి-2‘  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునను తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పారు.  చిరంజీవి, రజనీకాంత్‌ ప్రభావం తనపై చాలా ఉందన్నారు. ‘చంద్రముఖి 2’ సినిమా కోసం రజనీ కాంత్ తనకు ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్నారు.

‘చంద్రముఖి 2’ గురించి..  

‘చంద్రముఖి 2’ పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కింది. రజనీకాంత్,  జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వెల్ గా వస్తోంది. లారెన్స్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ చంద్రముఖిగా కనిపించనుంది. తమిళ స్టార్ కమెడియన్ వడివేలు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేనప్పటికీ, రజినీకాంత్ నటించిన హారర్ కామెడీ చిత్రానికి సీక్వెల్ కావడంతో 'చంద్రముఖి 2' పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని, తెలుగు రాష్ట్రాల్లో రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఉప్పుటూరి, వెంక‌ట ర‌త్నం రిలీజ్ చేయనున్నారు.

Read Also: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 26 Sep 2023 11:38 AM (IST) Tags: Rajinikanth Raghava Lawrence P Vasu Chandramukhi 2 Release

ఇవి కూడా చూడండి

Rashmika: 'గర్ల్ ఫ్రెండ్'గా మారిన రష్మిక - యానిమల్ సక్సెస్ టు హైదరాబాద్ సెట్స్! 

Rashmika: 'గర్ల్ ఫ్రెండ్'గా మారిన రష్మిక - యానిమల్ సక్సెస్ టు హైదరాబాద్ సెట్స్! 

Thika Maka Thanda Movie: 'తికమక తాండ' ట్రైలర్ విడుదల చేసిన విక్రమ్ కుమార్

Thika Maka Thanda Movie: 'తికమక తాండ' ట్రైలర్ విడుదల చేసిన విక్రమ్ కుమార్

నయనతార సినిమాకి చిక్కులు, ‘నాసామిరంగ’ హీరోయిన్ రివీల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

నయనతార సినిమాకి చిక్కులు, ‘నాసామిరంగ’ హీరోయిన్ రివీల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ

Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ

టాప్ స్టోరీస్

ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న మిగ్‌జాం తుపాను- అధికార యంత్రాంగం అప్రమత్తం

ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న మిగ్‌జాం తుపాను- అధికార యంత్రాంగం అప్రమత్తం

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
×