By: ABP Desam | Updated at : 07 Jun 2023 11:22 AM (IST)
సమంత (Image courtesy - @Samantha/ Instagram)
ఫిట్నెస్ అంటే ప్రాణం ఇచ్చే కథానాయికలలో సమంత (Samantha) ఒకరు. ఆ మధ్య మాయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు, అంతకు ముందు, ఆ తర్వాత కూడా... ఆరోగ్యం ఎలా ఉన్నా వర్కవుట్స్ చేయడం, జిమ్‌కు వెళ్ళడం మానలేదు. షూటింగుల్లో ఉన్నా షెడ్యూల్ ప్రకారం సమంత జిమ్ చేయాల్సిందే. లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో పోస్ట్ చేసిన సమంత... నెటిజనులు షాక్ ఇచ్చారు.
వందకు తగ్గేదే లే!
ఒకటి... రెండు... మూడు... వంద! లెగ్స్ స్ట్రెంగ్త్ కోసం సమంత ఓ వ్యాయామం చేశారు. బాడీ వెయిట్ అంతా మోకాళ్ళ కింద భాగంలో పడేలా పాదాలను పైకి కిందకు కదిలిస్తారు. అంత ఇంటెన్స్ వర్కవుట్స్ సమంత చేయడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. మాయోసైటిస్ నుంచి కోలుకుంటున్న తరుణంలో ఆమె ధైర్యాన్ని, తెగింపును చూసి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెబుతున్నారు.
Samantha In Turkey : ఇప్పుడు సమంత టర్కీలో ఉన్నారు. 'ఖుషి' సినిమా కోసం హీరో విజయ్ దేవరకొండతో కలిసి చిత్రీకరణ చేస్తున్నారు. అక్కడ నుంచి ఈ వర్కవుట్ వీడియో, ఫొటోస్ పోస్ట్ చేశారు.
Also Read : తిరుమలలో కృతికి ఆ ముద్దులేంటి? కౌగిలించుకోవడం ఏమిటి? వివాదాస్పదంగా మారిన 'ఆదిపురుష్' దర్శకుడి ప్రవర్తన
సమంత గౌను... లక్షన్నర రేటు!
'ఖుషి' సినిమాలో పాట చిత్రీకరణ కోసం సమంత ధరించిన గౌను రేటు విని ఆ మధ్య ప్రేక్షకులు నోరెళ్ళ బెట్టారు. టర్కీ నుంచి ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సమంత. తెలుసుగా... హీరోలు హీరోయిన్లు ఫోటోలు పోస్ట్ చేస్తే వాళ్ళ డ్రస్, షూలు, వాచ్ వంటి వాటి రేటు కోసం ఎంక్వైరీ చేసే అభిమానులు ఉంటారని!
Also Read : యుద్ధమే చేశాడు - ఓం రౌత్ ను వెనకేసుకొచ్చిన ప్రభాస్
సమంత గౌను గురించి కొందరు నెట్టింట సెర్చ్ చేశారు. దాని రేటు ఎంత ఉందో తెలుసా? అక్షరాలా లక్షన్నర రూపాయలు! 'ఖుషి' సాంగ్ షూటింగ్ కోసం టర్కీ వెళ్లేముందు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో సమంత కనిపించారు. అప్పుడు వేసుకున్న చెప్పుల రేటు చూస్తే రెండున్నర లక్షలు ఉంది. బ్రాండ్స్ విషయంలో సమంత 'తగ్గేదే లే' పాలసీ ఫాలో అవుతున్నారు.
పూజా హెగ్డే స్టైల్ సామ్ కాపీ కొట్టిందా?
సమంత వేసుకున్న గౌను ఉంది చూశారా? ఈ స్టైల్ గౌను సామ్ కంటే పూజా హెగ్డే వేసుకున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ జోడీగా బుట్ట బొమ్మ నటించిన సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'. ముంబైలో జరిగిన ఆ సినిమా ప్రచార కార్యక్రమానికి పూజా హెగ్డే కూడా సేమ్ టు సేమ్ ఈ స్టైల్ గౌను ధరించారు. కాకపోతే, ఆమెది ఎల్లో గౌను. సమంత ధరించినది గ్రీన్ గౌను! 'ఖుషి' పాటలో సమంత ఈ గౌనుతో కనిపిస్తారు. టర్కీ వెళ్ళేటప్పుడు సమంత ధరించిన చెప్పుల ఖరీదు రెండున్నర లక్షలు. ఆ రేటు గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడిచింది. హాట్ టాపిక్ అయ్యింది. 'ఖుషి' సినిమాతో పాటు 'సిటాడెల్' వెబ్ సిరీస్ కూడా సమంత చేస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజిలో ఉన్నాయట.
Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్
దిల్ రాజు చేతికి 'యానిమల్' రైట్స్ - ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో తెలుసా?
Rakshit Shetty: ఆమె కలలు పెద్దవి - రష్మిక గురించి షాకింగ్ విషయం బయపెట్టిన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి
వహిదా రెహమాన్‌కు దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!
Vivek Agnihotri: ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తున్నారు: దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి షాకింగ్ కామెంట్స్
CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు
Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !
Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!
Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?
/body>