అన్వేషించండి

Samantha: బాలీవుడ్ ఎంట్రీకి సామ్ సిద్ధం, ఆ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన సమంత?

దక్షిణాది అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు త్వరలోనే స్ట్రెయిట్ హిందీ సినిమా చేయనున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.

కొన్నేళ్లుగా సౌత్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంతా రూత్ ప్రభు.. ఇటీవల 'ఖుషి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. తన ఆరోగ్య పరిస్థితి కారణంగా సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. అయితే ఆమె పూర్తిగా కోలుకున్న వెంటనే ఈసారి బాలీవుడ్ పై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సామ్ త్వరలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.

రాజ్‌ & డీకే తెరకెక్కించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్-2 వెబ్ సిరీస్ తో హిందీ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది సమంత. 'పుష్ప: ది రైజ్' చిత్రంలో 'ఊ అంటావా మావా' అంటూ ఐటమ్ సాంగ్ తో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. సామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం చేసిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో నేరుగా ఓ హిందీ సినిమా చేయనుందని, అది కూడా సల్మాన్ కు జోడీగా నటించనుందని బీ టౌన్ లో టాక్ నడుస్తోంది.

Also Read: Jawan 2: బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్.. కంఫర్మ్ చేసిన డైరెక్టర్!

ప్రస్తుతం 'టైగర్ 3' చిత్రాన్ని దీపావళికి రెడీ చేస్తున్న సల్మాన్ ఖాన్.. విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయినట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ తో 'పంజా', అజిత్ కుమార్ తో 'బిల్లా' సినిమాలు తెరకెక్కించిన విష్ణు.. చివరగా 'షేర్షా' మూవీతో బాలీవుడ్ లో సత్తా చాటాడు. ఇప్పుడు సల్లూ భాయ్ తో చేతులు కలపబోతున్నాడు. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించనున్నారు. 

త్వరలో ప్రకటించబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఫిమేల్ లీడ్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నారు మేకర్స్. పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని సౌత్ హీరోయిన్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగా సమంత ను ఒక ఆప్షన్ గా పరిగణిస్తున్నారట. ఒకవేళ కన్ఫర్మ్ అయితే ఇదే ఆమెకు బాలీవుడ్ డెబ్యూ అవుతుంది. 

నిజానికి సామ్ హిందీ సినిమా గురించి గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఏదీ నిజం కాలేదు. మళ్లీ ఇప్పుడు ఆమె డెబ్యూపై టాక్ నడుస్తోంది. కాకపోతే సమంతతో పాటుగా మరో స్టార్ హీరోయిన్ నయనతార ను కూడా సల్మాన్ మూవీ కోసం పరిశీలిస్తున్నారని అంటున్నారు. 

రీసెంట్ గా 'జవాన్' తో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నయనతార.. ఎంట్రీతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. గతంలో విష్ణు వర్ధన్ దర్శకత్వంలో 'బిల్లా' సినిమాలో నటించింది. మరి ఇప్పుడు సల్మాన్ ఖాన్ కోసం సమంత, నయన్ లలో దర్శకుడు ఎవరిని ఫైనలైజ్ చేస్తారో వేచి చూడాలి.

Also Read: MEGA Teaser: హీరోగా యూట్యూబర్ హర్ష సాయి - ఇంట్రెస్టింగ్‌గా టైటిల్ టీజర్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Review - 'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Chennai Love Story Live Updates - 'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
Raakaasa TV Premiere Date : టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget