అన్వేషించండి

Jawan 2: బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్.. కంఫర్మ్ చేసిన డైరెక్టర్!

షారుక్‌ ఖాన్‌, నయనతార ప్రధాన పాత్రల్లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జవాన్'. ఈ సినిమా సీక్వెల్ పై దర్శకుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

కింగ్ ఖాన్ షారుక్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జవాన్‌’. అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో షారూఖ్ ద్విపాత్రాభినయం చేయగా.. నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమా సీక్వెల్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు అట్లీ 'జవాన్ 2' గురించి కీలక వ్యాఖ్యలు చేసాడు.

‘జవాన్‌’ సినిమాలో విక్రమ్ రాథోడ్, ఆజాద్ వంటి తండ్రీ కొడుకుల పాత్రల్లో షారుక్ ఖాన్ నటించారు. ఈ మూవీకి సీక్వెల్ ఉండే అవకాశం ఉందనే ఎండింగ్ తో ముగిసింది. లాస్ట్ సీన్ లో సంజయ్ దత్ ఆదేశాలతో తండ్రీ కొడుకులు మరో మిషన్ ను పూర్తి చెయ్యడానికి సిద్ధమైనట్లు చూపించారు. దీంతో కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని అభిమానులు భావించారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ అట్లీ ధృవీకరించాడు. స్క్రిప్ట్ రాయడానికి స్ట్రాంగ్ ఐడియా వస్తే 'జవాన్ 2'తో తిరిగి వస్తానని చెప్పాడు. 

అట్లీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాను తీసిన ప్రతి చిత్రానికి ఓపెన్ ఎండ్ ఉంటుందని, కానీ సీక్వెల్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదని అన్నాడు. 'జవాన్' సినిమా కోసం ఏదైనా బలమైన ఐడియా వస్తే సెకండ్ పార్ట్ చేస్తానని తెలిపాడు. ఎప్పుఫు ఉంటుందో చెప్పలేం కానీ, తప్పకుండా ఏదో ఒక రోజు జవాన్‌ కి సీక్వెల్‌ వస్తుందని దర్శకుడు చెప్పాడు. అట్లీ ప్రకటనతో కింగ్ ఖాన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో షారూక్ ఖాన్ సైతం 'జవాన్ 2' పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారని, దర్శకుడు తన రచయితల టీంతో సీక్వెల్ స్క్రిప్ట్ గురించి చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

Also Read: రాజమౌళి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ కాపీ మాస్టర్ - బాలీవుడ్ క్రిటిక్ షాకింగ్ కామెంట్స్

'జవాన్' మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.750 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్ అవ్వడంతో రీసెంట్ గా చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అట్లీ మాట్లాడుతూ షారుక్‌ ఖాన్ అంటే తనకెంతో ఇష్టమని, తాను ఆయనకు వీరాభిమానినని అన్నాడు. తనపై నమ్మకంతో షారుక్‌ 300 కోట్లకు పైగా బడ్జెట్‌ పెట్టడానికి వెనకాడలేదని తెలిపారు. ఈ సినిమాని తాను షారుక్‌ కు రాసిన లవ్ లెటర్ గా భావిస్తానని చెప్పాడు. 

అట్లీకి అన్నీ హిట్లే..
'రాజా రాణి' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన అట్లీ కుమార్.. పోలీసోడు, అదిరింది, విజిల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. అపజయం ఎరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం గురించి మాట్లాడుతూ.. తాను రచయితలా దర్శకుడిగా సినిమా తీయనని, సగటు అభిమానిగా తీస్తానని అన్నాడు. ఒక చిత్రంలో అన్నింటినీ బ్యాలెన్స్‌ చేయడానికి తన దగ్గర ఎలాంటి ఫార్ములాలు లేవని, ఏది బాగుంటుందనిపిస్తే అది చేస్తానని చెప్పాడు. తన జీవితంలో నేర్చుకున్న విషయాలనే సినిమాలో చూపిస్తానని, తన చుట్టూ ఉండే పరిస్థితులను సినిమాగా రూపొందిస్తానని, అదే తన విజయ రహస్యమని అట్లీ చెప్పుకొచ్చాడు. 

Also Read: డై హార్డ్ ఫ్యాన్ అంటే ఇతనే - వెంటిలేటర్‌తో థియేటర్‌కు వచ్చి 'జవాన్' సినిమా చూసిన వీరాభిమాని!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
Embed widget