Sikandar : 'సికందర్'లో లతా మంగేష్కర్ ఐకానిక్ సాంగ్ రీమేక్... సల్లూ భాయ్, రష్మిక అభిమానులకు పూనకాలే
Sikandar : సల్మాన్ ఖాన్ యాక్షన్ మూవీ 'సికందర్' ఈద్ సందర్భంగా విడుదల కానుంది. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీని మరింత స్పెషల్ చేయడానికి లతా మంగేష్కర్ ఐకానిక్ సాంగ్ ను మేకర్స్ రీమేక్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అప్ కమింగ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ 'సికందర్'. దాదాపు ఏడాది తర్వాత ఈ మూవీతో ప్రేక్షకులకు వెండితెరపై మంచి ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు సల్మాన్ ఖాన్. పైగా ఈ మూవీలో ఆయనతో కలిసి రష్మిక మందన ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకుంటుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈద్ కానుకగా 'సికందర్' మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. అయితే తాజాగా 'సికందర్' మూవీలో లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఐకానిక్ సాంగ్ ను రీమేక్ చేయబోతున్నారనే వార్త బాలీవుడ్ ని షేక్ చేస్తోంది.
సికందర్ లో లతా మంగేష్కర్ ఐకానిక్ సాంగ్ రీమేక్
'సికిందర్' మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్ రెండు అట్రాక్టివ్ సాంగ్స్ ను రిలీజ్ చేశారు. 'జోహ్రా జబీన్', 'బామ్ బామ్ భోలే' అనే సాంగ్స్ మ్యూజికల్ టీజర్లు సల్లూ భాయ్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. ఈ రెండు పాటల్లో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న మధ్య కనిపించిన ఫ్రెష్ కెమిస్ట్రీ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక సినిమాపై పాజిటివ్ వైబ్ నెలకొన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం 'సికందర్' మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ సౌండ్ ట్రాక్ లో ఒక స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ ను యాడ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
ప్రస్తుతం 'సికందర్'పై భారీ హైప్ ఉండగా, దాన్ని మరింతగా పెంచడానికి ఈ పాటను మేకర్స్ ఉపయోగించబోతున్నారని టాక్ నడుస్తోంది. బజ్ ప్రకారం సల్మాన్ ఖాన్ ఇటీవల ముంబైలో రష్మిక మందన్నతో కలిసి ఈ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ షూటింగ్లో పాల్గొన్నారు. అది లతా మంగేష్కర్ రాసిన ఒక టైంలెస్ క్లాసిక్ సాంగ్ రీమేక్ అని సమాచారం. అయితే ఆ పాట ఏంటి అన్న విషయం ఇంకా తెలియరాలేదు. కానీ 'సికందర్' సినిమాలో ఏ ఐకానిక్ సాంగ్ ను రీమేక్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ పాట గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వస్తే సల్లూ భాయ్ అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆ స్పెషల్ సాంగ్ ఏంటి అనే విషయాన్ని మేకర్స్ సీక్రెట్ గా ఉంచారు.
ఈద్ కానుకగా మూవీ రిలీజ్
ఇదిలా ఉండగా 'సికందర్' మూవీలో రష్మిక మందన్నతో పాటు కాజల్ అగర్వాల్, ప్రతీక్ బబ్బర్, శర్మన్ జోషి, సత్యరాజ్ లాంటి ప్రముఖ నటీనటులు భాగం కాబోతున్నారు. సాజిద్ నదియావాలా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ ఈద్ కానుకగా మార్చి 28న రిలీజ్ కాబోతోంది.
Celebrate the festival of colors with love in your heart and joy in your soul!
— Nadiadwala Grandson (@NGEMovies) March 14, 2025
Wishing you all a very Happy and Safe Holi from Sajid Nadiadwala, #NGEFamily & the entire Team of Sikandar 💜🧡 @BeingSalmanKhan In #SajidNadiadwala’s #Sikandar
Directed by @ARMurugadoss… pic.twitter.com/Op6FCotYjs
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

