Sakshi Dhoni: నేను అల్లు అర్జున్‌కు వీరాభిమానిని: 'ఎల్జీఎం' ఈవెంట్‌లో ధోని భార్య సాక్షి
ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, సినీ నిర్మాత సాక్షి ధోని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అల్లు అర్జున్ కి వీరాభిమాని అని చెప్పారు. అంతే కాదు తాను ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పడం వైరల్ అవుతోంది.
Sakshi Dhoni Comments on Bunny: స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, అతని భార్య సాక్షి ధోని.. ధోని ఎంటర్ టైన్‌మెంట్ పతాకంపై తమిళంలో 'ఎల్‌జీఎం(లెట్స్ గెట్ మ్యారీ)'అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా జూలై 24న హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. సాక్షి ధోని ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి వీరాభిమానిని అని, అతని సినిమాలు చూస్తూ పెరిగానని వెల్లడించారు. సినిమా నిర్మాత సాక్షి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరో హరీస్ కళ్యాణ్, హీరోయిన్ ఇవానా జంటగా నటించిన ‘ఎల్‌జీఎం’ మూవీ ఆగస్టు 4న తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్.ఫిల్మ్స్, త్రిపుర ప్రొడక్షన్స్ బ్యానర్స్ విడుదల చేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిర్మాత సాక్షి ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సాధారణంగా మావారు ధోని ఎప్పుడూ సర్‌ప్రైజ్ లిస్తుంటారు. ఆయన్నుంచి వచ్చిన మరో సర్ప్రైజ్ ఇది. సాధారణంగా క్రికెట్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్. కానీ, మా వారికి అది ప్రొఫెషన్. క్రికెట్ ఎలాగో సినిమా కూడా ఎంటర్‌టైన్మెంట్ కాబట్టి సినీ పరిశ్రమలోకి వచ్చాం. ఇద్దరం చాలా సినిమాలు చూస్తాం. అది థియేటర్‌లో కావచ్చు ఓటీటీలో కావచ్చు. ఆ ఇష్టంతోనే ఈ రంగంలోకి వచ్చాం. ఇంకా మరెన్నో సినిమాలను చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఎల్‌జీఎం సినిమాను తమిళంలో చేసినా, తెలుగులో ధోనికి భారీ సంఖ్యలో అభిమానులున్నారు. అందువల్ల తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. తెలుగు సినిమాలను హిందీలోకి అనువాదం చేసి యూ ట్యూబ్‌లో రిలీజ్ చేసేవాళ్లు. నేను వాటిని చూసేదాన్ని" అని సాక్షి అన్నారు.
"ముఖ్యంగా నేను అల్లు అర్జున్ సినిమాలన్నింటినీ చూశాను. నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఇప్పటిదాకా ఆయన నటించిన ఏ మూవీని వదలకుండా చూశా’’ అని సాక్షి చెప్పారు. ఓటీటీలు, గోల్డ్ మైన్ యూట్యూబ్ ఛానల్స్ లో అన్నీ కవర్ చేశానని చెప్పుకొచ్చారు. వాటిని చూస్తూ పెరిగానని చెప్పిన సాక్షి.. బన్నీకి తనకు ఏడేళ్లే గ్యాప్ అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఎల్జీఎం సినిమా విషయానికొస్తే.. ఇదొక ఇండిపెండెంట్‌గా ఉండే అమ్మాయి కథ. సాధారణంగా మన రిలేషన్స్‌లో పొరపచ్చాలు వస్తుంటాయి. వాటిని తిరిగి నిలబెట్టుకుంటూ వెళుతుంటాం. మన లైఫ్‌లో రిలేషన్ షిప్స్ గురించి చెప్పే సినిమా ఇది. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తన మనసులో ఎలా ఫీల్ అవుతుంటుంది. దానికి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుందనే పాయింట్‌తో ఎల్‌జీఎం సినిమాను తెరకెక్కించాం. ఆగస్ట్ 4న మూవీ రిలీజ్ అవుతుంది, తప్పకుండా మీ అందరి ఆధరణ అందుకుంటుందని ఆశిస్తున్నాను" అని సాక్షి అన్నారు
'పుష్ప పార్ట్ 1'తో భారీ విజయాన్ని మూటగట్టుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు అదే సుకుమార్ డైరెక్షన్లో 'పుష్ప 2'లో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు హిందీలోనూ అదరగొట్టిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా ఇతర పాత్రల్లో సునీల్, రావు రమేష్, ధనుంజయ, యాంకర్ అనసూయ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో ఈ సినిమాపై ముందు నుంచి ఉన్న అంచనాలు, క్యూరియాసిటీ.. ఇప్పుడు మరింత పెరిగినట్టు తెలుస్తోంది. 'పుష్ప పార్ట్ 1' బాక్సాఫీస్ ను ఎంతలా షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 'పుష్ప 2'తో మరోసారి ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు బన్నీ సిద్ధమయ్యారు. అంతే కాదు 'పుష్ప 3'కూడా త్వరలోనే రానుందనే టాక్ వినిపిస్తోంది. 'పుష్ప 2'లో పుష్పరాజ్ రూలింగ్ చూపిస్తూ ఓ భారీ ట్విస్ట్‌తో ముగిస్తారట. ఇక 'పుష్ప 3'తో ఈ సిరీస్‌ను ముగిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథ ఇప్పటికే రెడీ అయ్యిందట. ఈ మూడో పార్ట్.. 2025లో షురూ కానుందని తెలుస్తోంది.
Read Also : Pawan Kalyan: ఆ విషయంలో ‘భీమ్లా నాయక్’ను మించిపోయిన పవర్ స్టార్ ఓజీ ‘ఓజీ’
Join Us on Telegram: https://t.me/abpdesamofficial