అన్వేషించండి

Pawan Kalyan: ఆ విషయంలో ‘భీమ్లా నాయక్’ను మించిపోయిన పవర్ స్టార్ ఓజీ ‘ఓజీ’

సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ఓజీ' ఓవర్సీస్ హక్కులు రూ.18కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. అయితే ఇది భీమ్లా నాయక్ రెట్టింపు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

OG Overseas Rights: ప్రస్తుతం 'ఓజీ' కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రస్తుతం ఈ మూవీ 4వ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులపై సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. 'ఓజీ' ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. దాదాపు రూ.18 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. అయితే ఇంతకు మునుపు పవన్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా కంటే ఇది దాదాపు రెట్టింపు అన్నమాట. కాగా ఈ విషయంపై మేకర్స్ మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ లాంటి ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యమైన పాత్రలలో ఆకట్టుకోనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య 'ఓజీ'ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో 'బ్రో' తర్వాత.. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న 'ఓజీ'నే (వర్కింగ్ టైటిల్). సుజీత్ గతంలో 'రన్ రాజా రన్', 'సాహూ' వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. ఇక్కడ మరో విషయం ఏమంటే దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని కూడా. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరో రేంజ్‌లో ఉన్నాయి. మొదట ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్‌గా 'OG' అని ప్రచారం చేశారు. అయితే ఈ టైటిల్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇక అదే టైటిల్‌ను దర్శక నిర్మాతలు రిజిష్టర్ చేసినట్టు తెలుస్తోంది. సుమారు రూ.200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ నటుడు అర్జున్ దాస్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. అయితే 'ఓజీ'ని  డిసెంబర్ 2023 లేదా ఏప్రిల్ 2024లో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్.. లైనప్ లో ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఆయన 'వినోదయ సీతమ్' అనే  తమిళ సినిమాకు రీమేక్‌‌గా బ్రో అనే ఓ తెలుగు సినిమాను చేశారు. ఇక ఈ సినిమాను తెలుగులో సముద్రఖని దర్శకత్వం వహించగా.. ఈ సినిమా భారీ అంచనాల నడుమ రూపొందింది. 'బ్రో'లో తంబి రామయ్య అనే మరో  కీలక పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ మూవీలో పవన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రాన్ని జూలై 27, 2023న వరల్డ్ వైడ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.  

Read Also : Tillu Square: అనుపమతో డీజే టిల్లు మార్కు ఫ్లర్టింగ్ - ‘టికెటే కొనకుండా’ అంటూ వస్తున్న ‘టిల్లు స్క్వేర్’!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Rahul Ramakrishna : మీ ఫ్యాన్‌గా అడుగుతున్నా... దేశ ద్రోహిని కాదు - పవన్ కల్యాణ్‌ టార్గెట్‌గా రాహుల్ రామకృష్ణ ట్వీట్స్
మీ ఫ్యాన్‌గా అడుగుతున్నా... దేశ ద్రోహిని కాదు - పవన్ కల్యాణ్‌ టార్గెట్‌గా రాహుల్ రామకృష్ణ ట్వీట్స్
Karuppu OTT : వీరభద్రుడు ఓటీటీ రిలీజ్ డేట్ - సూర్య 300 కోట్ల మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
వీరభద్రుడు ఓటీటీ రిలీజ్ డేట్ - సూర్య 300 కోట్ల మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Peddi Collections Day 4: ఆదివారం బాక్సాఫీస్‌లో 'పెద్ది'గాడి ఊచకోత... రామ్ చరణ్ నయా రికార్డు... నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
ఆదివారం బాక్సాఫీస్‌లో 'పెద్ది'గాడి ఊచకోత... రామ్ చరణ్ నయా రికార్డు... నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
Drishyam 3 OTT : దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Smoking With Tea : టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్
VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Embed widget