అన్వేషించండి

Tillu Square: అనుపమతో డీజే టిల్లు మార్కు ఫ్లర్టింగ్ - ‘టికెటే కొనకుండా’ అంటూ వస్తున్న ‘టిల్లు స్క్వేర్’!

‘టిల్లు స్క్వేర్’ మొదటి పాట ‘టికెటే కొనకుండా’ జులై 26వ తేదీన విడుదల కానుంది.

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా గతేడాది విడుదల అయిన ‘డీజే టిల్లు’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా విడుదల అయి వసూళ్లలో పెద్ద సంచలనం సృష్టించింది. దాదాపుగా రూ.30 కోట్ల వరకు గ్రాస్‌ను సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా ప్రకటించారు. ‘టిల్లు స్క్వేర్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే క్యాస్ట్ పరంగా ఈ సినిమాలో చాలా మార్పులు చేశారు. హీరోయిన్ నేహా శెట్టి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది.

ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను నిర్మాతలు జులై 26వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రోమో ద్వారా ప్రకటించారు. ప్రోమో విషయానికి వస్తే... వాష్ బేసిన్ దగ్గర అనుపమ పరమేశ్వరన్, సిద్ధు జొన్నలగడ్డ షూస్ క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అనుపమ పరమేశ్వరన్‌ని చూసి సిద్ధు ‘మనసు విరిగినట్లుంది ఎక్కడనో.’ అని కామెంట్ చేస్తాడు. వెంటనే అనుపమ సీరియస్‌గా చూస్తుంది. సిద్ధు నవ్వుతూ ‘ఉన్నడా బాయ్‌ఫ్రెండు’ అని అడుగుతాడు. అనుపమ ‘నీకెందుకు’ అని ఎదురు ప్రశ్నించినప్పుడు ‘ఉంటే నా షూ నేను వేసుకుని వెళ్లిపోతా.’ అంటాడు. అనుపమ ‘లేకపోతే’ అన్నప్పుడు ‘నిన్నేసుకుని వెళ్లిపోతా’ అని సమాధానం ఇస్తాడు. ‘ఇప్పుడే కద కలిశాం అప్పుడే ఫ్లర్ట్ చేస్తున్నావా?’ అని అనుపమ అడిగితే ‘ఓపెన్‌గా అంటే నేను చేస్తున్న సంగతి నీకు తెలియాలి కదా... లేకపోతే చేసి ఉపయోగం ఏం ఉంది?’ అంటాడు. వెంటనే మ్యూజిక్ వేసి ‘టికెటే కొనకుండా’ అంటూ సాగే పాటను జులై 26వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

‘డీజే టిల్లు’ సినిమాలో టైటిల్ సాంగ్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ పాటను రామ్ మిరియాల ట్యూన్ చేసి, ఆయనే పాడారు. అందుకే ‘టికెటే కొనకుండా’ పాటను కూడా రామ్ మిరియాలతోనే ట్యూన్ చేయించి, ఆయనతోనే పాడిస్తున్నారు. ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్‌కు లిరిక్స్ అందించిన కాసర్ల శ్యామ్‌తోనే ఈ పాట కూడా రాయిస్తున్నారు.

మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

‘టిల్లు స్క్కేర్’ రిలీజ్ డేట్ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. సినిమా ప్రారంభం అయినప్పుడు 2023 మార్చిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆగస్టు 11వ తేదీన విడుదల కానుందని వార్తలు వచ్చాయి. కానీ చిరంజీవి ‘భోళా శంకర్’ అదే రోజు రిలీజ్ కానుండటంతో సెప్టెంబర్ 15వ తేదీన రానున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ నుంచి షిఫ్ట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది.

రామ్, బోయపాటిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టు ‘స్కంద’ అదే రోజు విడుదల కానుంది. దీంతోపాటు రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2’, విశాల్, ఎస్‌జే సూర్యల ‘మార్క్ ఆంటోని’ కూడా సెప్టెంబర్ 15వ తేదీన రానున్నాయి. ప్రస్తుతం అక్టోబర్ 6వ తేదీకి ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫస్ట్ సింగిల్ ప్రోమో, పోస్టర్‌లో కూడా విడుదల తేదీని తీసేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Embed widget