News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sai Dharam Tej - Manager Issue : సెట్‌లో గొడవ నిజమే - మేనేజర్‌ను మార్చేసిన సాయి ధరమ్ తేజ్

సాయి తేజ్, ఆయన మేనేజర్ సతీష్ మధ్య గొడవ జరిగిన మాట వాస్తవమేనని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ గొడవకు కారణం ఏమిటనేది బయటకు రాలేదు గానీ హీరో మేనేజర్‌ను మార్చేశారు.

FOLLOW US: 
Share:

మెగా కుటుంబం నుంచి వచ్చిన కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej). చిరు, పవన్ మేనల్లుడిగా పరిశ్రమకు పరిచయమైనా సరే... తెలుగు చిత్ర పరిశ్రమలో అందరితోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆ మధ్య 'మా' ఎన్నికల్లో సీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ, మెగా ఫ్యామిలీ వేర్వేరు వర్గాల్లో ఉన్నారు. అయితే, నరేష్ కుమారుడు నవీన్ & సాయి తేజ్ మంచి ఫ్రెండ్స్. ఆ స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. మనోజ్ మంచు కూడా సాయి తేజ్ సన్నిహిత మిత్రుల్లో ఒకరు. 

ఇండస్ట్రీలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న సాయి తేజ్... 'బ్రో' సినిమా  (Bro Movie) సెట్స్‌లో మేనేజర్ సతీష్ మీద అరిచారని, ఆగ్రహం వ్యక్తం చేశారని వచ్చిన వార్తలు పరిశ్రమ ప్రముఖుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. అసలు విషయం ఆరా తీస్తే 'అది నిజమే' అని తెలిసింది. 

సాయి తేజ్ దగ్గర సతీష్ లేరు!
'విరూపాక్ష' విజయవంతమైన తర్వాత జరిగిన ఓ మీడియా సమావేశంలో మేనేజర్ సతీష్ గురించి సాయి ధరమ్ తేజ్ ప్రత్యేకంగా మాట్లాడారు. అయితే, ఇప్పుడు ఆ సతీష్, సాయి తేజ్ మధ్య దూరం పెరిగింది. గొడవకు కారణం ఏమిటనేది ఇంకా బయటకు రాలేదు కానీ ఇక నుంచి సాయి తేజ్ మేనేజర్ సతీష్ కాదని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు సైతం అనధికారికంగా చెబుతున్నాయి.

Also Read అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ

గతంలో సాయి తేజ్ వ్యవహారాలు అన్నీ సతీష్ చూసేవారు. అయితే, కొన్ని రోజుల క్రితం గీతా ఆర్ట్స్ నుంచి సతీష్ పేరు ఉన్న మరొకరు రావడంతో తేజు, మేనేజర్ సతీష్ మధ్య మనస్పర్థలు వచ్చాయని ఫిల్మ్ నగర్ గుసగుస. ఈ విషయంలో ఎవరికి తోచిన కథలు వారు చెబుతున్నారు. అయితే, అసలు నిజం ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వచ్చి చెబితే కానీ తెలియదు.

Also Read బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్

Sai Dharam Tej Upcoming Movies : సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమాలకు వస్తే... జూలైలో మావయ్య పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో కలిసి 'బ్రో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  

సముద్రఖని 'బ్రో' మూవీకి దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. జూలై 28న ఈ  చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన 'రొమాంటిక్' కథానాయిక కేతికా శర్మ కనిపించనున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్ర చేస్తున్నారు.

'బ్రో' సినిమా కథేంటి?
తమిళంలో సముద్రఖని నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'వినోదయ సీతం' (Vinodhaya Sitham Telugu remake) చిత్రానికి తెలుగు రీమేక్ ఈ 'బ్రో'! కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రలో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకు కనిపించనున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. పవన్ మోడ్రన్ దేవుడి పాత్ర చేయడం రెండోసారి. ఇంతకు ముందు 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు.

Published at : 03 Jun 2023 11:24 AM (IST) Tags: Sai Dharam Tej Manager Satish Bro Movie Sets BKR Satish Sai Tej Vs Satish

ఇవి కూడా చూడండి

Naveen Polishetty: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి

Naveen Polishetty: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి

Jagapathi Babu: కుర్రాడిగా మారేందుకు జగ్గూ భాయ్ పాట్లు.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Jagapathi Babu: కుర్రాడిగా మారేందుకు జగ్గూ భాయ్ పాట్లు.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా?

VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్

Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!

Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!

Brahmamudi Serial : 'బ్రహ్మముడి' సీరియల్ హీరో హీరోయిన్ల మానస్, దీపిక మధ్య బ్రేకప్

Brahmamudi Serial : 'బ్రహ్మముడి' సీరియల్ హీరో హీరోయిన్ల మానస్, దీపిక మధ్య బ్రేకప్

టాప్ స్టోరీస్

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- సభ నుంచి టీడీపీ లీడర్ల సస్పెన్షన్

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- సభ నుంచి టీడీపీ లీడర్ల సస్పెన్షన్

Women's Reservation Bill: ప్రధానితో మహిళా ఎంపీల ఫొటోలు, స్వీట్లు పంపిణీ

Women's Reservation Bill: ప్రధానితో మహిళా ఎంపీల ఫొటోలు, స్వీట్లు పంపిణీ

Vande Bharat Express: నూతన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో మెరుగైన సౌకర్యాలు - 25 రకాల మార్పులు  

Vande Bharat Express: నూతన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో మెరుగైన సౌకర్యాలు - 25 రకాల మార్పులు