Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్
Balakrishna Birthday : బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన సూపర్ హిట్ సినిమాల్లో ఒకరైన 'నరసింహ నాయుడు' సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
![Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్ Balakrishna Birthday Special Narasimha Naidu to re release in Theatres On June 10th Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/02/eda8ecaa413f8af7c8c8d14b0a22c0231685705146414313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఆయన సూపర్ హిట్ సినిమాల్లో 'నరసింహ నాయుడు' (Narasimha Naidu Movie) ఒకటి. ఇప్పుడీ సినిమా మళ్ళీ థియేటర్లలోకి వస్తోంది.
బాలకృష్ణ బర్త్ డేకు రీ రిలీజ్!
జూన్ 10న గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ బర్త్ డే (Balakrishna Birthday). ఆ రోజే 'నరసింహ నాయుడు' సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ, ఏపీతో పాటు అమెరికాలోని కొన్ని లొకేషన్లలో సినిమా విడుదల కానుంది. బాలయ్య అభిమానులు భారీ ఎత్తున హంగామా చేయడానికి రెడీ అవుతున్నారు.
లక్స్ పాప... ఇప్పటికీ ఫేమస్సే!
'నరసింహ నాయుడు' సినిమాలో బాలకృష్ణ సరసన సిమ్రాన్, ప్రీతి జింగానియా, ఆషా షైనీ హీరోయిన్లుగా నటించారు. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు చిన్నికృష్ణ కథ అందించారు. మణిశర్మ సంగీతం అందించారు. సినిమాలో ఫ్యాక్షన్ సీన్లకు థియేటర్లలో ఫుల్ విజిల్స్ పడ్డాయి. ముఖ్యంగా బాలకృష్ణ ఉగ్ర నరసింహుడిగా మారి చేసిన యాక్షన్ సీన్లు ప్రేక్షకులు అందరినీ అలరించాయి.
ఇక, పాటల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. 'లక్స్ పాప' సాంగ్ ఇప్పటికీ ఫేమస్సే! ఎక్కడో ఒక చోట వినపడుతూ ఉంటుంది. 'కో కో కోమలి...', 'నిన్న కుట్టేసినాది...', 'చిలకపచ్చ కోక...' పాటలు కూడా హిట్టే. ఈ సినిమా మ్యూజిక్ అప్పట్లో సెన్సేషన్. మరోసారి థియేటర్లలో పాటలకు, ఫైట్లను ఫ్యాన్స్ చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
Also Read : 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
బాలకృష్ణ బర్త్ డేకు NBK 108 టైటిల్ కూడా!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఓ సినిమా (NBK 108) రూపొందుతోంది. హీరోగా ఆయన 108వ సినిమా అది. అందులో భగవంత్ కేసరి (Bhagavanth Kesari) పాత్రలో ఆయన కనిపిస్తారు. సినిమాకు కూడా ఆ టైటిల్ కన్ఫర్మ్ చేశారని తెలిసింది.
బాలకృష్ణ 108వ సినిమాకు 'భగవంత్ కేసరి' టైటిల్ ఖరారు చేశారని, ఆ విషయాన్ని బాలయ్య బర్త్ డేకు అనౌన్స్ చేస్తారని చిత్ర బృందం సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఆల్రెడీ సినిమాలో బాలకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేయనున్నారు. అందులో కొత్త లుక్ కనిపించే అవకాశం ఉంది.
'భగవంత్ కేసరి'లో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వాళ్ళిద్దరి కలయికలో తొలి సినిమా ఇది. ఇంతకు ముందు కొన్నిసార్లు ఈ కాంబినేషన్ కొంత మంది దర్శక, నిర్మాతలు పరిశీలనలోకి వచ్చినా సరే... సెట్ కాలేదు. ఈ సినిమాలో మరో హీరోయిన్ శ్రీ లీల ఉన్నారు. బాలకృష్ణకు వరుసకు కుమార్తె అయ్యే పాత్రలో ఆమె నటిస్తున్నారు. బాలకృష్ణ సోదరుడిగా శరత్ కుమార్ నటిస్తున్నారు. శ్రీ లీలకు తండ్రి పాత్ర ఆయనది. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేస్తున్నారు.
దసరా బరిలో బాలకృష్ణ సినిమా!
''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరా బరిలో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
Also Read : 'వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ రికార్డ్స్'లో ఎఫ్‌టిపిసి ఎన్టీఆర్ అవార్డ్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)