SAG Awards 2024: 'స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్'లో మెరిసిన 'ఓపెన్‌హైమర్' - అవార్డ్ విన్నర్ కంప్లీట్ లిస్ట్ ఇదే
SAG Awards 2024 Winners List: SAG అవార్డ్స్-2024 వేడుక లాస్ ఏంజిల్స్‌లోని ష్రైన్ ఆడిటోరియం & ఎక్స్‌పో హాల్‌లో జరిగింది. 2023 సంవత్సరానికిగాను సినిమా & టెలివిజన్ రంగంలో ఈ అవార్డులు ప్రధానోత్సవం చేసారు.
SAG Awards 2024: 30వ వార్షిక 'స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్' (SAG Awards) ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. 2023 సంవత్సరానికి గాను సినిమా & టెలివిజన్ రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులు, చిత్రాలకు వివిధ విభాగాల్లో అవార్డులను ప్రధానం చేశారు. లాస్ ఏంజిల్స్‌లోని ష్రైన్ ఆడిటోరియం & ఎక్స్‌పో హాల్‌లో జరిగిన ఈ ప్రోగ్రామ్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం అయ్యింది. ఈ వేడుకలో బిల్లీ ఎలిష్, అమెరికా ఫెర్రెరా, ఇద్రిస్ ఎల్బా, జెస్సికా చస్టెయిన్, రాబర్ట్ డౌనీ జూనియర్ లాంటి ప్రముఖ హలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
SAG అవార్డ్స్ 2024లో హాలీవుడ్ మూవీ "ఓపెన్‌హైమర్" బెస్ట్ కాస్ట్ మోషన్ పిక్చర్ తో సహా మూడు అవార్డులతో మెరిసింది. ఉత్తమ నటుడుగా సిలియన్ మర్ఫీ, ఉత్తమ నటిగా లిల్లీ గ్లాడ్ స్టోన్ అవార్డులు అందుకున్నారు. 'ది బేర్' మూవీ 3 అవార్డ్స్ గెలుపొందగా... 'ది లాస్ట్ ఆఫ్ అస్', 'బీఫ్' చిత్రాలు రెండేసి అవార్డులు సొంతం చేసుకున్నాయి. బెస్ట్ టీవీ డ్రామాగా 'సక్సెసన్' ఎంపికైంది.
30వ 'స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్-2024' విజేతలు వీరే...
– సినిమా –
• చలన చిత్రంలో ఉత్తమ తారాగణం: ఓపెన్‌హైమర్
• ఉత్తమ నటుడు: సిలియన్ మర్ఫీ - ఓపెన్‌హైమర్
• ఉత్తమ నటి: లిల్లీ గ్లాడ్‌స్టోన్ - కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
• ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ - ఓపెన్‌హైమర్
• ఉత్తమ సహాయ నటి: డావిన్ జాయ్ రాండోల్ఫ్ - ది హోల్డోవర్స్
• ఉత్తమ స్టంట్స్ (యాక్షన్ పెర్ఫార్మెన్స్) : మిషన్ ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ వన్
– టెలివిజన్ –
• ఉత్తమ డ్రామా సిరీస్ : సక్సెషన్
• ఉత్తమ నటుడు (డ్రామా సిరీస్) : పెడ్రో పాస్కల్ - ది లాస్ట్ ఆఫ్ అస్
• ఉత్తమ నటి (డ్రామా సిరీస్) : ఎలిజబెత్ డెబికి - ది క్రౌన్
• ఉత్తమ కామెడీ సిరీస్ : ది బేర్
• ఉత్తమ నటుడు (కామెడీ సిరీస్) : జెరెమీ అలెన్ వైట్ - ది బేర్
• ఉత్తమ నటి (కామెడీ సిరీస్) : అయో ఎడెబిరి - ది బేర్
• ఉత్తమ నటుడు (లిమిటెడ్ సిరీస్ లేదా టీవీ మూవీ) : స్టీవెన్ యూన్ - బీఫ్
• ఉత్తమ నటి (లిమిటెడ్ సిరీస్ లేదా టీవీ మూవీ) : అలీ వాంగ్ - బీఫ్
• ఉత్తమ టెలివిజన్ సిరీస్ స్టంట్స్ : ది లాస్ట్ ఆఫ్ అస్
'స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్' అవార్డ్స్ అనేది నటీనటులను ప్రత్యేకంగా గౌరవించే ఏకైక టెలివిజన్ అవార్డుల వేడుక. 1995లో ప్రారంభించిన ఈ అవార్డులను అత్యంత గౌరవంగా భావిస్తారు. ప్రతీ ఏడాది టీవీ మరియు మోషన్ పిక్చర్స్ లకు వివిధ విభాగాల్లో 15 అవార్డులను అందజేస్తారు. ఎప్పటిలాగే ఈసారి కూడా అత్యున్నత ప్రదర్శన కనబరిచిన నటీనటులను SAG-AFTRA సభ్యుల ఓటింగ్ ద్వారా ఎంపిక చేసి, అవార్డులను ప్రధానం చేసారు.
Also Read: చిరంజీవి సినిమా స్ఫూర్తితోనే ఆ పేరు పెట్టాను - 'చారి 111' డైరెక్టర్ కీర్తి కుమార్ ఇంటర్వ్యూ