అన్వేషించండి

TG Keerthi Kumar: చిరంజీవి సినిమా స్ఫూర్తితోనే ఆ పేరు పెట్టాను - 'చారి 111' డైరెక్టర్ కీర్తి కుమార్ ఇంటర్వ్యూ

TG Keerthi Kumar Interview: వెన్నెల కిశోర్ ని మైండ్‌లో పెట్టుకుని 'చారి 111' కథ రాసినట్లు దర్శకుడు టీజీ కీర్తీ కుమార్ చెప్పారు. రుద్రనేత్ర యూనివర్స్‌లోకి స్టార్ హీరోలను తీసుకురావాలని ఉందని తెలిపారు.

TG Keerthi Kumar interview on Chaari 111 movie: 'మళ్ళీ మొదలైంది' చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన టీజీ కీర్తి కుమార్... ఇప్పుడు 'చారి 111' వంటి స్పై కామెడీ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. కమెడియన్ వెన్నెల కిశోర్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో సంయుక్తా విశ్వనాథన్ నటించారు. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు డైరెక్టర్ కీర్తి కుమార్. ఆ విశేషాలు... 

ఎడిటర్ నుంచి డైరెక్టర్ గా...
''నేను ఎవరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదు. ఎడిటర్ గా కెరీర్ స్టార్ట్ చేశా. విజువల్ కమ్యూనికేషన్ కోర్స్ చేసి, టీవీ కమర్షియల్స్, కార్పొరేట్ ఫిలిమ్స్ ఎడిట్ చేశా. కాలేజీ రోజుల్లో పాకెట్ మనీ కోసం టీవీ సీరియల్స్ కూడా ఎడిటింగ్ చేశా. ఆ తర్వాత బెంగళూరు వెళ్లి యాడ్ ఫిల్మ్స్ ఎడిటింగ్ చేశా. కొన్ని యాడ్ ఫిల్మ్స్ కూడా డైరెక్ట్ చేశా. సుమారు పదేళ్లు యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి, 'మళ్ళీ మొదలైంది' సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టాను''

'చారి 111' ఎలా మొదలైందంటే..?
''మళ్ళీ మొదలైంది సినిమాలో వెన్నెల కిశోర్ కమెడియన్ రోల్ చేశారు. ఆ సినిమా చేసేటప్పుడే 'చారి 111' ఐడియా చెప్పాను. ఆయనతో చాలా రోజుల నుంచి ఇటువంటి సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఆయన నేరేషన్ ఇవ్వమనని అడగకుండా, స్క్రిప్ట్ సెండ్ చేయమని అడిగారు. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఓకే చెప్పారు. అలా ఈ సినిమా పట్టాలెక్కింది. 'పింక్ పాంథర్', 'జానీ ఇంగ్లీష్' వంటి హాలీవుడ్ ఫిలిమ్స్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ చిత్రాన్ని తీసాను''

విలన్ ఫేస్ అందుకే చూపించలేదు...
''వెన్నెల కిశోర్ బ్రిలియంట్ యాక్టర్. ఎన్నో సినిమాల్లో ఆయన కామెడీ అద్భుతంగా చేశారు. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్. నాకు ఆయనలో నటుడు అంటే ఇష్టం. 'జానీ ఇంగ్లీష్' ఫిల్మ్ చూసినప్పుడు నేను ఇండస్ట్రీలోకి వస్తే ఆయనతో అటువంటి సినిమా తప్పకుండా చేయాలని అనుకున్నాను. నా ఫస్ట్ సినిమాలో కమెడియన్ రోల్ చేశారు. ఇప్పుడు ఆయనతో 'చారీ 111' సినిమా చేశా. ఇటువంటి సినిమాలకు కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. కిశోర్, మురళీ శర్మని మనసులో పెట్టుకుని ఈ సినిమా స్క్రిప్ట్ రాశా. తర్వాత విలన్, కాన్‌ఫ్లిక్ట్ ఇష్యూ వచ్చాయి. విలన్ మాస్క్ ఎందుకు వేసుకుంటాడు అనేదానికి ఒక కారణం ఉంది. ప్రత్యేకంగా దాచాలని ఏమీ అనుకోలేదు. కథలో అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. దాన్ని మార్కెటింగ్ కోసం ఉపయోగించాం.''

చిరంజీవి 'రుద్రనేత్ర' సినిమానే స్ఫూర్తి... 
''ఇది స్పై యాక్షన్ కామెడీ జోనర్ ఫిల్మ్. 'జేమ్స్ బాండ్' స్పై యాక్షన్.. 'జానీ ఇంగ్లీష్' స్పై యాక్షన్ కామెడీ. నాది రెండో కేటగిరీ సినిమా. కిశోర్ ని మైండ్ లో పెట్టుకుని స్క్రిప్ట్ రాశా. ఆయన 'నో' అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది కాదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'రుద్రనేత్ర' సినిమా స్ఫూర్తితోనే 'చారీ 111'లో స్పై ఏజెన్సీకి 'రుద్రనేత్ర' అని పేరు పెట్టాను. 'చంటబ్బాయ్' సినిమాలో చిరంజీవి డిటెక్టివ్ రోల్ ఎలానో, మా సినిమాలో కిశోర్ స్పై రోల్ అలాగా ఉంటుంది'' 

'చారి 111' సినిమాకు సీక్వెల్...
''ఫ్యూచర్ లో స్టార్ హీరోలతో తప్పకుండా సినిమాలు చేయాలని ఉంది. వెన్నెల కిశోర్ ఓకే చేయడంతో 'మళ్ళీ మొదలైంది' తర్వాత ఈ సినిమా చేశా. నాకు యాక్షన్ ఎంటర్టైనర్స్ చేయాలని ఉంది. దానికి ముందు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. రచయితగా, దర్శకుడిగా, ప్రేక్షకుడిగా ఈ సినిమా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో రుద్రనేత్ర స్పై ఏజెన్సీ ఉంటుంది. అందులోకి మరింత మంది హీరోలను తీసుకురావాలని ఉంది. 'చారి 111'కు కూడా సీక్వెల్ ప్లాన్ ఉంది. ఈ యూనివర్స్ లో ఏ సినిమా చేసినా స్పై యాక్షన్ కామెడీ జానర్ ఫిల్మ్ అవుతుంది''

Also Read: ప్రపంచ సుందరికి ఈసారైనా హిట్టు దక్కేనా? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Embed widget