అన్వేషించండి

Rules Ranjann: ‘రూల్స్ రంజన్’ ఓటీటీ అప్డేట్ - ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అంటే?

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చివరి చిత్రం ‘రూల్స్ రంజన్’ ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి డేట్, టైమ్ ఫిక్స్ అయ్యింది.

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘రూల్స్ రంజన్’ నవంబరు నెలాఖరికి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత చాలాకాలం సరైన రిలీజ్ డేట్ దొరకక ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. ఇక అన్నీ ఓకే అనుకొని రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన తర్వాత మళ్లీ పలు కారణాల వల్ల పోస్ట్‌పోన్ అయ్యింది. ఫైనల్‌గా అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక థియేటర్లో విడుదలయ్యి ఇన్నాళ్లయినా ‘రూల్స్ రంజన్’ ఇంకా ఓటీటీలోకి రావడం లేదని ఎదురుచూసిన మూవీ లవర్స్‌కు మూవీ టీమ్ అప్డేట్ ఇచ్చింది.

‘సమ్మోహనుడా’తో మెప్పించిన ‘రూల్స్ రంజన్’..
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా జ్యోతీ కృష్ణ అలియాస్ రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘రూల్స్ రంజన్’. టైటిల్‌కు తగినట్టుగానే ఈ సినిమాలో కిరణ్.. అన్ని రూల్స్‌ను పాటించే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్‌ కంటే పాటలే సినిమాకు ఎక్కువగా హైప్‌ను తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ‘సమ్మోహనుడా’ పాట చార్ట్‌బస్టర్ అయ్యింది. ఈ పాటలో నేహా గ్లామర్‌కు యూత్ మరోసారి ఫిదా అయ్యారు. అంతే  కాకుండా నేహా వేసిన స్టెప్పులను ఇమిటేట్ చేస్తూ చాలామంది సోషల్ మీడియాను షేక్ చేశారు. ఇక ఈ పాటను ఓటీటీలో చూసే సమయం వచ్చేసింది.

ఓటీటీలో ఎప్పుడంటే..
నవంబర్ 30న ‘రూల్స్ రంజన్’ సినిమా ఓటీటీలోకి వస్తున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. కిరణ్ అబ్బవరం మునుపటి సినిమాలలాగానే ఈ మూవీ కూడా ఆహాలోనే స్ట్రీమ్ అవ్వనుంది. నవంబర్ 30న సాయంత్రం 6 గంటలకు ‘రూల్స్ రంజన్’ ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు అయ్యింది. స్టార్‌లైట్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దివ్యాంగ్‌ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మించిన ‘రూల్స్ రంజన్’ థియేటర్లలో పెద్దగా వసూళ్లను సాధించలేకపోయింది. దీంతో ఓటీటీలో అయినా ఈ మూవీని ప్రేక్షకులు ఆదరిస్తారని మూవీ టీమ్ ఆశిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దండయాత్ర..
2023లో కిరణ్ అబ్బవరం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. అందులో చివరిదే ‘రూల్స్ రంజన్’. ముందుగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో వచ్చిన కిరణ్.. ఆ సినిమాతో క్లీన్ హిట్‌ను అందుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ‘మీటర్’, ‘రూల్స్ రంజన్’ మాత్రం థియేటర్లలో ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్లిపోయాయో చాలామంది ప్రేక్షకులకు తెలియదు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ రావడంతో అసలు కిరణ్ అప్‌కమింగ్ మూవీ ఏంటి అని అప్డేట్ కూడా బయటికి రావడం లేదు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే.. మరో రెండు సినిమాలను ఒప్పుకొని వాటి షూటింగ్‌ను స్టార్ట్ చేసే కిరణ్ ప్రస్తుతం కాస్త సైలెంట్ అయ్యాడు. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా మూడు, నాలుగు నెలలకు ఒక సినిమాను విడుదల చేస్తున్నందుకు కిరణ్ అబ్బవరంపై ట్రోలింగ్ కూడా జరుగుతోంది. కనీసం ‘రూల్స్ రంజన్’ అయినా హిట్ అవుతుంది అనుకుంటే నేహా శెట్టి గ్లామర్ కూడా ఈ మూవీని కాపాడలేకపోయింది.

Also Read: ‘వార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ విడుదల ఎప్పుడంటే?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget