అన్వేషించండి

War 2 Release Date: ‘వార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ విడుదల ఎప్పుడంటే?

War 2 Release Date: ప్రతిష్టాత్మక బాలీవుడ్ మూవీ ‘వార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఇండిపెండెన్స్ డే కానుక‌గా 2025 ఆగ‌స్ట్ 14న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

War 2 Release Date: భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’. YRF స్పై యూనివ‌ర్స్‌ లో 6వ చిత్రంగా వ‌స్తున్నఈ సినిమాకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇండిపెండెన్స్ డే కానుక‌గా 2025 ఆగ‌ష్టు 14న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ‘బ్ర‌హ్మ‌స్త’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన  అయాన్ ముఖ‌ర్జీ ‘వార్‌ 2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోష‌న్‌, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్, వాణి కపూర్ కలిసి నటించిన ‘వార్’కు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. 

నెగెటివ్ రోల్ లో ఎన్టీఆర్!

‘వార్ 2’ సినిమాతో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో హృతిక్ రోష‌న్ హీరోగా నటిస్తుండగా, ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. హృతిక్ రోష‌న్‌కు ధీటుగా ప‌వ‌ర్‌ ఫుల్‌ పాత్రలో కనిపిస్తారనే టాక్ నడుస్తోంది. 2024 ఫిబ్ర‌వ‌రి నుంచి ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ పాల్గొంటారనే ప్రచారం జరుగుతోంది. భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో ఎన్టీఆర్ మూవీ సెట్స్ లోకి అడుగు పెడతారని తెలుస్తోంది. ముంబైలో షెడ్యూల్ లో ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్‌ మీద ఇంటెన్స్ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ ను తెరకెక్కించేందుకు దర్శకుడు ముఖ‌ర్జీ ప్లాన్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు తెలిసింది.

‘దేవర’ షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీ

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 'జనతా గ్యారేజ్' వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న 'దేవర'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమాని తెరకెక్కిస్తున్న కొరటాల. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో, బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ కూడా అతిధి పాత్రలో నటిస్తున్నారు.  రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రత్న వేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా మొదటి భాగాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. ‘దేవ‌ర’ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయ‌బోతున్నారు.

Read Also: రూ.20 కోట్ల బడ్జెట్ మూవీకి కలెక్షన్స్ రూ.40 లక్షలే - ఈ బిగ్టెస్ట్ ఫ్లాప్ మూవీ గురించి తెలుసా?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Gedela Raju OTT : రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Eknath Harika New House : కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
Oh Sukumari Review - ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
Kiara Advani : రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget