అన్వేషించండి

Biggest Flop Movie: రూ.20 కోట్ల బడ్జెట్ మూవీకి కలెక్షన్స్ రూ.40 లక్షలే - ఈ బిగ్టెస్ట్ ఫ్లాప్ మూవీ గురించి తెలుసా?

Biggest Flop Movie: స్టార్ హీరో, హీరోయిన్లు నటించిన ఓ చిత్రం బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా రికార్డుకెక్కింది. రూ.20 కోట్లతో సినిమా తీస్తే, కేవలం రూ.40 లక్షలు మాత్రమే వసూళ్లు అయ్యాయి.

Bollywood’s Biggest Flop Movie: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలను కుదేలు చేసింది. మరీ ముఖ్యంగా సినిమా పరిశ్రమను కోలుకోలేని దెబ్బకొట్టింది. దేశ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ మూత పడటంతో ఎంతో మంది కార్మికులు రోడ్డున పడ్డారు. మిగతా సినిమా పరిశ్రమలతో పోల్చితే, బాలీవుడ్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలు ఆ తర్వాతి సంవత్సరంలో పుంజుకున్నప్పటికీ, బాలీవుడ్ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కరోనా అనంతరం ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇష్టపడకపోవడంతో పలు సినిమాలు తీవ్రంగా నష్టపోయాయి. వాటిలో కొన్ని పెద్ద సినిమాలు, మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక డార్క్ కామెడీ హిందీ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇంతకీ ఆ మూవీ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం..

బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్లాప్ గా రికార్డు

దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ అనే సినిమా రూపొందింది. 2017లో ఈ సినిమా నిర్మాణం మొదలయ్యింది. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మార్చి 2020లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే, ఫిబ్రవరి, మార్చిలో దేశంలో కరోనా మరింత విజృంభించింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను మే వరకు వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించారు. కానీ, సినిమా థియేటర్లలో నెలల తరబడి మూతబడ్డాయి. విడుదల తేదీ మరింత ముందుకు పోస్ట్ పోన్ చేశారు. చివరికి, ఈ సినిమా మార్చి 19, 2021న విడుదలైంది. అదే నెలలో కరోనా సెకెండ్ వేవ్ ఆంక్షలను విధించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ప్రేక్షకులు కరువయ్యారు. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ దేశ వ్యాప్తంగా కేవలం రూ.40 లక్షలు వసూళు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.58 లక్షలు దక్కించుకుంది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత చెత్త వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సాధించింది.   

చిత్రబృందంపై తీవ్ర ప్రభావం

‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిన తర్వాత, ఆ ప్రభావం ఈ సినిమా కోసం పని చేసిన చాలా మంది మీద పడింది.  అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా కెరీర్ కు పెద్ద అడ్డంకిగా మారింది. ఈ సినిమా తర్వాత అర్జున్ కపూర్ ‘కుట్టే’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’, ‘ది లేడీ కిల్లర్‌’తో మరికొన్ని పరాజయాలను చవి చూశాడు. ఇప్పుడు తను  రోహిత్ శెట్టి  ‘సింగం ఎగైన్‌’లో విలన్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అటు పరిణీతి కూడా ‘సైనా’,  ‘కోడ్ నేమ్: తిరంగా’ చిత్రాలతో పరాజయాలను అందుకుంది. ఇప్పుడు అమర్ సింగ్ చమ్కిలా బయోపిక్‌లో దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి పని చేస్తోంది. దర్శకుడు దిబాకర్ బెనర్జీ మాత్రం‘ సందీప్ ఔర్ పింకీ ఫరార్’ పరాభవం తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు.   

Read Also: సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2‘పై నాగ చైతన్య కామెంట్స్ - మైండ్ బ్లోయింగ్

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget