Naga Chaitanya: సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2‘పై నాగ చైతన్య కామెంట్స్ - మైండ్ బ్లోయింగ్
Naga Chaitanya: సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‘ వెబ్ సిరీస్ పై నాగ చైతన్య ప్రశంసల జల్లు కురిపించారు. ఇండియన్ వెబ్ సిరీస్ లలో అదో మైండ్ బ్లోయింగ్ సిరీస్ అని చెప్పుకొచ్చారు.
Naga Chaitanya On Samantha Ruth Prabhu's The Family Man 2: అక్కినేని హీరో నాగ చైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు ‘తండేల్‘ మూవీ షూటింగ్ చేస్తూనే, మరోవైపు ‘ధూత‘ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతిష్టాత్మంగా నిర్మించిన ఈ సిరీస్ తో చై ఓటీటీలోకి అడుగు పెడుతున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ‘ధూత‘ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. స్ట్రీమింగ్ డేట్ దగ్గర పడటంతో ఆయన జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.
సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2‘పై నాగ చైతన్య ప్రశంసలు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ మధ్య బాగా నచ్చిన వెబ్ సిరీస్ ఏదనే ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా ‘ది ఫ్యామిలీ మ్యాన్‘ సిరీస్ అని చెప్పారు. సమంత నటించిన ఈ సిరీస్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఈ సిరీస్ లో ఆమె నటన మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇప్పటికీ సమంత నటించిన అన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లను చూస్తానని చై వెల్లడించారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2‘తో సమంత డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ లో శ్రీలంక ఆర్మీ చేతిలో అన్యాయానికి గురైన తమిళ యువతి రాజీ పాత్రలో సమంత నటించింది. బోల్డ్ పెర్ఫామెన్స్ తో షాక్ ఇచ్చింది. ఆమె నటనకు అప్పట్లో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి. ఈ సిరీస్ లో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, శరద్ కేల్కర్, నీరజ్ మాధవ్, షరీబ్ హష్మీ, దలీప్ తాహిల్, సన్నీ హిందుజా, శ్రేయ ధన్వంతరి కీలక పాత్రలు పోషించారు. అయితే, నాగ చైతన్య, సమంత మధ్య విభేదాలు రావడానికి కారణం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2‘ సిరీసే కారణమంటూ అప్పటిలో వార్తలు కూడా వచ్చాయి.
సమంత, నాగ చైతన్య సినిమాలు, రిలేషన్ షిప్ గురించి..
సమంత, నాగ చైతన్య తొలిసారి గౌతమ్ మీనన్ ‘ఏ మాయ చేసావే‘(2010) సినిమాలో నటించారు. ఈ సినిమాతోనే సమంత తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఆటోనగర్ సూర్య‘(2014), ‘మనం‘(2014), ‘మజిలీ‘ (2019) చిత్రాలలో కలిసి నటించారు. తొలి సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డ వీరిద్దరు అక్టోబర్ 2017 లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పలు కారణాలతో అక్టోబర్ 2021లో విడాకులు తీసుకున్నారు.
సమంతతో విడాకుల గురించి చై ఏమన్నారంటే?
అంతకు ముందు నాగ చైతన్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చైతన్య తన పెళ్లి, విడాకుల గురించి కీలక విషయాలు వెల్లడించారు. “నా పెళ్లి విషయంలో జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరం. కానీ, నా వివాహ జీవితం పట్ల చాలా గౌరవం ఉంది. మీడియా మా గురించి చాలా వరకు తప్పుడు రిపోర్టులు ప్రచురించాయి. మా గురించి ప్రజల్లో గౌరవం పూర్తిగా తగ్గిపోయింది. నాకు చాలా బాధ కలిగింది. సమంత చాలా మంచి అమ్మాయి. తను ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply