Golden Globe Awards: చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ - 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్
Golden Globe Awards: దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది. నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అందుకుంది.
Golden Globe Awards: భారతీయ సినిమా ప్రేక్షకులు అందరూ సగర్వంగా తల ఎత్తుకుని చూసే సమయం ఇది. అంతర్జాతీయ సినిమా వేదికపై దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మన జెండా ఎగురేశారు.
'ఆర్ఆర్ఆర్' సినిమాలో 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ సలాం కొట్టింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకుని మన సినిమా సత్తా చాటింది. అవార్డు ప్రకటించిన తర్వాత రాజమౌళి రియాక్షన్ వేల కోట్ల వసూళ్లు తీసిపోవని చెప్పా
భారత చలన చిత్ర పరిశ్రమలో మరో రికార్డు సొంతం చేసుకుంది ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర ప్రభంజనం మొదలైంది. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు ప్రకటించిన వెంటనే ఆ హాల్ మొత్తం ఒక్కసారిగా కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. అక్కడే ఉన్న ట్రుపుల్ ఆర్ టీం దీన్ని చూసి ఎంజాయ్ చేసింది.
ట్రిపుల్ ఆర్ సాధించిన అవార్డు భారతీయ చలనచిత్రం రంగం సెలబ్రేట్ చేసుకుంటుంది. చిత్ర యూనిట్‌కు మెగాస్టార్ చిరంజీవి కంగ్రాట్స్ చెప్పారు. అపూర్వమైన విజయం సాధించిన ట్రిపుల్ ఆర్ టీంకు టేక్ ఏ బో అంటూ చిరు ట్వీట్ చేశారు.
What a Phenomenal, Historic Achievement !!!! 👏👏👏👏
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 11, 2023
Golden Globes Best Original Song - Motion Picture Award to @mmkeeravaani garu !! Take a Bow!🙏
Heartiest Congratulations Team @RRRMovie & @ssrajamouli !!
India is proud of you! 🎉🎉 #NaatuNaatu 🕺🕺 pic.twitter.com/gl7QjMkJtZ
దర్శక ధీరుడు రాజమౌళి ఏం చేసినా ప్రత్యేకమే. ఆయన సినిమాల్లో, మాటల్లో, చేతల్లో మన సంప్రదాయం కనబడుతుంది, వినబడుతుంది, స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా ఆయన మార్క్ చూపించారు. దీనిని రాజమౌళితో పాటు 'ఆర్ఆర్ఆర్' టీమ్ సాధించిన ఘనతగా చూడాలి.
సుమారు ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు బెస్ట్ నాన్ - ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్' నామినేట్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ సైతం నామినేషన్ దక్కించుకున్నారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకకు కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి, కీరవాణి సతీసమేతంగా హాజరు అయ్యారు. వీరితో పాటు 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ కూడా ఉన్నారు. రెడ్ కార్పెట్ మీద 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం అందరి దృష్టిని ఆకర్షించింది
దర్శకుడు ధీరుడు రాజమౌళి డ్రస్సింగ్ స్టైల్ ఇండియన్ ట్రెడిషన్ అంటే ఏమిటో వెస్ట్రన్ జనాలకు చూపించింది. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, రాజమౌళి సతీమణి రామ, కీరవాణి సతీమణి శ్రీవల్లి చీరకట్టులో హాజరయ్యారు. భారతీయ సంప్రదాయంలో చీరకు ఉన్న ప్రాముఖ్యం ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగానే కాదు... అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ద్వారా మన భారతీయతను అక్కడి ప్రేక్షకులకు చూపించిన ఘనత రాజమౌళి అండ్ 'ఆర్ఆర్ఆర్' యూనిట్ సభ్యులకు దక్కుతుందని చెప్పాలి. ఇది జక్కన్న మార్క్ అని చెప్పాలి.