Pelli SandaD OTT Release: థియేటర్లలో విడుదలైన ఎనిమిది నెలలకు - ఈ వారమే ఓటీటీలో 'పెళ్లి సందD'
శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీ లీల జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ లో రూపొందిన 'పెళ్లి సందD' ఈ వారమే ఓటీటీలో విడుదల కానుంది. మరికొన్ని గంటల్లో సందడి చేయనుంది.
థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీ వేదికలోకి సినిమాలు వస్తున్న రోజుల్లోకి వచ్చేశాం. అఫ్‌కోర్స్... కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన వారానికే ఓటీటీలో దర్శనం ఇచ్చాయి. ఇంకొన్ని ఆలస్యంగా వచ్చాయి. అయితే... ఈ మధ్య కాలంలో థియేటర్లలో విడుదలైన ఎనిమిది నెలలకు ఓటీటీలో వస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది 'పెళ్లి సందD' అని చెప్పాలి.
శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీ లీల జంటగా నటించిన సినిమా 'పెళ్లి సందD'. గౌరీ రోణంకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి దర్శ కేంద్రులు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ వహించారు. గత ఏడాది అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల అయ్యింది. ఇన్నాళ్లకు... థియేటర్లలోకి వచ్చిన ఎనిమిది నెలలకు ఓటీటీలోకి వస్తోందీ సినిమా.
Also Read : గోవాలో యాక్సిడెంట్ - తీవ్ర గాయాలైన నటుడిని హెలికాప్టర్‌లో బెంగళూరుకు తరలించిన కుటుంబ సభ్యులు
జూన్ 24న... అనగా ఈ శుక్రవారమే జీ 5 ఓటీటీలో 'పెళ్లి సందD' డిజిటల్ రిలీజ్. ''పెళ్లి సందD చేయడానికి రెడీనా? మా సినిమా రేడీ! ముహుర్తం: 24 జూన్! అందరూ ఆహ్వానితులే'' అని 'జీ 5' ఓటీటీ పేర్కొంది. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఆయన తండ్రి శివశక్తి దత్తా, శ్రీధర్ సీపాన కథ అందించారు. ఈ సినిమాలో రాఘవేంద్ర రావు నటించడం విశేషం.
Also Read : కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు
View this post on Instagram