అన్వేషించండి

Devi Sri Prasad: మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దేవిశ్రీ - అర డజనుకు పైగా సినిమాలతో రాక్ స్టార్ ఫుల్ బిజీ

Devi Sri Prasad: నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో అర డజనుకుపైగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Devi Sri Prasad: సౌత్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ లో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఎన్నో సినిమాలకు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన డీఎస్పీ.. రెండు దశాబ్దాలపాటు తెలుగు తమిళ భాషల్లో టాప్ ప్లేస్ లో కొనసాగారు. మాస్, క్లాస్, రొమాంటిక్.. ఇలా అన్ని రకాల జోనర్స్ కి ఆయనే ఫస్ట్ ఛాయిస్ గా మారారు. అద్భుతమైన పాటలే కాదు, అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తారనే పేరు తెచ్చుకున్నారు. కాకపోతే గత కొంతకాలంగా డీఎస్పీ క్రేజ్ తగ్గిపోయిందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్. థమన్ హవా మొదలైన తర్వాత రేసులో కాస్త వెనకబడిపోయారని అన్నారు. అయితే ఇప్పుడు దేవిశ్రీ ఒకేసారి అర డజనుకు పైగా సినిమాలకు వర్క్ చేస్తూ అందరి నోళ్లు మూయించాడు. 

2020లో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాకు సంగీతం సమకూర్చిన దేవిశ్రీ ప్రసాద్.. 2021లో 'ఉప్పెన', 'పుష్ప: ది రైజ్' చిత్రాలతో సత్తా చాటారు. 2022లో 8 సినిమాలకు వర్క్ చేసినా, ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దొరకలేదు. ఇక 2023లో 'వాల్తేరు వీరయ్య' సినిమాకు మాత్రమే పని చేసారు. దీంతో అందరూ డీఎస్పీ పనైపోయిందనే కామెంట్స్ చేసారు. అయితే 'పుష్ప' చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న తర్వాత ఆయన పేరు మారుమోగిపోయింది. క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ ఆయన చెంతకు చేరడంతో మళ్ళీ ఫుల్ బిజీ అయిపోయారు. 

Also Read: కీర్తి సురేష్‌ 'సైరెన్' మోగేది ఓటీటీలో కాదు, థియేటర్లలోనే..!

దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పుష్ప: ది రూల్' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'పుష్ప 1' సాంగ్స్ వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో, ఇప్పుడు పార్ట్-2 పాటలు కూడా అదే రేంజ్ లో ఉంటాయని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఇక తమిళ హీరో సూర్య, డైరెక్టర్ శివ కలిసి చేస్తున్న 'కంగువ' అనే భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకి DSP పని చేస్తున్నారు.  

యువ హీరో నాగచైతన్య - చందు మొండేటి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ 'తండేల్' కు దేవిశ్రీనే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్ప్స్ లో నేపథ్య సంగీతానికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. దీంతో పాటుగా విశాల్ హీరోగా నటిస్తున్న 'రత్నం' చిత్రానికి కూడా వర్క్ చేస్తున్నారు. లేటెస్టుగా #DNS వంటి మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా డీఎస్పీ ఖాతాలోకి వచ్చి చేరింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున - ధనుష్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఇది తెలుగు తమిళం హిందీ భాషల్లో విడుదల కానుంది. అజిత్ కుమార్ నటించే #AK63 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిని తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

ఇలా అర డజనుకుపైగా పెద్ద సినిమాలు నేషనల్ అవార్డ్ విన్నర్ దేవిశ్రీ ప్రసాద్ లైనప్ లో ఉన్నాయి. వీటిల్లో కొన్ని చిత్రాలు ఈ ఏడాదే రిలీజ్ కాబోతున్నాయి. ఇవన్నీ తప్పకుండా సంగీత ప్రియులను అలరిస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాలని, అదే ఊపుతో రాబోయే రోజుల్లో రాక్ స్టార్ మరిన్ని చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించాలని కోరుకుంటున్నారు. 

Also Read: 'రత్నం' పూర్తి చేసి 'డిటెక్టివ్ 2' మీద ఫోకస్ పెట్టిన విశాల్! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Embed widget