Asia Cup 2025 Jasprit Bumrah’s Plane Crash Gesture: బుమ్రా రివర్స్ పంచ్.. ప్లెయిన్ క్రాష్ సిగ్నల్ తో రవూఫ్ కి చెక్.. సోషల్ మీడియాలో వైరలైన బుమ్రా సెలెబ్రెషన్స్
ఈసారి ఆసియకప్ హాట్ హాట్ గా జరుగుతోంది. భారత్, పాక్ జట్ల ఆటగాళ్లు దుందుడుకుగా ప్రవర్తించడంతో పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఫైనల్లో మరోసారి అలాంటి కాంట్రోవర్సీ నెలకొంది.

Asia Cup 2025 Ind Vs Pak Final Match Latest Updates: దాయదులు ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. ఓపెన్ సాహిబ్జాదా ఫర్హాన్ (57) సూపర్బ్ ఫిప్టీతో సత్తా చాటాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అయితే ఈ మ్యాచ్ లో భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా చేసిన గెశ్చర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. పాక్ బ్యాటర్ హారీస్ రవూఫ్ ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం ఫైటర్ జెట్ క్రాష్ అయినట్లుగా తను సంబరాలు చేసుకున్నాడు. తాజాగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో బుమ్రా గెశ్చర్ తో మీమ్స్, వీడియోలు చేస్తూ ఇరుదేశాల క్రికెట్ అభిమానులు బిజీగా ఉన్నారు.
Bumrah literally did THIS in front of Haris Rauf 😭🔥🔥🔥
— 𝕪𝕠𝕘𝕚 🇮🇳 (@yogi_halai) September 28, 2025
💥 KING STUFF ONLY 💥#INDvsPAK #AsiaCupFinal #Bumrah #HarisRauf #Cricket #Viral #BowlingMasterclass #IndVsPak2025 #CricketTwitter #CricketReels #T20 pic.twitter.com/S5OZjxwptT
ముందుగా రవూఫే..
నిజానికి ఇండియాతో జరిగిన లీగ్ మ్యాచ్ లో హరీస్ రవూఫ్.. భారత వికెట్లను తీసినప్పుడు ఇలా ప్లేయిన్ క్రాష్ సంబరాలు చేస్తూ, వార్తల్లో నిలిచాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియాకు చెందిన ఫైటింగ్ జెట్లను పాక్ కూల్చిందనే వాదనకు మద్దతుగా తను ఈ సంబరాలు చేసుకున్నాడు. అలాగే చేతులతో 6 అనే సిగ్నల్ చేస్తూ, భారత అభిమానులను రెచ్చగొట్టేలా ప్రయత్నించాడు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఐసీసీకి కూడా భారత్ ఫిర్యాదు చేయగా, దీనిపై విచారణ జరిపి, రవూఫ్ పై మ్యాచ్ ఫీజులో కోత విధించారు. ఇకపై మరి ఇలాంటి గెశ్చర్స్ చేయరాదని అతనికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
“Aa*d chahe kitna bada hojaye,
— Tanay (@tanay_chawda1) September 28, 2025
rehta La*d ke niche hi h” ✈️🇮🇳#bumrah #indvspak #asiacup2025 #harisrauf #indvspakfinal pic.twitter.com/nte4OnsKVu
బుమ్రా రివర్స్ పంచ్..
ఇక రవూఫ్ చేసిన గెశ్చర్ కు బదులుగా బుమ్రా తాజాగా ఇలాంటి సంబరాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్లో రాజకీయాలు, ఇతర అంశాలను సూచించే విధంగా గెశ్చర్స్ చేయరాదని ఐసీసీ ఇప్పటికే సూచించింది. ఈక్రమంలో బుమ్రా చేసిన ఈ సిగ్నల్ గురించి ఏం జరుగుతుందోనని సర్వాత్రా చర్చ జరుగుతోంది. ఇక ఆసియాకప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్.. తమ టైటిల్ ను నిలబెట్టుకునేందుకు రంగం సిద్దం చేసుకుంది. ఫైనల్లో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన ఇండియా.. వీలైనంత త్వరగా మ్యాచ్ ను ముగించాలని పట్టుదలగా ఉంది.




















