Rishab Shetty: భారీ బడ్జెట్, బాలీవుడ్ డైరెక్టర్ - లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘కాంతార’ హీరో
‘కేజీఎఫ్’ లాంటి చిత్రంతో తన మార్కెట్ స్థాయిని పెంచుకున్న శాండిల్‌వుడ్.. ఆ తర్వాత వచ్చిన ‘కాంతార’తో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకుంది.
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాలు ఒకటి తర్వాత ఒకటి కేవలం ఇండియన్ మాత్రమే కాదు ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నాయి. ముందుగా టాలీవుడ్.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తే.. ఆ తర్వాత కోలీవుడ్, మాలీవుడ్ కూడా ఇదే బాటలో నడిచాయి. అయితే వీటన్నింటిని దాటుకుంటూ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘కేజీఎఫ్’ లాంటి చిత్రంతో తన మార్కెట్ స్థాయిని పెంచుకున్న శాండిల్‌వుడ్.. ఆ తర్వాత వచ్చిన ‘కాంతార’తో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. అందుకే ‘కాంతార’లో రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన ఒక టాప్ బాలీవుడ్ డైరెక్టర్.. తనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్..
బాలీవుడ్ ప్రేక్షకులు మెల్లగా సౌత్ సినిమాలను ఎక్కువగా ఆదరించడం మొదలుపెట్టారు. అలా 2022లో కన్నడ సినిమా ‘కాంతార’ కూడా హిందీలో డబ్ అయినప్పుడు ఒక సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గతేడాది సైలెంట్‌గా వచ్చి హిట్ సాధించిన వాటిలో ‘కాంతార’ కూడా ఒకటి. దీంతో కొన్నాళ్ల పాటు బాలీవుడ్ మేకర్స్ చేసిన ఇంటర్వ్యూల్లో పాల్గొని అక్కడి వారికి దగ్గరయ్యాడు రిషబ్ శెట్టి. అంతే కాకుండా ‘కాంతార’కు వచ్చిన రెస్పాన్స్ చూసి ‘కాంతార 2’ను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ‘కాంతార’ రిలీజ్ అయిన కొన్నాళ్లకే ‘కాంతార 2’ను కూడా అనౌన్స్ చేశాడు. 2024లో ఇది ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఇంతలోనే ‘కాంతార 2’ తర్వాత రిషబ్‌ను తన సినిమాతో లాక్ చేయాలని చూస్తున్నాడు బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అషుతోష్ గోవర్కర్.
రైటర్స్ మనసులు కలిశాయి..
అషుతోష్ గోవర్కర్, రిషబ్ శెట్టి కొన్నాళ్లుగా కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు, ఇన్నాళ్లకు ఆ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టు బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఒక విలేజ్ నేటివిటీ ఉన్న కథపై అషితోష్ వర్క్ చేస్తున్నాడని, ఈ కథకు రిషబ్ అయితేనే సూట్ అవుతాడని అషుతోష్ భావించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అషుతోష్.. రిషబ్‌ను పలుమార్లు కలిశాడని, కథపై వర్కవుట్ చేసి సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. రిషబ్ కూడా ఒక రైటర్ కావడంతో కథలో కావాల్సిన మార్పులు చెప్పాడని, అషితోష్ కూడా వాటికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక వీరిద్దరు కలిసి మొదటిసారి చేతులు కలిపితే ఆ సినిమా ఎలా ఉంటుందో అని బాలీవుడ్ ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది.
‘కాంతార 2’ తర్వాతే..
రిషబ్‌తో తెరకెక్కించే చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని అషితోష్ నిర్ణయించుకున్నాడట. అందుకే ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో కూడా తెరకెక్కనున్నట్టు సమాచారం. రెండు నెలల్లో ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. రిషబ్ శెట్టి ‘కాంతార 2’పై పనిచేయడం అయిపోయిన తర్వాత అషుతోష్‌తో మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అషుతోష్ గోవర్కర్ సినిమాలు తెరకెక్కించే విషయంలో తొందరపడడు. రెండేళ్లకు ఒకసారి విడుదలయినా కూడా తన సినిమా ఔట్‌పుట్ మాత్రం పక్కాగా ఉండేలా చూసుకుంటాడు. అషుతోష్ చివరిగా 2019లో ‘పానిపట్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Also Read: అల్లు అర్జున్‌కు నిర్మాత మండలి లేఖ - సోషల్ మీడియాలో షేర్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial