అన్వేషించండి

Jai Hanuman: ‘జై హనుమాన్’లో కన్నడ స్టార్ హీరో, ప్రశాంత్ వర్మ ప్లాన్‌కు థియేటర్లు దద్దరిల్లాల్సిందేనా?

ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఈ సినిమా మరో లెవల్ కు వెళ్లడం ఖాయం.

Kannada Hero To Play The Lead Role In Jai Hanuman: ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీ పడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా ‘హనుమాన్’. తెలుగులోనే కాదు... దేశ వ్యాప్తంగా విడుదలైన ప్రతి చోటా అద్భుత విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. సుమారు రూ. 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్లు వసూళు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించారు. తొలి భాగానికి మించి ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటి వరకు పెద్దగా అప్ డేట్స్ ఏవీ రాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

‘జై హనుమాన్’లో కన్నడ స్టార్ హీరో మెయిన్ లీడ్

ప్రస్తుతం ‘జై హనుమాన్’ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీలో నటించే యాక్టర్లకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఈ చిత్రంలో ఓ కన్నడ స్టార్ హీరో మెయిన్ లీడ్ పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు, ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి. ప్రశాంత్ వర్మ మాదిరిగానే, రిషబ్ కూడా ‘కాంతార’ సినిమాతో దేశ వ్యాప్తంగా మాంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన ‘కాంతార 2’ కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ‘జై హనుమాన్’లో నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘జై హనుమాన్’ సినిమాలో మెయిన్ లీడ్ ను ఎవరి ఊహలకు అందుకుండా ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హనుమాన్, రాముడి పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే, రిషబ్ శెట్టి ఈ మూవీలో రాముడిగా కనిపిస్తారా? లేదంటే హనుమంతుడిగా కనిపిస్తాడా? అనేది త్వరలో తెలియనుంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్రశాంత్ వర్మ ప్రయత్నిస్తున్నారు.

‘జై హనుమాన్’ థియేటర్లలోకి వచ్చేది అప్పుడేనా?

‘జై హనుమాన్’ సినిమాను వెండితెరపై సరికొత్తగా ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో పెద్ద ఎత్తున వీఎఫ్ఎక్స్ ను ఉపయోగించనున్నారు. ఈ పనుల కోసం చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, ఈ సినిమా ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. నిజానికి ఈ సినిమాను 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ‘హనుమాన్’ సినిమా సమయంలో ప్రకటించారు. కానీ, అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2026 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.  

వరుస ప్రాజెక్టులతో ప్రశాంత్ వర్మ బిజీ

‘హనుమాన్’ క్రేజ్ తో ప్రశాంత్ వర్మ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. PVCU నుంచి కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత దానయ్య కుమారుడు కల్యాణ్ దాసరి హీరోగా ‘అధీరా’ అనే సినిమాను ప్రకటించారు. నందమూరి మోక్షజ్ఞను లాంచ్ చేయబోతున్నారు. ‘మహాకాళి’ అనే లేడీ సూపర్ హీరో మూవీని చేస్తున్నారు. ఈ సినిమాకు ఆయన కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నట్లు తెలిపారు.   

Read Also: బేబీ బంప్‌తో షాక్ ఇచ్చిన 'లెజెండ్' హీరోయిన్ - త్వరలో తల్లి కానున్న రాధికా ఆప్టే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Maharashtra Elections : మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Maharashtra Elections : మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
Jio Cloud PC: చిటికేస్తే మీ ఇంట్లో టీవీ కంప్యూటర్‌ అయిపోతుంది - 'జియో క్లౌడ్‌ పీసీ'తో మ్యాజిక్‌ చేయండి
చిటికేస్తే మీ ఇంట్లో టీవీ కంప్యూటర్‌ అయిపోతుంది - 'జియో క్లౌడ్‌ పీసీ'తో మ్యాజిక్‌ చేయండి
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Embed widget