Renu Desai: అందుకే ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశా, ఇన్‌స్టా్గ్రామ్ వదలకపోవడానికి కారణం ఇదే: రేణు దేశాయ్
Renu Desai: గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రేణు దేశాయ్.. యాక్టివ్‌గా ఉండడంతో తనపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి. దీంతో కొందరు తనను అకౌంట్ డిలీట్ చేయమని సలహా ఇవ్వగా వారికి కౌంటర్ ఇచ్చింది.
Renu Desai: సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియా అనేది చాలా ముఖ్యం. వారి సినిమా అప్డేట్స్ గురించి ఫాలోవర్స్‌తో షేర్ చేయడం, ప్రమోషన్స్ చేయడం అనేది చాలావరకు సినీ సెలబ్రిటీల జీవితాల్లో భాగమయిపోయారు. సినీ స్టార్లలో సోషల్ మీడియా ఉపయోగించని వారు చాలా తక్కువమంది ఉంటారు. అలాగే రేణు దేశాయ్‌కు కూడా ట్విటర్, ఫేస్‌బుక్ లాంటి వాటిలో అకౌంట్స్ ఏమీ లేవు. కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఆమె ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. తన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకోవాలని అనిపించేవి పోస్ట్ చేస్తుంటారు. తాజాగా తనకు ఇన్‌స్టాగ్రామ్ ఎందుకు ముఖ్యమో చెప్తూ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు రేణు దేశాయ్.
వాటికోసం మాత్రమే..
‘‘నాపై చూపిస్తున్న ద్వేషాన్ని, చేస్తున్న ట్రోల్స్‌ను చూడలేక నేను ట్విటర్ డిలీట్ చేశాను, ఫేస్‌బుక్ ఉపయోగించడం ఆపేశాను. కానీ మీలాంటి చాలామంది గొప్పవాళ్లు చెప్తున్నట్టుగా నేను నా ఇన్‌స్టాగ్రామ్‌ను డిలీట్ చేయలేను. ఎందుకంటే యాక్సిడెంట్ కేసులకు సహకరించడానికి, పిల్లలకు ఆహారం, మెడిసిన్స్ అందించడానికి, పిల్లులకు, కుక్కలకు మెడికల్ సౌకర్యాలు అందించడానికి, వాటి దత్తత వివరాలకు మాత్రమే 90 శాతం నేను ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తాను. గత 10 రోజుల్లో నేను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఉపయోగించే 4 పిల్లులను, ఎన్నో కుక్కలను కాపాడి వాటికి కొత్త ఇంటిని అందించగలిగాను’’ అని చెప్పుకొచ్చారు రేణు దేశాయ్.
డిలీట్ చేయలేను..
‘‘నేను నా ఇన్‌స్టాగ్రామ్ ఈ చారిటీకి సంబంధించిన రీల్స్‌ను పెద్దగా షేర్ చేయను. ఇదంతా నా ఇన్బాక్స్‌లోనే జరుగుతుంది. కాబట్టి నాకు నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కావాలి. నేను డిలీట్ చేయలేను’’ అని క్లారిటీ ఇచ్చారు రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్‌కు విడాకులు ఇచ్చి విడిగా ఉంటున్నప్పటి నుంచి రేణుపై నెగిటివిటీ పెరిగిపోయింది. కానీ అప్పట్లో తను సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండకపోవడం వల్ల తనను చాలామంది పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పవన్.. డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో ఆయనకు కంగ్రాట్స్ చెప్తూ, అకిరా, ఆద్య.. ఆయనతో గడుపుతున్న సమయం గురించి ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటున్నారు రేణు.
View this post on Instagram
ఇదే సమాధానం..
ఇప్పటివరకు తమ కుమారుడు అకిరా నందన్ కూడా రేణు దేశాయ్ పెద్దగా పోస్ట్ చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి వారిద్దరికీ సంబంధించిన పోస్టులు ఎక్కువయ్యాయి. దీంతో ఆ పోస్టులకు వచ్చే నెగిటివ్ కామెంట్స్ కూడా పెరిగిపోయాయి. అకిరాను జూనియర్ పవర్ స్టార్ అంటూ, హీరోను చేయమంటూ రేణుకు మెసేజ్‌లు చేయడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. అలా అభిమానులు పెడుతున్న మెసేజ్‌లు తనకు నచ్చకపోతే.. వాటిని షేర్ చేసి మరీ కౌంటర్లు ఇస్తున్నారు రేణు దేశాయ్. అలా స్పందించడం కంటే ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేయవచ్చు కదా అని కొందరు ఇస్తున్న సలహాకు రేణు.. రీసెంట్ పోస్టే సమాధానం.
Also Read: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్