అన్వేషించండి

Renu Desai: పవన్‌ గురించి చెప్పమంటూ ఫ్యాన్స్‌‌ రిక్వెస్ట్‌ - నేరుగా ఆయనకే ఫోన్‌ చేసి మాట్లాడతా, రేణు దేశాయ్‌ కామెంట్స్‌

Renu Desai Comments: పవన్‌ కళ్యాణ్ గురించి చెప్పమని కోరిన ఓ ఫ్యాన్ కామెంట్ కి రేణు దేశాయ్‌ ఊహించని రిప్లై ఇచ్చారు. ఏం చెప్పాలనుకున్నా ఆయనకే నేరుగా ఫోన్ గా చేస్తానంటూ కామెంట్ చేశారు.

Renu Desai Said She Called Her Ex Husband Pawan Kalyan Directly: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల అనంతరం రేణు దేశాయ్‌ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌ అయ్యారు. తరచూ తన తనయుడు అకిరా గురించిను విషయాలను షేర్‌ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. గెలుపు అనంతరం జనసేనాని తన తనయుడు అకిరా నందన్‌ తన పక్కనే పెట్టుకున్నాడు. ఎటూ వెళ్లిన తనయుడిని వెంటబెట్టుకునే ఉంటున్నారు. అకిరాతో కలిసి మంగళగిరికి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిశారు. అకిరాను కూడా చంద్రబాబుకి పరిచయం చేశారు.

అది క్రాప్డ్ ఫోటో కాదు

అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు. అప్పుడు కూడా అకిరా పవన్‌ పక్కనే ఉన్నాడు. ఇక అకిరా ప్రధాని కలవడంపై రేణు దేశాయ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అకిరా ప్రధానితో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ఒక తల్లిగా తనకు ఇది ఎనలేని సంతోషాన్ని ఇచ్చిన సందర్భం ఇదని, అకిరాని అలా ప్రధాని పక్కన చూసి తన మనసు ఉద్వేగానికి లోనైందంటూ ఆమె ఎమోషనల్‌ అయ్యారు. అయితే ఈ సందర్బంగా రేణు దేశాయ్‌ షేర్‌ చేసిన ఫోటో నెట్టింట తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అసలు అకిరా వెళ్లిందే పవన్‌ కళ్యాణ్‌ వల్ల కానీ, ఆయన ఫోటో లేకుండా క్రాప్‌ చేసి కేవలం అకిరా ఉన్నదే షేర్‌ చేయడమేంటని ఓ నెటిజన్‌ రేణు దేశాయ్‌ని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. మీరు ఏడ్చింది చాలు. ఇది క్రాప్డ్‌ ఫోటో కాదు.  కేవలం అకిరా, పీఎం గారు మాత్రమే దిగిన ఒరిజినల్‌ ఫోటో. 

Renu Desai: పవన్‌ గురించి చెప్పమంటూ ఫ్యాన్స్‌‌ రిక్వెస్ట్‌ - నేరుగా ఆయనకే ఫోన్‌ చేసి మాట్లాడతా, రేణు దేశాయ్‌ కామెంట్స్‌

నేరుగా పవన్ కే ఫోన్ చేస్తా

కానీ ప్రతి విషయంలో మీరు ఏడ్చేందుకు వెతుక్కుంటున్న సాకులు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. కానీ నిన్న పెట్టనవి  అన్ని పవన్‌ కళ్యాణ్‌, పీఎం మోదీతో అకిరా ఉన్న ఫోటోలు. కానీ ఇది ఒరిజినల్‌ ఫోటేనే" అంటూ బదులు ఇచారు రేణు దేశాయి.ఇక మరో నెటిజన్‌ ఇలా కామెంట్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ అన్న గురించి ఏమైనా చెప్పోచ్చు కదా వదిన గారు. ఆయన గురించి మీరు ఏమైనా చెబుతారని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. కానీ మీరు ఏ పోస్ట్‌లోనూ ఆయన గురించి చెప్పడం అదని అడిగారు. దీనికి ఆమె స్పందిస్తూ.. మళ్లీ నేను ఏం చెప్పినా అందరు అటెన్షన్‌ కోసం మాట్లాడుతున్నా అంటారు. ఏదైనా నేను చెప్పాలి అనుకుంటే నేరుగా ఆయనకే(పవన్‌ కళ్యాణ్‌) ఫోన్‌ చేసి చెబుతాని. కాబట్టి మీరంత సంతోషంగా ఉండండి" అంటూ రిప్లై ఇచ్చారు. 

Renu Desai: పవన్‌ గురించి చెప్పమంటూ ఫ్యాన్స్‌‌ రిక్వెస్ట్‌ - నేరుగా ఆయనకే ఫోన్‌ చేసి మాట్లాడతా, రేణు దేశాయ్‌ కామెంట్స్‌

పవన్‌ కళ్యాన్‌ మోదీకి అకిరాను పరిచయం చేయగానే ఆయన ఏదో అనడంతో అకిరా కాస్తా సిగ్గుపడుతూ కనిపించాడు. అయితే అక్కడ అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఓ నెటిజన్‌ రేణు దేశాయ్‌ని కామెంట్‌ సెషన్‌ అడిగారు. "మోదీ అకిరా హైట్‌ గురించి మాట్లాడారని, అకిరాను పవన్‌ గారు పరిచయం చేయగాని. ఇతను బాస్కెట్‌ బాల్‌ ఆడతాడా? అంటూ హైట్‌ గురించి చమత్కిరించారట. దాంతో అకిరా కాస్తా సిగ్గుపడ్డాడు" అంటూ రేణు దేశాయ్‌ చెప్పుకొచ్చారు. 

Also Read: పవన్‌ విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌లో కనిపించని అల్లు అర్జున్‌ - అనుకున్నదే నిజమైందా? ఆ ఒక్క ట్వీట్‌ దూరం పెంచిందా..

ఇక అకిరా హైట్‌ సీక్రెట్‌ అని అడగ్గా.. కేవలం వెజ్‌ మాత్రమే తింటాడు. ఇంట్లో వండిన ఆర్గానిక్‌ ఫుడ్‌. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆసమ్‌ జెనటిక్‌" ఒక్క ముక్కలో తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. ఇలా రేణు దేశాయ్‌ ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు ఒపిగ్గా సమాధానం ఇచ్చారు. అలాగే అకిరా ప్రధాని పక్కన నిలబడం చూసి ఎమోషనల్‌ అయినా ఆమె "మై బేబీ భవిష్యత్తులో తన సొంత గుర్తింపు(అకిరా నందన్‌గా) మరోసారి ప్రధాని పక్కన నిలబడాలని తల్లిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ ఆమె కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake prediction for Ramagundam: రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
YS Jagan Security Dispute: జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
IPL 2025 DC VS RCB Result Update: ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. డీసీని గెలిపించిన రాహుల్.. 
ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. 93 రన్స్ తో డీసీని గెలిపించిన రాహుల్.. 
Gorantla Madhav arrest:  పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs DC Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జయభేరి | ABP DesamMS Dhoni to Lead CSK IPL 2025 | సీఎస్కే ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్..ఓ బ్యాడ్ న్యూస్ | ABP DesamRCB vs DC Match Preview IPL 2025 | పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొదమ సింహాల ఢీSai Sudharsan Batting IPL 2025 | 30 మ్యాచులుగా వీడిని డకౌట్ చేసిన మగాడే లేడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake prediction for Ramagundam: రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
YS Jagan Security Dispute: జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
IPL 2025 DC VS RCB Result Update: ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. డీసీని గెలిపించిన రాహుల్.. 
ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. 93 రన్స్ తో డీసీని గెలిపించిన రాహుల్.. 
Gorantla Madhav arrest:  పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
Mega Star Chiranjeevi On Mark Shankar:
"మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు" హ్యాపీ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి 
CSK Captain MS Dhoni: చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్‌
చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్‌
Mangalagiri Latest News: మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి  నెల 13న శంకుస్థాపన చేయనున్న లోకేష్
మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి నెల 13న శంకుస్థాపన చేయనున్న లోకేష్
Kohli Stunning Record:  కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్లో ఆ ఫీట్ చేసిన తొలి ప్లేయ‌ర్.. ఇప్ప‌టికే ఎన్నో రికార్డులు త‌న పేరిటే..
కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్లో ఆ ఫీట్ చేసిన తొలి ప్లేయ‌ర్.. ఇప్ప‌టికే ఎన్నో రికార్డులు త‌న పేరిటే..
Embed widget