అన్వేషించండి

Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!

Actor Delhi Ganesh: ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ వయో సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెందారు. ఆయన డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.

Delhi Ganesh Passed Away: తమిళ చిత్ర పరిశ్రమకు పెద్ద షాక్. వయో సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ మరణించారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన అంత్యక్రియలను ఈరోజు (నవంబర్ 10వ తేదీ) నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు మహాదేవన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

400కు పైగా సినిమాల్లో...
ఢిల్లీ గణేష్ తమిళంలో 400కు పైగా చిత్రాల్లో నటించారు. 1976 సంవత్సరంలో బాలచందర్ దర్శకత్వం వహించిన ‘పత్తిన ప్రవేశం’ అనే తమిళ సినిమా ద్వారా ఆయన వెండి తెరకు పరిచయం అయ్యారు. కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు, హిందీ, మలయాళం సినిమాల్లో కూడా ఢిల్లీ గణేష్ నటించారు. తమిళంలో సింధు భైరవి, నాయకుడు, అపూర్వ సగోదరగళ్, మైకేల్ మదన కామ రాజు, ఆహా, తెనాలి, హే రామ్, ఇరువర్ వంటి ప్రముఖ సినిమాల్లో ఈయన నటించారు.

Read Also: ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ ఫోటో లీక్ - అల్లు అర్జున్ తో శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు!

మెగాస్టార్ చిరంజీవికి డబ్బింగ్ కూడా...
కె.బాలచందర్ దర్శకత్వంలో ‘47 నాట్కల్’ అనే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పోషించిన కుమార్ పాత్రకు ఢిల్లీ గణేష్ డబ్బింగ్ చెప్పారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తమిళ డబ్బింగ్ వెర్షన్ ‘కాదల్ దేవతై’లో కూడా మెగాస్టార్ పాత్రకు ఢిల్లీ గణేష్‌నే డబ్బింగ్ చెప్పడం విశేషం. చిరంజీవితో పాటు విష్ణు వర్థన్, ప్రదీప్ పోతన్, నెడుముడి వేణు లాంటి దిగ్గజ నటుల పాత్రలకు కూడా తమిళంలో ఆయన డబ్బింగ్ చెప్పారు. 

‘ఇండియన్ 2’లో చివరిసారిగా...
కమల్ హాసన్, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇండియన్ 2’లో ఢిల్లీ గణేష్ చివరిసారిగా కనిపించారు. 2024లో ఆయన విశాల్ హీరోగా నటించిన ‘రత్నం’, సుందర్ సి దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన ‘అరణ్మనై 4’ సినిమాల్లో కూడా నటించారు. ఆయన మృతిపై పలువురు సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: హీరోయిన్ లేకుండానే తెరపైకి రాబోతున్న "మ్యాడ్ స్క్వేర్".. కానీ టిల్లు గానీ పిల్లది మాత్రం స్పెషల్ రోల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Embed widget