అన్వేషించండి

Regina OTT Release: రెండు ఓటీటీల్లోకి రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్ 'రెజీనా'

డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ 'రెజీనా' జూన్23న విడుదలై సినీ అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చింది. తాజాగా ఈ మూవీ రెండు ఓటీటీల్లో రిలీజ్ కానున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి

Regina in OTT Platforms : కోలీవుడ్ నటి సునైనా నటించిన తమిళ చిత్రం 'రెజీనా(Regina)' జూన్ 23న థియేటర్లలో విడుదలైంది. నూతన దర్శకుడు డొమిన్ డిసిల్వా(Domin DSilva) దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు రెండు ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలో జూలై 25, 2023 నుంచి ఈ సినిమా ప్రీమియర్ అవనున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అదే రోజు తెలుగు, ఇతరాత్ర భాషల్లో కూడా ఈ మూవీని రిలీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

థియేటర్లలో మెజారిటీ ప్రేక్షకులను మెప్పించడంలో 'రెజీనా' విఫలమైంది. అనంత్ నాగ్, నివాస్ ఆదితన్ తదితరులు సహాయక పాత్రల్లో నటించిన ఈ సినిమా.. ఎల్లో బేర్ ప్రొడక్షన్‌కు చెందిన సతీష్ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. ఈ మహిళా సెంట్రిక్ మూవీని షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ బాగానే శ్రమించినట్టు తెలుస్తోంది. దట్టమైన కొండ ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్‌ జరిగింది. హీరోయిన్‌ సునైన తన ఇమేజ్‌ను పక్కనపెట్టి మరీ.. ఈ సినిమా కోసం ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా మారిపోయారు. చిత్ర షూటింగ్ నిమిత్తం అవసరమైన సామగ్రిని యూనిట్‌ సభ్యులతో పాటు హీరోయిన్‌ సునైన కూడా మోసుకెళ్ళినట్లుగా చిత్రయూనిట్ గతంలోనే ప్రకటించింది. దీంతో ఈ సినిమా కోసం ఆమె సాహసమే చేసిందని కూడా చిత్ర బృందం వెల్లడించింది. 

Read Also : Amy Jackson: గేట్‌వే ఆఫ్ ఇండియా ముందు లిప్ లాక్‌తో రెచ్చిపోయిన ఎమీ జాక్సన్

భుజంపై సునైన ఒక బ్యాగును మోసుకెళ్తున్న ఫొటోను అప్పట్లో మేకర్స్ రిలీజ్‌ చేశారు. ప్రొడక్షన్‌ సిబ్బందితో పాటు ఆమె కూడా కష్టపడటం గమనార్హం. కేరళలోని తొడుపుళ కొండల్లో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందుకోసం అవసరమైన సామాగ్రిని వాహనాల్లో తీసుకెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో ప్రొడక్షన్‌ సిబ్బందే లొకేషన్‌ స్పాట్‌కు స్వయంగా మోసుకెళ్లారు. వీరికి సునైన కూడా తన వంతు సాయం చేశారు. ఈ విషయం అప్పట్లో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

సతీష్‌ నాయర్‌  నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా.. బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో ఒక యువతి జీవితం ఎలా మలుపు తిరిగిందనేది స్టోరీగా తెలుస్తోంది. ఓ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ప్రేక్షకులను మాత్రం ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా సెన్సార్ నుంచి U/A సర్టిపికేట్‌ను సొంతం చేసుకుంది.

పద్దెనిమిదేళ్ల క్రితం వచ్చిన 'కుమార్ వర్సెస్ కుమారి(Kumari Vs Kumari)' సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది తమిళ బ్యూటీ సునయన. ఈ తర్వాత 'సమ్ థింగ్ స్పెషల్(Something Special)', 'టెన్త్ క్లాస్' ఇలా తెలుగులోనే తొలి మూడు సినిమాలు చేసింది.

Read Also : Most Popular Indian Stars: ఇండియాలోనే మోస్ట్ పాపులర్ స్టార్ ఎవరో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Vijay Devarakonda Rashmika: రష్మికతో లంచ్ చేస్తూ కనిపించిన విజయ్ దేవరకొండ - వైరల్ అవుతున్న ఫొటో!
రష్మికతో లంచ్ చేస్తూ కనిపించిన విజయ్ దేవరకొండ - వైరల్ అవుతున్న ఫొటో!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Vijay Devarakonda Rashmika: రష్మికతో లంచ్ చేస్తూ కనిపించిన విజయ్ దేవరకొండ - వైరల్ అవుతున్న ఫొటో!
రష్మికతో లంచ్ చేస్తూ కనిపించిన విజయ్ దేవరకొండ - వైరల్ అవుతున్న ఫొటో!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Embed widget