Amy Jackson: గేట్‌వే ఆఫ్ ఇండియా ముందు లిప్ లాక్‌తో రెచ్చిపోయిన ఎమీ జాక్సన్
'రోబో' భామ అమీ జాక్సన్ తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కలిసి ముంబైకి వచ్చింది. గేట్ వే ఆఫ్ ఇండియా ముందు ప్రియుడికి లిప్ లాక్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హాట్ బ్యూటీ అమీ జాక్సన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'ఎవడు', 'ఐ', 'రోబో 2.0' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. పెళ్లి కాకుండానే గర్భం దాల్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఓ బిడ్డకు జన్మనిచ్చి, మూడేళ్లు తిరక్కుండానే బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ చెప్పి అవాక్కయ్యేలా చేసింది. అయితే ఎమీ ఇప్పుడు తన కొత్త ప్రియుడితో కలిసి ముంబైలో వాలిపోయింది. వచ్చీ రాగానే గేట్ వే ఆఫ్ ఇండియా ముందు నిలబడి బాయ్ ఫ్రెండ్ కి లిప్ లాక్ ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమీ జాక్సన్ ప్రస్తుతం ఎడ్వర్డ్ జాక్ పీటర్ వెస్ట్ విక్ అనే ఇంగ్లీష్ యాక్టర్ తో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ముంబై వచ్చిన ఈ జంట, నగరంలో క్వాలిటీ సమయాన్ని గడుపుతున్నారు. ఐకానిక్ ప్రదేశాలను సందర్శిస్తూ, ఎప్పటికప్పుడు ఆ విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా గేట్ వే ఆఫ్ ఇండియా, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో తీసుకున్న ఫోటోలను పంచుకున్నారు.
ఎడ్ వెస్ట్ విక్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ఫోటోలో, ఈ జంట ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. గేట్ వే ఆఫ్ ఇండియా ముందు అమీ - ఎడ్ లిప్ లాక్ చేసుకుంటున్న ఈ పిక్ పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో పాటుగా వీరిద్దరూ ఒకరినొకరు కౌగించుకొని తీసుకున్న సెల్ఫీ ఫోటో కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది. అలానే తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ ముందు నిలబడి ఉన్న మరో ఫోటోని కూడా ఎడ్ పంచుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
పెళ్లి కాకుండానే తల్లైన ఎమీ..
ఎమీ జాక్సన్ 2015 నుంచి బ్రిటన్ బిజినెస్ మ్యాన్ ఆండ్రియాస్ పనయియోటౌ కుమారుడు జార్జ్ పనయిటౌతో డేటింగ్ చేస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత, పెళ్ళి చేసుకోకుండానే ప్రగ్నెంట్ అయిన విషయాన్ని వెల్లడించింది. తరచుగా బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. 2019 సెప్టెంబర్ లో పండంటి మగబిడ్డకు జన్మిచ్చిన జాక్సన్.. 2022 లో జార్జ్ తో బ్రేకప్ చేసుకుంది. అప్పటి నుంచి ఎడ్ వెస్ట్ విక్ తో డేటింగ్ ప్రారంభించింది.
కాగా, 2009లో మిస్ టీన్ వరల్డ్ టైటిల్ ను గెలుచుకున్న బ్రిటన్ మోడల్ అమీ జాక్సన్.. 2010లో ఆర్య హీరోగా నటించిన 'మదరాసిపట్నం' అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తరువాత 'ఏంమాయ చేశావే' హిందీ రీమేక్ గా తెరకెక్కిన 'ఏక్ దివానా థా' మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. విక్రమ్ సరసన 'శివ తాండవం' అనే చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. రామ్ చరణ్ 'ఎవడు' సినిమాలో టాలీవుడ్ కు పరిచయమైంది.
శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రూపొందిన 'ఐ' సినిమాలో ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత 'నవ మన్మథుడు', 'పోలీసోడు', 'అభినేత్రి', 'సింగ్ ఈజ్ బ్లింగ్', 'ఫ్రీకీ అలీ', 'ది విలన్' వంటి చిత్రాల్లో నటించింది. చివరగా 2018లో రజినీ కాంత్ హీరోగా తెరకెక్కిన 'రోబో 2.0' సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. అయితే తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో నటించినా, స్టార్ హీరోలతో జోడీ కట్టినా, అగ్ర దర్శకులతో వర్క్ చేసినా అమ్మడికి ఆశించిన స్టార్ డమ్ రాలేదు. దీంతో లండన్ చెక్కేసింది.
సినిమాలలో నటించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం స్కిన్ షోతో అదరగొడుతుంది అమీ. ఒక బిడ్డకు తల్లైనా కూడా బికినీలు ధరిస్తూ, తన హాట్ అందాలతో అందరిని ఆకర్షిస్తుంది. అయితే ఈ బ్యూటీ ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. 'మిషన్ చాప్టర్ 1' అనే తమిళ్ మూవీలో అరుణ్ విజయ్ తో కలసి నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
Read Also: కంటెంటే కింగ్, ప్రేక్షకుల నాడి పట్టుకున్నవారికే సక్సెస్ - 2023 సెకండాఫ్‌లో హిట్టు కొట్టేదెవరు?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial