News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Most Popular Indian Stars: ఇండియాలోనే మోస్ట్ పాపులర్ స్టార్ ఎవరో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు!

ఓర్మాక్స్ మీడియా సంస్థ ఎప్పటిలాగే 2023 జూన్ నెలకు సంబంధించి 'మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్' జాబితాను ప్రకటించింది. ఇందులో ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారో తెలుసుకుందాం.

FOLLOW US: 
Share:

బాలీవుడ్‌ విశ్వసనీయ మీడియా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఓర్మాక్స్ మీడియా (ORMAX MEDIA).. ప్రతీ నెల మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను విడుదల చేస్తుందనే సంగతి తెలిసిందే. 2010 నుండి ప్రతీ నెల ఫిల్మ్, టీవీ, ఓటీటీ, స్పోర్ట్స్, మ్యూజిక్ విభాగాల్లో సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాను ప్రకటిస్తూ వస్తోంది. లేటెస్టుగా 2023 జూన్ నెలకు గాను మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ మరియు ఫీమేల్ స్టార్స్ లిస్టును ప్రకటించింది. ఇందులో ఆల్ ఇవర్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన మేల్ స్టార్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నిలిచారు.

ఓర్మాక్స్ మీడియా ప్రకారం జూన్ లో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాలో విజయ్ మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'వారసుడు' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్, బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలానే విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో నటిస్తున్న 'లియో' ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై, ఇంటర్నెట్ ను షేక్ చేసింది. దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కోసం అందరూ ఆతృతగా వేచి చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతోంది. 

అంతేకాదు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'జవాన్‌' సినిమాలో విజయ్ అతిధి పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అలానే త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని, పాదయాత్ర చేయబోతున్నారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలా ఏదొక విధంగా విజయ్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అందులోనూ ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే జూన్ లో అత్యంత ప్రజాదరణ కలిగిన నటుడిగా నిలిచారని చెప్పాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే, విజయ్ 2023 జనవరి నుంచి జూన్ వరకూ ప్రతీ నెలా మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ లిస్టులో అగ్ర స్థానంలో ఉన్నాడు. 

View this post on Instagram
 
A post shared by Ormax Media (@ormaxmedia)

'పఠాన్' తో కంబ్యాక్ ఇచ్చిన బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (2), 'ఆదిపురుష్' సినిమాతో పలకరించిన రెబల్ స్టార్ ప్రభాస్ (3).. విజయ్‌కు తర్వాతి స్థానాల్లో నిలిచారు. వీరిద్దరూ గత నెలలోనూ ఇవే స్థానాల్లో ఉన్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు మూడు స్థానాలు ఎగబాకి 4, 5వ ప్లేస్ లను సాధించారు. పోయిన నెలలో 6వ స్థానంలో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈసారి 8వ ప్లేస్ కి పడిపోయారు. ఈ లిస్టులో కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ (6), సల్మాన్ ఖాన్ (7), అక్షయ్ కుమార్ (9), సూపర్ స్టార్ మహేష్ బాబు (10) కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మల్టీ లాంగ్వేజ్ మూవీ చేయకుండానే మహేశ్ జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటుల జాబితాలో చోటు సంపాదించడం గమనార్హం. మే నెలలో 10వ స్థానంలో ఉన్న KGF హీరో యశ్ కు ఈసారి చోటు దక్కలేదు. 

ఇక 2023 జూన్ నెలకు సంబంధించి ఆల్ ఇవర్ ఇండియాలో అత్యంత పాపులారిటీ సంపాదించిన ఫీమేల్ స్టార్స్ జాబితాలో సౌత్ క్వీన్ సమంత రూత్ ప్రభు అగ్రస్థానంలో నిలిచింది. నిజానికి ఓర్మాక్స్ మీడియా ప్రకారం అలియా భట్, దీపికా పదుకునే, నయనతార వంటి హీరోయిన్లను వెనక్కి నెట్టి సామ్ గత కొన్ని నెలలుగా ఈ లిస్టులో టాప్ లోనే ఉండటం విశేషం.

View this post on Instagram
 
A post shared by Ormax Media (@ormaxmedia)

Read Also: కంటెంటే కింగ్, ప్రేక్షకుల నాడి పట్టుకున్నవారికే సక్సెస్ - 2023 సెకండాఫ్‌లో హిట్టు కొట్టేదెవరు?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 23 Jul 2023 08:28 AM (IST) Tags: Mahesh Babu Allu Arjun Leo Shah Rukh Khan Prabhas Ram Charan NTR Samantha most popular Indian stars Salman Khan Most Popular Star Thalapathy Vijay

ఇవి కూడా చూడండి

‘సలార్’ రిలీజ్ డేట్, ‘పెదకాపు 1’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘సలార్’ రిలీజ్ డేట్, ‘పెదకాపు 1’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Tiger Nageswara Rao Movie : రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో తమిళ బ్యూటీ - ఎవరో తెలుసా?

Tiger Nageswara Rao Movie : రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో తమిళ బ్యూటీ - ఎవరో తెలుసా?

CBFC corruption row: విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం - విచారణకు ఆదేశం, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని వెల్లడి

CBFC corruption row: విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం - విచారణకు ఆదేశం, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని వెల్లడి

Ganapath Teaser: టైగర్‌ ష్రాఫ్ ‘గణపథ్‌‘ టీజర్ చూశారా? యాక్షన్ సీన్లకు గూస్ బంప్స్ రావాల్సిందే!

Ganapath Teaser: టైగర్‌ ష్రాఫ్ ‘గణపథ్‌‘ టీజర్ చూశారా? యాక్షన్ సీన్లకు గూస్ బంప్స్ రావాల్సిందే!

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్ మీటింగ్ వచ్చే వారం !

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్  మీటింగ్ వచ్చే వారం   !

TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

TDP News  :  అధికార మత్తు  వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్