అన్వేషించండి

Prabhas: అయోధ్య వేడుకలో కనిపించని ప్రభాస్‌ - జూ. ఎన్టీఆర్‌, కారణమేంటి? అసలేం జరిగింది..

Ayodhya Ram Mandir: అయోధ్యలో స్టార్స్‌ సందడి చూసిన వారంతా ఎన్టీఆర్‌, ప్రభాస్‌ ఎక్కడ అని ఆరా తీస్తున్నారు. వారేందుకు రాలేదు? ఆహ్వానం అందిందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు.

వందల సంవత్సరాల భారతీయ హిందువుల కల నిన్నటితో సాకారం అయ్యింది. అయోధ్య రామమందిరంకు జనవరి 22న ప్రాణ ప్రతిష్టకు శ్రీకారం పడింది. అతిరథ మహరథుల సమక్షంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుక కన్నుల పండుగగా జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరై రాముడి విగ్రహనికి ప్రాణప్రతిష్ట చేశారు. ఈ వేడుకకు అన్ని సినీ ఇండస్ట్రీలకు చెందిన సినీ ప్రముఖులకు ఆహ్వానం అందింది. మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌, రామ్‌ చరణ్‌, ధనుష్‌, రణ్‌బీర్‌ కపూర్‌, కంగనా రనౌత్‌ వంటి పలువురు స్టార్స్‌ పాల్గొని సందడి చేశారు.

అయితే ఈ వేడుకలో పాన్‌ ఇండియా హీరోలతో పాటు పలువురు స్టార్స్‌ కూడా పాల్గొన్నారు. అయోధ్యలో స్టార్స్‌ సందడి చూసిన వారంతా ఎన్టీఆర్‌, ప్రభాస్‌ ఎక్కడ అని ఆరా తీస్తున్నారు. వారేందుకు రాలేదు? ఆహ్వానం అందిందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రభాస్‌ ఈ వేడుకకు హాజరు కాలేకపోవడానికి వారి బిజీ షెడ్యూల్‌ అని తెలుస్తోంది. అయితే దీనిని కొందరు ఎంత బిజీ షెడ్యూల్‌ అయినా.. ఇంతటి ప్రతిష్టాత్మక వేడుకకు రాకపోవడమేంటని అంటున్నారు. ఈ క్రమంలో వారు రాలేకపోవడానికి గల కారణాలు ఇదే అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఎన్టీఆర్‌ దేవర కీలక షూటింగ్‌, ప్రభాస్‌ కల్కి షెడ్యూల్‌ కారణంగానే వారు అయోధ్యకు వెళ్లలేకపోయారని సమాచారం గట్టిగా వినిపిస్తుంది.

Also Read: మహేష్ బాబు జర్మనీకి ఎందుకు వెళ్లారంటే? ఇదీ అసలు విషయం!

అందుకే ఎన్టీఆర్‌ ఆగపోయాడా?

డైరెక్టర్‌ కొరటాల శివ దేవర మేజర్‌ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశాడట. కొన్ని రోజుల నుంచి దీనిపై వర్క్‌ జరుగుతుందట. ఇక అంత సిద్ధమై షెడ్యూల్‌ను మొదలుపెట్టారట. ఇక్క సైఫ్‌ అలీఖాన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లకు సంబంధించన మేజర్‌ పార్ట్స్‌, కీలక యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. అయితే పాత గాయం తిరగబడటం వల్ల సైఫ్‌ ఈ షెడ్యూల్లో పాల్గొనలేకపోయాడు. చికిత నిమిత్తం ముంబై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇది తెలియని తారక్‌ అయోధ్యకు సిద్ధమయ్యారట. చివరి నిమిషంలో సైఫ్‌ అస్వస్థతకు గురవ్వడంతో ఎన్టీఆర్‌ షూటింగ్‌ లో పాల్గొనాల్సి వచ్చింది. అప్పటికే భారీ సెట్స్‌ వేసి షూటింగ్‌కు అంతా సిద్దం చేశారట. వారిలో ఇద్దరు లేకపోతే నిర్మాతలకు మరింత భారమవుతుందని, వారిని ఇబ్బందికి కలుగుతుందని తారక్‌ చివరి నిమిషంలో ఆగిపోవాల్సి వచ్చిందట. అలా ఎన్టీఆర్‌ అయోధ్యకు హాజరుకాలేకపోయారు. 

ప్రభాస్‌ కూడా..

ప్రభాస్‌ కూడా అయోధ్యకు వెళ్లలేకపోయాడు. ప్రస్తుతం డార్లింగ్‌ మారుతి రాజాసాబ్‌ మూవీతో పాటు నాగ్‌ అశ్విన్‌ కల్కి చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. సలార్‌ మ మూవీ రిలీజ్‌ అవ్వడం, కల్కి సినిమాను సమ్మర్‌ వరకు రెడీ చేయాలి. సైన్స్‌ ఫిక్షన్‌ వస్తున్న ఈసినిమాను భారీగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కల్కి న్యూ షెడ్యూల్లో ప్రభాస్‌ కోసం భారీ సెట్‌ వేశారట. అంతేకాదు కీలకమై సన్నివేశాల చిత్రీకరణ ఉండటంతో ప్రభాస్‌ కూడా అయోధ్యకు వెళ్లలేకపోయినట్ట ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఇదిలా ఉంటే అసలు ప్రభాస్‌కు అయోధ్యకు ఆహ్వానం అందలేదని కూడా ఓ వైపు ప్రచారం జరిగింది. ఇందులో నిజం లేదంటున్నారు.. కానీ కొందరు మాత్రం ప్రభాస్‌కు నిజంగా ఆహ్వానం అందలేదేమో? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఆయన టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget