అన్వేషించండి

Ravi Teja: అలా షాకిస్తాడని అస్సలు ఊహించలేదు - హరీష్ శంకర్‌పై రవితేజ కామెంట్స్

Ravi Teja: హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధమయ్యింది. దీంతో మూవీ టీమ్ అంతా స్పెషల్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది.

Ravi Teja At Mr Bachchan Pre Release Event: ఆగస్ట్ మూడో వారంలో లాంగ్ వీకెండ్ కోసం ఎన్నో సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. ఇందులో ప్యాన్ ఇండియా రేంజ్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయినా వాటితో పోటీకి సిద్ధమంటూ మాస్ మహారాజ్ రవితేజ కూడా బరిలోకి దిగనున్నారు. హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ ఆగస్ట్ 15న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. విడుదలకు ఇంకా కొన్నిరోజులే ఉండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచారు మేకర్స్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన స్టైల్‌లో స్పీచ్ ఇచ్చి అందరినీ అలరించారు రవితేజ.

అందరికీ థాంక్యూ..

మామూలుగా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అయినా అందరూ మాట్లాడిన తర్వాత హీరో మాట్లాడతాడు. కానీ ‘మిస్టర్ బచ్చన్’లో అలా కాదు. ముందుగా రవితేజనే మాట్లాడడానికి ముందుకొచ్చారు. అది ఎందుకో కూడా ఆయన వివరించారు. ‘‘మైక్‌ను సరిగ్గా వాడే మనుషులు చాలా తక్కువమంది ఉంటారు. అందులో హరీష్ ఒకడు. ఇరగదీసి మైక్ అంతుచూస్తాడు. నా తర్వాత తను మాట్లాడితే మంచిది అనిపించి నేను ముందు మాట్లాడడానికి వచ్చాను’’ అని తెలిపారు రవితేజ. ఆ తర్వాత ‘మిస్టర్ బచ్చన్’ కోసం పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు పేరుపేరునా థ్యాంక్స్ చెప్పుకున్నారు. చాలామంది టెక్నీషియన్లను కూడా ప్రత్యేకంగా పిలిచి ప్రశంసించారు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాటోగ్రాఫర్ వల్ల భాగ్యశ్రీ మరింత అందంగా కనిపించిందని, సినిమా అంతా లడ్డులాగా వచ్చిందని వ్యాఖ్యలు చేశారు రవితేజ. 

షాకిచ్చాడు..

రవితేజ స్టేజ్‌పై మాట్లాడుతుండగానే ఒక ఫ్యాన్ స్టేజ్ ఎక్కి తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అది చూసి రవితేజ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ‘‘అలా రాకూడదు. ఇలా వచ్చేస్తే భయపడతాం. భయపెట్టకండి’’ అని ఫ్యాన్స్‌కు చెప్పారు. ఈ ఈవెంట్‌కు మిక్కీ జే మేయర్ హీరో అంటూ తన గురించి చెప్పుకొచ్చారు. ‘‘తన నుంచి ఇలాంటి మ్యూజిక్ వస్తుందని నేను అసలు ఊహించలేదు. ఒకరకంగా షాకిచ్చాడు. మొదటిసారి హరీష్ నాకు ట్యూన్స్ వినిపించినప్పుడు ఇది మిక్కీనా అనిపించింది’’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రవితేజ. హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే గురించి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే ఒక ఊపుఊపేస్తోంది. సినిమాలో అమ్మాయి మామూలుగా లేదు. డబ్బింగ్ తనే చెప్పింది’’ అంటూ తనకు ఆల్ ది బెస్ట్ తెలిపారు రవితేజ. 

హ్యాట్రిక్ తీయాలి..

చివరిగా హరీష్ శంకర్ గురించి మాట్లాడుతూ.. ‘‘మా ఇద్దరి రిలేషన్‌షిప్ గురించి నాకంటే ఎక్కువ తనే చెప్పాడు. తనే బాగా చెప్తాడు కూడా. ఈ సినిమా హిట్ అయ్యి తరువాత హ్యాట్రిక్ తీయాలి. ఎందుకంటే షాక్ డిసప్పాయింట్ చేసింది. దర్శకులందరూ హార్డ్ వర్క్ చేస్తారు. కానీ హరీష్ హార్డ్ వర్క్ వేరు. అన్ని శాఖలు సరిగ్గా ప్లాన్ చేసుకుంటాడు’’ అని ప్రశంసించారు రవితేజ. హరీష్ అభిమానంగా తన కాళ్లు పట్టుకోబోతుంటే అలా చేయొద్దు ఇబ్బందిగా ఉంటుందంటూ తన స్పీచ్‌ను ముగించారు. చివరిగా హరీష్ శంకర్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే.. ఉదయం 9 నుంచి 6 వరకు ఒకలాగా, సాయంత్రం 6 నుంచి మరొకలాగా ఉంటాడని చెప్పి నవ్వారు రవితేజ.

Also Read: ‘కంగువా’ ట్రైలర్‌లో ఇవి కనిపెట్టారా? సూర్య సినిమాలో స్పార్టన్లు, ఏం ప్లాన్ చేశారయ్యా?

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju: జై జనసేన... 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్‌లో లావణ్య... భర్త వరుణ్ తేజ్‌తో సందడి
జై జనసేన... 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్‌లో లావణ్య... భర్త వరుణ్ తేజ్‌తో సందడి
Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
Korean Kanakaraju OTT : కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget