అన్వేషించండి

Kanguva Trailer Decoded: ‘కంగువా’ ట్రైలర్‌లో ఇవి కనిపెట్టారా? సూర్య సినిమాలో స్పార్టన్లు, ఏం ప్లాన్ చేశారయ్యా?

Kanguva Trailer Decoded: సూర్య హీరోగా నటించిన ‘కంగువా’ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. అయితే ఈ ట్రైలర్‌లో చాలామంది ప్రేక్షకులు గమనించని ఎన్నో డీటైల్స్ ఉన్నాయి.

Kanguva Trailer Decoded: ఈ ఏడాదిలో కోలీవుడ్ నుంచి పలు ప్యాన్ ఇండియా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఎక్కువమంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో పాటు అంచనాలు పెంచేసింది సూర్య హీరోగా నటించిన ‘కంగువా’. ఈ మూవీ పలుమార్లు పోస్ట్‌పోన్ అయ్యి ఫైనల్‌గా అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. విడుదల తేదీకి ఇంకా సమయం ఉన్నా అప్పుడే మూవీ ట్రైలర్‌ను విడుదల చేసి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ట్రైలర్‌ను చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయని ప్రేక్షకులు అంటున్నారు. అంతే కాకుండా ఇందులో కొన్ని డీటైల్స్‌ను వారు డీకోడ్ చేశారు.

వారితో యుద్ధం..

‘కంగువా’ ట్రైలర్ మొత్తం అడవిలో నివసించే గిరిజనుల చుట్టూనే తిరుగుతుంది. కానీ సరిగా గమనించి చూస్తే వారంతా స్పార్టన్లు అని అర్థమవుతోంది. 431 – 404 BC కాలంలో గ్రీస్‌కు చెందిన ఆర్మీని స్పార్టన్లు అంటారు. ‘కంగువా’ ట్రైలర్‌లోని ఒక షాట్‌లో స్పార్టన్ల వారియర్ ఆర్మర్ ధరించిన ఒక వ్యక్తి కనిపిస్తాడు. దీన్ని బట్టి చూస్తే ఇది అప్పట్లో స్పార్టన్లు, గిరిజనులు మధ్య జరిగిన యుద్ధాల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని అర్థమవుతోంది. మూవీ కథ మొత్తం దాదాపుగా వీరి చుట్టూనే తిరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘కంగువా’ ట్రైలర్‌లో కనిపించిన స్పార్టన్ల నౌకలు, అప్పట్లో వారు ఉపయోగించిన నాణేలు చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది.

కదలని జనం..

‘కంగువా’ ట్రైలర్‌ను బట్టి చూస్తే మూవీలో రెండు తెగల మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయని తెలుస్తోంది. అందులో ఒక తెగకు సూర్య నాయకుడు కాగా.. మరొక తెగకు బాబీ డియోల్ నాయకుడు. అప్పట్లో గిరిజనులు చాలా బలంగా ఉండేవారు. శారీరికంగా వారు ఎలాంటి నొప్పిని అయినా తట్టుకుంటారు. అదే విషయాన్ని ట్రైలర్‌లో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాడు దర్శకుడు శివ. అగ్ని పర్వతం బద్దలయ్యి లావా పొంగి వస్తున్నా కూడా ప్రజలు కదలకుండా అలాగే నిలబడి ఉంటారు. వారంతా దయ లేకుండా కొందరు స్పార్టన్ల చేతులు నరికేసి సముద్రంలో పడేసి రక్తపాతం సృష్టించడం కూడా ట్రైలర్‌లో చూపించారు. ఇందులో ఎక్కువగా అడవి, ఎత్తైన ప్రదేశాలు మాత్రమే ఉన్నాయి.

కార్తి ఉన్నాడా?

ట్రైలర్‌లోని ఒక షాట్‌లో బాబీ డియోల్ ఒక వ్యక్తిని చంపి ఆ కొండపై నుంచి తోసేసి చంపేసినట్టుగా చూపించారు. కానీ అది ఎవరు అని చూపించలేదు. బాణానికి పామును చుట్టి వదలడం, మండుతున్న గోళాలు విసరడం లాంటి షాట్స్ చూస్తుంటే ‘కంగువా’లో వయొలెన్స్ చాలానే ఉండబోతుందని అర్థమవుతోంది. ట్రైలర్ చివర్లో ఒక వ్యక్తి గుర్రంపై రావడాన్ని చూపించారు. అది ఎవరో సరిగా కనిపించకపోయినా.. అక్కడ ఉన్నది కార్తి అని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. ‘కంగువా’ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. అందులోని మొదటి భాగంలో కార్తి గెస్ట్ రోల్‌లో కనిపించి, రెండో భాగంలో పూర్తిస్థాయి విలన్‌గా కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: కంగువ ట్రైలర్... బాహుబలి రేంజ్‌లో సూర్య సినిమా - యాక్షన్, విజువల్స్ కుమ్మేశాయి!

టాప్ హెడ్ లైన్స్

Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Nandamuri Deepika: నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
Yellamma Update : యంగ్ రెట్రో లుక్‌లో మన పర్సి - దేవిశ్రీకి ఎల్లమ్మ టీం స్పెషల్ గిఫ్ట్
యంగ్ రెట్రో లుక్‌లో మన పర్సి - దేవిశ్రీకి ఎల్లమ్మ టీం స్పెషల్ గిఫ్ట్
Jio Hotstar August Movies : జియో హాట్ స్టార్‌లో ఆగస్ట్ ఫెస్టివల్ - ఈ నెలలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ / వెబ్ సిరీస్‌లు
జియో హాట్ స్టార్‌లో ఆగస్ట్ ఫెస్టివల్ - ఈ నెలలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ / వెబ్ సిరీస్‌లు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Samantha: బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
Embed widget