రవితేజ నిర్మించిన 'చాంగురే బంగారు రాజా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మాస్ మహారాజా రవితేజ నిర్మించిన 'చాంగురే బంగారు రాజా' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. అక్టోబర్ 27 నుంచి ఈ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. RT టీం వర్క్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇప్పటికే తన ప్రొడక్షన్ హౌస్ లో కొన్ని చిన్న సినిమాలను నిర్మించగా అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. రీసెంట్ గా రవితేజ నిర్మించిన 'చాంగురే బంగారు రాజా' అనే మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. ఈ వారమే ఓటీటీ లోకి రాబోతోంది. క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటించగా సత్య, రవిబాబు, గోల్డ్ నిస్సి, అజయ్, ఎస్తేర్, నిత్యశ్రీ కీలక పాత్రలు పోషించారు.
సతీష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్వేతా కర్లపూడి తో కలిసి రవితేజ నిర్మించారు. సెప్టెంబర్ 15న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. మర్డర్ మిస్టరీ కథాంశంతో దర్శకుడు సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇందులో బంగారు రాజు అనే బైక్ మెకానిక్ పాత్రలో కార్తీక్ రత్నం నటించాడు. థియేటర్స్ లో మెప్పించలేకపోయిన ఈ చిత్రం అక్టోబర్ 27 నుండి ఈటీవీ విన్(Etv Win) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది. డిజిటల్ ప్రీమియర్ గా ఈటీవీ విన్ లో 'చాంగురే బంగారు రాజా' అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానునట్లు ఈ సందర్భంగా వెల్లడించింది.
ఇక 'చాంగురే బంగారు రాజా' కథ విషయాన్నికొస్తే.. రంగురాళ్ల బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ ఉంటుంది. ఇందులో బంగారు రాజు(కార్తిక్ రత్నం) అనుకోకుండా ఓ హత్యా నేరంలో చిక్కుకుంటాడు. కానిస్టేబుల్ మంగరత్నం(గోల్డ్ నిస్సి) సహాయంతో బంగారు రాజు ఆ హత్య నేరం నుంచి ఎలా బయటపడ్డాడు? ఈ హత్య అతడే చేశాడా? లేదా? ఈ హత్య వెనుక ఉంది ఎవరు? అనేది ఈ సినిమా కథ. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలతో కూడిన చిన్న సినిమాలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో రవితేజ RT టీం వర్క్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ పై ఇప్పటికే 'రావణాసుర', 'రామారావు ఆన్ డ్యూటీ', 'మట్టి కుస్తీ' అనే చిత్రాలను నిర్మించాడు. వీటిలో 'మట్టి కుస్తీ' పర్వాలేదనిపించుకుంది.
ఇక రవితేజ విషయానికి వస్తే ఆయన.. నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వంశీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ ఆధారంగా రూపొందింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ మూవీ ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు. అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, రావు రమేష్, రేణు దేశాయ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
Also Read : శిల్పాశెట్టితో విడాకులు- రాజ్ కుంద్రా పోస్టు వెనుక ఉద్దేశం అదేనా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
View this post on Instagram