Mr.Bachchan Teaser: ఈ దేశాన్ని పీడుస్తుంది దరిద్రం కాదు సార్.. నల్లధనం - ఆసక్తి పెంచుతున్న 'మిస్టర్ బచ్చన్' టీజర్
Mr.Bachchan Teaser: మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. ఆగస్ట్ 15న మూవీ రిలీజ్ సందర్భంగా తాజాగా టీజర్ విడుదల చేసింది మూవీ టీం.
Mr Bachchan Movie Teaser Out: మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ కాంబినేషన్‌లో సినిమా అంటనే మూవీపై బజ్ క్రియేట్ అవుతుంది. షాక్, మిరపకాయ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబో వస్తున్న చిత్రమిది. దీంతో మిస్టర్ బచ్చన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్, ఫస్ట్‌లుక్, గ్లీంప్స్‌తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ప్రేక్షకుల అంచనాలు తగ్గట్టుగానే మూవీని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించినట్టు టీజర్ చూస్తే అర్థమైపోతుంది.
టీజర్ విషయానికి వస్తే
టీజర్‌లో చిరంజీవి పాటతో మొదలు పెడుతామనే ఫిమేల్ వాయిస్‌తో మొదలవుతుంది. ప్రస్తుతం కాకుండా 90's బ్యాక్‌డ్రాప్‌లో స్క్రీన్‌ప్లే చూపించారు. టీజర్‌ను హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్, రొమాన్స్‌తో మొదలైంది. ఇందులో హీరోహీరోయిన్ల మధ్య ఉండే రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇక తర్వాత టీజర్‌ను ఒక్కసారిగా సీరియస్ మోడ్‌లోకి వెళ్లింది. ఓ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ విలన్‌కు ఫోన్ చేసిన రైడ్ చేస్తున్నట్టు ఇన్‌ఫాం చేయడం.. "ఈ దేశాన్ని పీడుస్తుంది దరిద్రం కాదు సర్ నల్లధనం" రవితేజ చెప్పిన డైలాగ్ ఆసక్తిని పెంచుతుంది. విలన్‌కు ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ కాల్ చేయడం.. ఆ తర్వాత రవితేజ ఐటీ ఆఫీసర్‌గా కనిపించడం మూవీపై హైప్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత నాలుగైదు రైడ్‌లు చేయగానే కెరీర్‌లో సక్సెస్ వచ్చింది.. దాంతో కళ్లు నెత్తిమీదకు.. తల తాటి చెట్టుమిదకు ఎక్కినట్టు ఉంది అంటూ విలన్ హీరోని ఉద్దేశించి డైలాగ్ అంటుండగా.. ఐటీ ఆఫీసర్‌గా రవితేజను చూపించిన తీరు ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇక ఆ తర్వాత "సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇంటికి వచ్చే చుట్టాలాంటివి వస్తుంటాయి పోతుంటాయి. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది.. అది పోయేదాక మనతోనే ఉంటుంది" రవితేజ చెప్పిన డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఇక టీజర్ చివరిలో విలన్స్‌కి, హీరోకి మధ్య సాగే యాక్షన్ సీన్స్‌ని చూపించి కమర్షియల్ టచ్ ఇచ్చారు మొత్తానికి టీజర్ మూవీపై మరిన్ని అంచనాలు పెంచుతుంది. అసలే సినిమాల్లో తనదైన మ్యానరిజంతో అలరించిన మాస్ మహారాజా ఈ సినిమాలో ప్రభుత్వ అధికారిక కనిపించబోతున్నాడని అర్థమైపోతుంది. ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్‌లో నల్లధనాన్ని ఎలా కట్టిడి చేశాడనేది ఈ మిస్టర్ బచ్చన్ కథ అని అర్థమైపోతుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌ని ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.
మిస్టర్ బచ్చన్ ఓటీటీ పార్ట్‌నర్ ఇదే!
కాగా మిస్టర్ బచ్చన్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ మూవీకి ఉన్న బజ్ ప్రకారం భారీగా ఓటీటీ డిల్ కుదరినట్టు తెలుస్తోంది. ఈ మూవీ కోసం నెట్‌ఫ్లిక్స్ మేకర్స్‌కి భారీగానే చెల్లించిందని టాక్. అయితే మూవీ విడుదల తర్వాత ఓటీటీ పార్ట్‌నర్‌ని అనౌన్స్ చేసే అవకాశం ఉందట. ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్, లేదా మూవీ రిజల్ట్ బట్టి మిస్టర్ బచ్చన్ డిజిటల్ ప్రిమియర్‌ని ఫిక్స్ చేయనున్నారట. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు ప్రతికథానాయకుడిగా కనిపించనున్నారు.
Also Read: రవితేజను అన్‌ఫాలో చేసిన ఛార్మీ - కారణం అదేనా? అసలేం జరుగుతుంది..!