Rashmika Mysaa Glimpse : నా బిడ్డను చంపలేక చావే చచ్చిపోయింది - షాకింగ్ లుక్‌లో రష్మిక... 'మైసా' ఫస్ట్ గ్లింప్స్
Rashmika Mysaa : నేషనల్ క్రష్ రష్మిక మందన్న 'మైసా' నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది. యోధురాలిగా షాకింగ్ లుక్‌లో అదరగొట్టారు. ప్రతీకారం తీర్చుకునే ఓ యోధురాలిగా ఆమె కనిపించనున్నారు.

Rashmika's Mysaa Movie Glimpse Out Now : నేషనల్ క్రష్ రష్మిక రీసెంట్‌గా 'గర్ల్ ఫ్రెండ్'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మైసా'. ఇదివరకూ చూడని డిఫరెండ్ లుక్‌లో ఓ సూపర్ వారియర్‌గా ఆమె కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ భయపెట్టేయగా... తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వేరే లెవల్‌లో ఉంది.
చరిత్ర చూడని వారియర్
లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు ఉండే క్రేజే వేరు. అందులోనూ రష్మికను సూపర్ వారియర్‌గా పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ఎలివేషన్ ఇచ్చిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బ్యాగ్రౌండ్ డైలాగ్స్‌తో ఆమె పాత్రను పరిచయం చేశారు. 'నా బిడ్డ సచ్చిందన్నారు. కానీ మట్టే వణికిపోయింది నా బిడ్డ రక్తాన్ని దాచలేక. గాలే ఆగిపోయింది నా బిడ్డ ఊపిరి మోయలేక. అగ్గే బూడిదైంది మండుతున్న నా బిడ్డను చూడలేక. ఆఖరికి చావే చచ్చిపోయింది నా బిడ్డను చంపలేక.' అంటూ ఓ తల్లి తన కూతురు గురించి చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి.
ముఖమంతా రక్తం, ఉగ్రమైన రూపం, ఓ చేతికి సంకెళ్లు, మరో చేతికి తుపాకీతో రష్మిక లుక్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ లుక్ చూస్తుంటే ఆమె తిరుగుబాటు చేసే యోధురాలు, ప్రతీకారం తీర్చుకునే 'మైసా' పాత్ర పోషిస్తున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గోండు గిరిజన మహిళలకు నాయకురాలిగా గోండు తెగల బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా మూవీని తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది.
Also Read : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
ఈ మూవీకి రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తుండగా... అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో అజయ్, అనిల్ సయ్యపురెడ్డిలు నిర్మిస్తున్నారు. 'మైసా' అంటే అమ్మ అని అర్ధం. ఈ పదం స్వీడిష్, అరబిక్, జపనీస్, జార్జియన్ భాషల మూలాల నుంచి తీసుకున్నట్లు తెలుస్తుండగా... గోండు తెగకు వచ్చిన కష్టం ఏంటి? వారికి నాయకురాలిగా ఓ అమ్మగా 'మైసా' ఏం చేసింది? అనేదే స్టోరీ అని తెలుస్తోంది. రష్మిక షాకింగ్ లుక్, గ్లింప్స్‌తో భారీ హైప్ క్రియేట్ అవుతుండగా... త్వరలోనే ఇతర నటీనటుల వివరాలు వెల్లడి కానున్నాయి.
Against every odd, she rises.
— rawindra pulle (@RawindraPulle) December 24, 2025
Against silence, she roars.
Against the world, she stands alone.🔥#RememberTheName - She is #MYSAA ❤️🔥
First Glimpse out now 💥
-- https://t.co/B3P2B7BxkH
In cinemas 2026 🔥@iamRashmika @rawindrapulle @jakes_bejoy @kshreyaas pic.twitter.com/bfEjlodMq2






















