Rashmika - Gam Gam Ganesha Song : 'గం గం గణేశా'లో సాంగ్ విడుదల చేసిన రష్మిక - 'ప్రేమిస్తున్నా' కంటే పెద్ద హిట్ కావాలి ఆనందా
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'గం గం గణేశా'. ఇందులో పాటను రష్మిక విడుదల చేశారు.
'బేబీ'తో బాక్సాఫీస్ బరిలో యువ కథానాయకుడు, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) భారీ విజయం అందుకున్నారు. ఆ ఒక్కటి మాత్రమే కాదు... ఆ సినిమాతో నటుడిగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'గం గం గణేశా' (Gam Gam Ganesha Movie).
'గం..గం..గణేశా' సినిమాలో ఆనంద్ దేవరకొండ జోడీగా 'పెద కాపు 1' ఫేమ్, నార్త్ ఇండియన్ బ్యూటీ ప్రగతి శ్రీవాత్సవ (Pragati Srivastava) నటిస్తున్నారు. హై - లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో తొలి పాటను ఈ రోజు రష్మిక విడుదల చేశారు.
ఆనందా... 'ప్రేమిస్తున్నా' కంటే పెద్ద హిట్ కావాలి : రష్మిక
'గం గం గణేశా' ఫస్ట్ లుక్ సమంత విడుదల చేశారు. ఇప్పుడు సినిమాలో తొలి పాట 'బృందావనివే'ను రష్మికా మందన్నా విడుదల చేశారు. 'బేబీ' సినిమాలో 'ప్రేమిస్తున్నా' పాటను కూడా ఆమె విడుదల చేశారు. ఆ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఆ 'ప్రేమిస్తున్నా' కంటే ఈ 'బృందావనివే' పెద్ద హిట్ కావాలని రష్మిక ఆకాంక్షించారు.
Also Read : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?
Anandaaaaaaaa.. this ones for you 🤍🤗
— Rashmika Mandanna (@iamRashmika) October 4, 2023
Premisthunna people loved and I hope this goes bigger.. 💃🏻
Sending the team best wishes and big big love and hugs. 🤗
All the bestest guyssss❤️ #Brundavanive
A @chaitanmusic musical!
@sidsriram @music_vengihttps://t.co/zY2XXtZFc8… pic.twitter.com/RsYzUb1P9T
చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా... ఈ పాటను వెంగీ సుధాకర్ రాశారు. ఫేమస్ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. విజయ్ దేవరకొండ, సిద్ శ్రీరామ్ కాంబినేషన్లో పలు హిట్ సాంగ్స్ ఉన్నాయి.
ఫస్ట్ టైమ్ యాక్షన్ జానర్ ఫిల్మ్ చేసిన ఆనంద్ దేవరకొండ
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'గం..గం.. గణేశా' రూపొందింది. ఈ జానర్యా ఫిల్మ్ ఆనంద్ దేవరకొండ చేయడం ఇదే మొదటిసారి. యాక్షన్ మాత్రమే కాకుండా కామెడీ కూడా హైలైట్ అవుతుందని టాక్.
Also Read : 'కన్నూర్ స్క్వాడ్' రివ్యూ : మమ్ముట్టి కొత్త సినిమా ఎలా ఉంది - కార్తీ మూవీనే మళ్లీ తీశారా?
ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో కరిష్మా, 'వెన్నెల' కిషోర్, 'జబర్దస్త్' ఇమ్మాన్యుయేల్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ : పూజిత తాడికొండ, కళా దర్శకత్వం : కిరణ్ మామిడి, కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, ఛాయాగ్రహణం : ఆదిత్య జవ్వాడి, సంగీతం : చేతన్ భరద్వాజ్, నిర్మాణ సంస్థ : హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్, నృత్య దర్శకత్వం : పొలాకి విజయ్, సహ నిర్మాత : అనురాగ్ పర్వతనేని, నిర్మాతలు : కేదార్ సెలగంశెట్టి - వంశీ కారుమంచి, రచన - దర్శకత్వం : ఉదయ్ శెట్టి
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial