PM Modi: 'ANR భారతదేశానికి గర్వ కారణం' - అక్కినేని ఫ్యామిలీ మీట్‌పై ప్రధాని మోదీ ట్వీట్
Akkineni Nagarjuna: అక్కినేని ఫ్యామిలీని కలవడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఏఎన్ఆర్ భారతదేశానికే గర్వ కారణమని కొనియాడారు.

PM Modi Tweet On Akkineni Nagarjuna Family Meet: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని (PM Modi) కలిసిన విషయం తెలిసిందే. దీనిపై మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏఎన్ఆర్ ఫ్యామిలీని కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. 'నాగార్జున గారూ మీ కుటుంబంతో కలిసి మిమ్మల్ని కలవడం నిజంగా ఆనందంగా ఉంది. ANR గారు భారత దేశానికే గర్వకారణం, ఆయన దిగ్గజ ప్రదర్శనలు రాబోయే తరాలకు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తాయి.' అని పేర్కొన్నారు. కాగా, ఇటీవల 'మన్ కీ బాత్'లో భారతీయ సినిమాకు ఏఎన్ఆర్ విశేష కృషి చేశారని కొనియాడారు. దీనికి స్పందించిన నాగార్జున సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
It was indeed a delight to meet you Nagarjuna Garu along with your family. ANR Garu is the pride of India and his iconic performances will continue to enthral generations to come. https://t.co/nOL8qooWkD
— Narendra Modi (@narendramodi) February 7, 2025
ప్రధానికి 'అక్కినేని' పుస్తకం
కాగా, శుక్రవారం ఢిల్లీలోని పార్లమెంట్‌లో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఫ్యామిలీ భారత ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా నటుడు నాగార్జున.. పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాసిన అక్కినేని జీవిత చరిత్ర 'అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ' పుస్తకాన్ని ప్రధానికి అందజేశారు. ప్రధానికి ఈ పుస్తకాన్ని అందించడం గౌరవంగా.. తన తండ్రి ఏఎన్నార్ సినిమా వారసత్వానికి నివాళిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన సేవలను గుర్తించడం.. మా కుటుంబం, అభిమానులు, భారతీయ సినీ ప్రేమికులకు ఓ విలువైన జ్ఞాపకమని ట్వీట్ చేశారు. ప్రధానిని కలిసిన వారిలో అక్కినేని నాగార్జునతో పాటు అక్కినేని అమల, నాగచైతన్య, శోభిత దూళిపాల కూడా ఉన్నారు. వీరితో పాటుగా మాజీ ఎంపీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అటు, ప్రధాని మోదీకి అక్కినేని కొత్త కోడలు శోభితా ధూళిపాళ కొండపల్లి బొమ్మలను అందజేశారు. తన గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఆ బొమ్మలు అంటే తనకు ఎంత ఇష్టమనేది తెలుసునని అన్నారు. తెనాలిలోని తన గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ బొమ్మలతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు. ప్రధానికి కొండపల్లి బొమ్మలు అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
It was overwhelming to hear Hon'ble Prime Minister @narendramodi ji's commendations for ANR gaaru's philanthropic legacy and his high regard for both @AnnapurnaStdios and Annapurna College of Film and Media as a pivotal institution for aspiring filmmakers. This esteemed… pic.twitter.com/1ieuGIcycl
— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 7, 2025
Also Read: 'తండేల్' రియల్ స్టోరీ... చేపల కోసం వెళ్ళి పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న ఆ మత్స్యకారుడు ఎవరో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

