News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా సీఎంగా 'డెవిల్'కు సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

FOLLOW US: 
Share:

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) అజాత శత్రువు. చిత్రసీమలో అందరితో ఆయన కలుపుగోలుగా తిరిగే మనిషి. మరీ ముఖ్యంగా వివాదాలకు చాలా దూరంగా ఉండే వ్యక్తి. అటువంటి కళ్యాణ్ రామ్ సినిమా చుట్టూ వివాదం నెలకొంది. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'డెవిల్' (Devil Movie). 

'డెవిల్' దర్శకుడు ఎవరు? ఆ కాంట్రవర్సీకి చెక్ పెట్టాలని సీక్వెల్?
'డెవిల్' సినిమా నవీన్ మేడారం దర్శకత్వంలో మొదలైంది. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... ఆయన పేరు ఉంటుంది. నిర్మాతగా అభిషేక్ నామా పేరు ఉంది. ఆ తర్వాత ఏమైందో తెలియదు... దర్శక - నిర్మాతగా అభిషేక్ నామా పేరు పడింది. ఈ మార్పు వెనుక ఇండస్ట్రీలో రెండు రకాల కథనాలు వినబడుతున్నాయి. 

నవీన్ మేడారం పనితీరు నచ్చకపోవడంతో హీరో కళ్యాణ్ రామ్ సూచన మేరకు... అతడిని తప్పించి దర్శకత్వ బాధ్యతలను అభిషేక్ నామా చేపట్టారని నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ వర్గాలు చెబుతున్నాయి. నవీన్ మేడారం సన్నిహితుల విషయానికి వస్తే... సినిమా మొత్తం నవీన్ మేడారం తీశారని, అభిషేక్ నామా కావాలని సమస్య చేస్తున్నారని చెబుతున్నారు. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తే... ఇప్పటి వరకు ఒక్క మేకింగ్ స్టిల్ కూడా ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నిస్తున్నారు.

'డెవిల్ 2' తీయాలని అభిషేక్ నామా పట్టుదల!
దర్శకుడు ఎవరనే విషయం చర్చనీయాంశం కావడంతో 'డెవిల్ 2' (Devil 2 Movie) తీయాలని అభిషేక్ నామా పట్టుదలగా ఉన్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు బలంగా చెబుతున్నాయి. నిజం చెప్పాలంటే... 'డెవిల్'కు శ్రీకాంత్ విస్సా కథ అందించారు. ఆయనతో సీక్వెల్ కథ కూడా రాయిస్తున్నారట! అయితే... దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తారా? లేదంటే మరొకరికి చేతిలో పెడతారా? అనేది చూడాలి. 

Also Read : రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... 'డెవిల్ 2'కు కూడా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తారు. ఆల్రెడీ 'డెవిల్'కు తానే దర్శకుడిని అని ఆయన అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 'డెవిల్ 2' తీసి, భారీ విజయం అందుకుని తాను దర్శకుడిని అని చెప్పుకోవలసిన అవసరం ఆయనకు ఏర్పడింది. ఒకవేళ 'డెవిల్ 2' ఫ్లాప్ అయితే 'డెవిల్'కు నవీన్ మేడారం దర్శకుడని జనాలు భావించే ప్రమాదం కూడా ఉంది. 

Also Read 'కన్నూర్ స్క్వాడ్' రివ్యూ : మమ్ముట్టి కొత్త సినిమా ఎలా ఉంది - కార్తీ మూవీనే మళ్లీ తీశారా?

'డెవిల్' కంటే ముందు అభిషేక్ పిక్చర్స్ సంస్థలో 'బాబు బాగా బిజీ' చేశారు నవీన్ మేడారం. అభిషేక్ నామా, ఆయనకు మధ్య ముందు సత్సంబంధాలు ఉన్నాయి. మరి, 'డెవిల్' సమయంలో ఎందుకు గొడవలు వచ్చాయో? ఈ టోటల్ ఎపిసోడ్ మొత్తం చూస్తే... దర్శకుడికి అన్యాయం జరిగిందని వినబడుతోంది. ఏది నిజం? అనేది ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వచ్చి చెబితే తప్ప తెలియదు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 04 Oct 2023 03:04 PM (IST) Tags: Nandamuri Kalyan Ram abhishek nama Latest Telugu News Devil 2 Movie Devil Movie sequel

ఇవి కూడా చూడండి

నయనతార సినిమాకి చిక్కులు, ‘నాసామిరంగ’ హీరోయిన్ రివీల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

నయనతార సినిమాకి చిక్కులు, ‘నాసామిరంగ’ హీరోయిన్ రివీల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ

Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ

Hi Nanna: షారుఖ్ ఖాన్ క్లాసిక్ చిత్రంతో ‘హాయ్ నాన్న’కు పోలికలు! - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Hi Nanna: షారుఖ్ ఖాన్ క్లాసిక్ చిత్రంతో ‘హాయ్ నాన్న’కు పోలికలు! - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ

Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ

టాప్ స్టోరీస్

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
×