Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...
మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిశారు. అదీ ముంబైలో! ఎందుకో తెలుసా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఎక్కడ ఉన్నారో తెలుసా? ముంబైలో! ఆయన మంగళవారం ముంబై మహా నగరంలో అడుగు పెట్టారు. బుధవారం సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. ముంబైలో మిస్టర్ కూల్, స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని (MS Dhoni)ని కలిశారు. అదీ ఎందుకో తెలుసా?
యాడ్ చేసిన చరణ్, ధోని!
రామ్ చరణ్, ఎంఎస్ ధోని కలిసి మంగళవారం ఓ యాడ్ చేశారు. షూటింగులో వాళ్ళిద్దరూ పాల్గొన్నారు. అయితే... ఆ యాడ్ ఏమిటి? అందులో చరణ్, ధోని పాత్రలు ఎలా ఉంటాయి? ఎప్పుడు విడుదల చేస్తారు? వంటివి ప్రస్తుతానికి సస్పెన్స్.
ధోనితో రామ్ చరణ్ యాడ్ చేయడం ఇదేమీ తొలిసారి కాదు. సుమారు 13 ఏళ్ళ క్రితం టీవీలో, సోషల్ మీడియాలో టెలికాస్ట్ కోసం ఓ యాడ్ చేశారు. కూల్ డ్రింక్ కంపెనీ పెప్సీ కోసం అప్పుడు కలిశారు. మరి, ఇప్పుడు చేసిన యాడ్ ఏమిటి? అనేది త్వరలో తెలుస్తుంది.
Also Read : 'మ్యాన్షన్ 24'కి వెళ్లిన వరలక్ష్మి ప్రాణాలతో బయట పడిందా? ఓంకార్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?
ముంబైలో అయ్యప్ప దీక్ష విరమించిన చరణ్
అయ్యప్ప స్వామి అంటే రామ్ చరణ్ (Ram Charan)కు అమితమైన భక్తి అనే విషయం ప్రేక్షకులు అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం ఆయన అయ్యప్ప స్వామి మాలాధారణ వేసి, దీక్ష తీసుకుంటుంటారు. ఈ ఏడాది కూడా రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసుకున్నారు. ఈసారి ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో ఆ దీక్ష పూర్తి చేశారు. రామ్ చరణ్ అచంచలమైన భక్తి విశ్వాసాలకు, నమ్మకానికి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఓ ఉదాహరణ అని చెప్పొచ్చు.
Ram Charan MS Dhoni Photo : అయ్యప్ప స్వామి మాలధారణ సమయంలో రామ చరణ్ కఠినమైన నియమ నిబంధనలు పాటిస్తారు. సిద్ధి వినాయకుని ఆలయంలోకి వెళ్లిన సమయంలో కూడా ఆయన నియమాలు పాటించారు. కుమార్తె క్లీంకార జన్మ తర్వాత రామ్ చరణ్ తొలిసారి అయ్యప్ప దీక్ష తీసుకోవడంతో ఈసారి ప్రత్యేకత సంతరించుకుంది.
Also Read : 'కన్నూర్ స్క్వాడ్' రివ్యూ : మమ్ముట్టి కొత్త సినిమా ఎలా ఉంది - కార్తీ మూవీనే మళ్లీ తీశారా?
View this post on Instagram
ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... సౌత్ ఇండియన్ స్టార్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నారు. అందులో కియారా అడ్వాణీ కథానాయిక. చాలా వరకు చిత్రీకరణ చేశారు. అయితే... ఒక్కసారి సినిమా పూర్తి అయ్యాక విడుదల తేదీ వెల్లడించాలని చిత్ర బృందం భావిస్తోందట. నిజం చెప్పాలంటే... ముందు అనుకున్న విధంగా చిత్రీకరణ జరగడం లేదు. అందువల్ల, విడుదల ఆలస్యం అవుతోంది.
'గేమ్ ఛేంజర్' తర్వాత 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial