అన్వేషించండి

Allu Arjun: ఏంటి బ్రో అలా ఎక్కించేశావ్ - ఆ కారులో ఉన్నది బన్నీయేనా??

Allu Arjun Driving: అల్లు అర్జున్ ఇంటి ముందు ఓ కారు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కారులో బన్నీ ఉన్నారో లేదో తెలియనప్పటికీ నెటిజన్లు కొందరు ట్రోల్ చేస్తున్నారు.

Trolling On Rash Driving At Allu Arjun House: పుష్ప, పుష్ప 2 వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా లెవల్‌లో ఆయన క్రేజ్ చెప్పాలంటే మాటలు సరిపోవు. 'పుష్ప 2' రిలీజ్ సమయంలో ఆయన ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. 

ఆ డ్రైవింగ్ ఏంటి బ్రో..

అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆయన కారు ర్యాష్ డ్రైవింగ్ వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది. ఆయన ఇంటి ముందు ఫుట్ పాత్‌‌పై కారును ర్యాష్‌గా ఎక్కించేసినట్లు ఆ వీడియోలో ఉంది. దీంతో అక్కడ కొంతభాగం దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఆ కారులో ఉన్నది అల్లు అర్జునా?, కాదా? అనేది క్లారిటీ లేదు. ఆయన ఇంటి ముందు కారు స్పీడుగా, ర్యాష్ డ్రైవింగ్‌తో ఇంటి లోపలికి వెళ్లడంతో ట్రోలింగ్ సాగుతోంది.

'ఆ డ్రైవింగ్ ఏంటి బ్రో.. ఇదేమైనా సినిమా అనుకున్నావా?' అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మంది ఏంటి బ్రో అలా ఎక్కించేశావ్? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఆ కారులో అల్లు అర్జున్ ఉన్నారో లేదో కూడా తెలియదని.. అనవసరంగా ట్రోలింగ్ ఎందుకంటూ కౌంటర్ ఇస్తున్నారు. 

Also Read: 'ఏస్' రివ్యూ: విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్‌... యోగిబాబు కామెడీ గట్టెక్కించిందా? మూవీ హిట్టేనా?

ఇటీవలే.. ఓ ఫ్యాన్‌కు సెల్ఫీ ఇవ్వని కారణంగా అల్లు అర్జున్‌ను ట్రోల్ చేశారు. వేవ్స్ సమ్మిట్‌కు వెళ్లిన బన్నీ ముంబయి ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా.. ఓ ఫ్యాన్ ఆయనతో సెల్ఫీ దిగేందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే, బన్నీ ఆయన్ను పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో చాలామంది ఫ్యాన్స్, నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్ హీరోలంతా ఫ్యాన్స్‌తో ఓపిగ్గా సెల్ఫీలు దిగుతారని.. బన్నీ ఇలా చేయడం ఏంటంటూ ట్రోల్ చేశారు. కొందరు ఓవర్ ఆటిట్యూడ్ అంటూ కామెంట్స్ చేశారు. 

అట్లీ - బన్నీ మూవీ వేరే లెవల్

ఇక సినిమాల విషయానికొస్తే.. బన్నీ ప్రస్తుతం అట్లీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా.. ఇటీవలే డైరెక్టర్ అట్లీ బన్నీతో మీట్ అయ్యారు. మూవీకి సంబంధించి కీలక అంశాలు ఆయనతో చర్చించినట్లు సమాచారం. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో హై ఆక్టేన్ ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతోందని తెలుస్తోంది.

సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో 'AA22XA6' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కించనుండగా.. వీఎఫ్ఎక్స్ భారీగా ఉండనున్నట్లు అనౌన్స్‌మెంట్ వీడియోలోనే స్పష్టమైంది. సమాంతర ప్రపంచం, పునర్జన్మ బ్యాక్ డ్రాప్‌లో రాబోతోన్న ఈ మూవీలో అల్లు అర్జున్ రోల్‌పై భారీ హైప్ నెలకొంది. ఇదివరకు ఎన్నడూ లేని డిఫరెంట్ రోల్స్‌లో బన్నీ కనిపించనున్నారని సమాచారం. ఈ మూవీలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్‌లో నటించనున్నారనే ఓ వైల్డ్ రూమర్ ఇటీవల చక్కర్లు కొట్టింది. ఒక రోల్ మాత్రం పూర్తి యానిమేటెడ్‌గా ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీపై అప్‌డేట్స్ రానున్నాయి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

OTT Latest Movie: బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
Jana Nayagan: సీఎం సినిమాను లీక్ చేస్తారా... ఆరుగుర్ని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
సీఎం సినిమాను లీక్ చేస్తారా... ఆరుగుర్ని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Peddi Collections Day 1: సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Peddi Collections: ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
Embed widget