Ranveer Singh: రణవీర్ సింగ్‌ను రాక్షసుడిగా చూపించనున్న 'హనుమాన్' ప్రశాంత్ వర్మ?
Prasanth Varma movie with Ranveer Singh: 'హనుమాన్' సినిమాతో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా దర్శకుడు అయ్యాడు. ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ వచ్చారు. ఆ సినిమా టైటిల్ ఖరారు చేశారట.
Hanuman director Prasanth Varma next film with Ranveer Singh titled Rakshas?: దర్శకుడు ప్రశాంత్ వర్మ సత్తా ఏమిటనేది 'హనుమాన్' చూపించింది. ఆ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాదు... హిందీలోనూ భారీ విజయం సాధించింది. ఆ ఒక్క సినిమాతో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. అతడి దర్శకత్వంలో సినిమాలు చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఇంట్రెస్ట్ చూపించే రేంజికి మీరు వచ్చాడు. హిందీలో సెన్సేషనల్ యంగ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా సినిమా చేసే అవకాశం ప్రశాంత్ వర్మకు వచ్చింది. ఆ సినిమాకు టైటిల్ ఖరారు చేశారని ఫిలిం నగర్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
రణవీర్, ప్రశాంత్ వర్మ సినిమా టైటిల్ అదేనా?
రణవీర్ సింగ్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ చిత్రానికి 'రాక్షస' టైటిల్ ఖరారు చేశారని సినిమా యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కనున్న 'రాక్షస' కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PCU)లో భాగమేనట! భారతీయ పురాణ ఇతిహాస గ్రంథాలు, మన ఇండియన్ మైథాలజీలో సూపర్ హీరోస్ స్ఫూర్తితో ప్రశాంత్ వర్మ ఈ సినిమా కథ రాశారట. 'రాక్షస' టైటిల్ ఖరారు చేసిన నేపథ్యంలో రణవీర్ సింగ్ (Ranveer Singh)ను ప్రశాంత్ వర్మ రాక్షసుడిగా చూపిస్తారా? ఒకవేళ పురాణాల్లో రాక్షసుడు అయితే ఏ క్యారెక్టర్ అయ్యి ఉంటుంది? అని ప్రేక్షకుల్లో ఆల్రెడీ ఆసక్తి మొదలు అయ్యింది.
Also Read: 'తండేల్'ను రికార్డ్ రేటుకు కొన్న నెట్‌ఫ్లిక్స్ - చైతూ కెరీర్‌లో హయ్యస్ట్, ఎన్ని కోట్లు అంటే?
హనుమాన్ జయంతికి పూజ చేసిన రణవీర్?
హనుమంతుని జయంతికి రణవీర్ సింగ్ హైదరాబాద్ వచ్చారని, ప్రశాంత్ వర్మతో కలిసి సినిమాకు పూజ చేశారని, అయితే ఫోటోలు బయటకు రానివ్వకుండా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారట.
Also Read: ఎన్టీఆర్‌ను చుట్టుముట్టిన ముంబై మీడియా... బాలీవుడ్ స్టార్లతో యంగ్ టైగర్ పార్టీ
'జై హనుమాన్' కంటే ముందు 'రాక్షస'?
'హనుమాన్' విజయం తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ 'జై హనుమాన్' అనౌన్స్ చేశారు. అందులో హనుమంతుడిగా ఫలానా స్టార్ యాక్ట్ చేయవచ్చని పలువురి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ఎవరినీ ఖరారు చేయలేదు. ఆ సినిమా కంటే ముందు 'రాక్షస'ను ప్రశాంత్ వర్మ పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.
'హనుమాన్' కంటే ముందు అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ మరో సినిమా స్టార్ట్ చేశారు. అది ఎప్పుడు విడుదల చేస్తారు? అని ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చిందని తెలిసింది. ఒక సినిమా విడుదలకు ముందు మరో రెండు సినిమాలు సెట్స్ మీదకు తీసుకు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రశాంత్ వర్మ. స్టార్స్ అందరినీ చివరకు ఒక్క సినిమాలో ఎలా తీసుకు వస్తారో అని ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.