News
News
X

Ranga Ranga Vaibhavanga Teaser: చిరంజీవి, పవన్ కళ్యాణ్... ఇద్దర్నీ ఒక్క టీజ‌ర్‌లో చూపించిన వైష్ణవ్ తేజ్ 

పంజా వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన 'రంగ రంగ వైభవంగా' సినిమా టీజర్ విడుదలైంది. మరి, ఎలా ఉందో చూశారా?

FOLLOW US: 

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం 'రంగ రంగ వైభవంగా'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు.

'నన్నే చూస్తావ్. నా గురించే కలలు కంటావ్. నన్నే ప్రేమిస్తావ్. కానీ, నీకు నాతో మాట్లాడటానికి ఇగో' అని హీరోయిన్ కేతికా శర్మ చెప్పే డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అయ్యింది. నేపథ్యంలో ఆమె డైలాగ్ వినిపిస్తుంటే... స్క్రీన్ మీద హీరో హీరోయిన్లు ఇద్దరూ పరిచయం అయ్యారు. సినిమా కథ ఏంటి? అనేది టీజ‌ర్‌లో చెప్పేశారు.

హీరో హీరోయిన్లు ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం. అయితే... ఇద్దరి మధ్య మాటల్లేవ్. హీరోయిన్ ప్రాబ్లమ్‌లో ఉందని తెలిస్తే మాత్రం వెంటనే వచ్చి ఫైట్ చేస్తాడు. ఒక్కటే బైక్ మీద కాలేజీకి వస్తారు. అప్పుడు 'కలిసిపోయారా?' అని ఫ్రెండ్ అడిగితే... ఆటోలో వస్తే ఆటో వాడితో కలిసిపోయినట్టా? అని హీరోయిన్ ప్రశ్నిస్తుంది. 'మానవత్వం చచ్చిపోయింది భయ్యా' అని వైష్ణవ్ తేజ్ చెప్పే డైలాగ్, 'ఒరేయ్ బామ్మర్ది' అంటూ ఆలీ అనడం బావుంది. మధ్యలో హీరోయిన్ నాభి చూడాలని హీరో ప్రయత్నించే సన్నివేశం కూడా!

'రంగ రంగ వైభవంగా' టీజర్ ఆకట్టుకునేలా ఉంది. మెగా అభిమానులకు మాత్రం ఫుల్ కిక్ ఇచ్చింది. ముఖ్యంగా ఫైట్ చేసిన తర్వాత ముఖం మీద చెమట వేలితో విరిసే సన్నివేశంలో చిరంజీవిని, ఆ తర్వాత టీజర్ చివర్లో రొమాంటిక్ ఎక్స్‌ప్రెష‌న్‌ ఇచ్చే సన్నివేశంలో పవన్ కళ్యాణ్‌ను వైష్ణవ్ తేజ్ గుర్తు చేశారనేది మెగా ఫ్యాన్స్ చెప్పే మాట. 

Also Read : తల్లిదండ్రులు కాబోతున్న ర‌ణ్‌బీర్, ఆలియా - పెళ్ళైన రెండున్నర నెలలకు

గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఆల్రెడీ విడుదలైన 'కొత్తగా లేదేంటి...' పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

Also Read : ప్రియాంకతో ఉన్నది బాయ్‌ఫ్రెండేనా - అమ్మ అడగడంతో అసలు విషయం చెప్పిన హీరోయిన్

Published at : 27 Jun 2022 12:06 PM (IST) Tags: ketika sharma Vaisshnav Tej Ranga Ranga Vaibhavanga Teaser Ranga Ranga Vaibhavanga Teaser Review

సంబంధిత కథనాలు

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే

Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే

Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?

Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?

Dj Tillu 2: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

Dj Tillu 2: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్ నీల్

NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్ నీల్

టాప్ స్టోరీస్

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన

CM Jagan :  ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన