Alia Bhatt Pregnancy: తల్లిదండ్రులు కాబోతున్న రణ్‌బీర్, ఆలియా - పెళ్ళైన రెండున్నర నెలలకు
రణ్‌బీర్ కపూర్, అలియా భట్ తల్లిదండ్రులు కాబోతున్నారు. తాను గర్భవతి అని ఆలియా భట్ వెల్లడించారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), 'ఆర్ఆర్ఆర్'తో తెలుగు తెరకు పరిచయమైన బీ టౌన్ బ్యూటీ ఆలియా భట్ అభిమానులకు గుడ్ న్యూస్. వాళ్ళిద్దరికీ కంగ్రాట్స్. ఈ ఏడాది ఏప్రిల్ 14న ఈ స్టార్ కపుల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళైన రెండున్నర నెలలకు... ఈ రోజు వాళ్ళిద్దరూ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.
తాను గర్భవతిననే (Alia Bhatt Pregnancy) విషయాన్ని ఈ రోజు సోషల్ మీడియాలో ఆలియా భట్ అనౌన్స్ చేశారు. ''మా చిన్నారి... త్వరలో వస్తుంది'' అని ఆస్పత్రిలో రణ్‌బీర్‌తో ఉన్న ఫొటోను ఆలియా షేర్ చేశారు.
ఆలియా భట్ సోషల్ మీడియాలో రెండు ఫోటోలు షేర్ చేశారు. ఒకటి... భర్త రణ్‌బీర్‌తో ఆస్పత్రిలో ఉన్నది. ఇంకొకటి... రెండు సింహాలు, వాటితో జన్మించిన మరో బుల్లి సింహం ఉన్నది. అంటే... సింహం, శివంగి జంటకు బిడ్డ పుట్టబోతుందని పరోక్షంగా చెప్పారన్నమాట.
Also Read : ప్రియాంకతో ఉన్నది బాయ్‌ఫ్రెండేనా - అమ్మ అడగడంతో అసలు విషయం చెప్పిన హీరోయిన్
రణ్‌బీర్, ఆలియా జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' ఈ ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది. అంత కంటే ముందు 'షంషేరా' సినిమాతో జూలై 22న రణ్‌బీర్ కపూర్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఆలియా భట్ 'రాకీ ఆర్ రాణీ కి ప్రేమ్ కహానీ' సినిమాలో నటిస్తున్నారు. 'డార్లింగ్స్' సినిమాలో నటించడంతో పాటు కో ప్రొడ్యూస్ చేస్తున్నారు. త్వరలో హాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయం కానున్నారు. గాళ్ గాడట్ స్పై థ్రిల్లర్ 'హార్ట్ ఆఫ్ స్టోన్'లో నటిస్తున్నారు.
Also Read : హనీమూన్ నుంచి తిరిగొచ్చిన నయన్ - ఇప్పుడు ముంబైలో...
View this post on Instagram