Ramabanam Storyline : గోపీచంద్ 'రామబాణం'లో అసలు కథ దాచేశారా!?
Gopichand's Ramabanam Story Concept : గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీవాస్ రూపొందిస్తున్న తాజా సినిమా 'రామబాణం'. ఇటీవల టీజర్ విడుదల చేశారు. అందులో అసలు కథ దాచినట్టు సమాచారం.
మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand) హీరోగా శ్రీవాస్ (Sriwass) దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా 'రామబాణం' (Ramabanam Movie). 'లక్ష్యం', 'లౌక్యం' వంటి విజయాల తర్వాత మరోసారి హీరో, దర్శకుడు కలిసి చేస్తున్న చిత్రమిది. మహాశివరాత్రి సందర్భంగా 'విక్కీస్ ఫస్ట్ యారో' అంటూ ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. అయితే, అందులో అసలు కథను దాచినట్టు సమాచారం.
ఐదు డ్రస్సుల్లో హీరో లుక్స్
'రామబాణం' వీడియో గ్లింప్స్ చూస్తే... మొదట స్టైలిష్ సూట్‌లో గోపీచంద్ మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఫైట్ సీన్ ద్వారా ఆయనను దర్శకుడు శ్రీవాస్ చూపించారు. ఆ తర్వాత మరో నాలుగు డ్రస్సుల్లో హీరో కనిపించారు. లాస్ట్ షాట్ తప్పిస్తే... మిగతా నాలుగు డ్రస్సుల్లోనూ మాంచి హీరోయిజం చూపించారు. ఈ సినిమాలో ఫైట్స్ ఎలా ఉంటాయి? అనేది హింట్ ఇచ్చారు. కమర్షియల్ సినిమా అనే ఫీలింగ్ కలిగింది.
సోషల్ ఇష్యూస్ టచ్ చేస్తూ...
'రామబాణం'లో కమర్షియల్ హంగులు మాత్రమే కాదు... ఓ సోషల్ ఇష్యూ కూడా ఉందని సమాచారం. ప్రస్తుత సమాజంలో జనాలు ఎదుర్కొంటున్న ఒక సామాజిక సమస్యను స్పృశిస్తూ దర్శకుడు శ్రీవాస్ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇందులో హీరోయిజంతో పాటు ఎమోషనల్ సీన్స్, ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉందట. అవి ట్రైలర్ లేదంటే విడుదలకు ముందు ఆ సోషల్ ఇష్యూ ఏంటనేది రివీల్ చేసే అవకాశం ఉంది.
వేసవిలో విక్కీగా గోపీచంద్
'రామ బాణం'లో విక్కీ పాత్రలో గోపీచంద్ నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ రోజు ఆయన క్యారెక్టర్ ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. యాక్షన్ ఎపిసోడ్ నుంచి ఈ స్టిల్ విడుదల చేసినట్లు అర్థం అవుతోంది. గోపీచంద్ (Gopichand Ramabanam First Look)కు యాక్షన్ హీరో ఇమేజ్ ఉంది. దానిని దృష్టిలో పెట్టుకుని శ్రీవాస్ మాంచి యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేసినట్లు ఉన్నారు. వేసవిలో సినిమాను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
Also Read : వినండోయ్ - ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ
ఇది గోపీచంద్ 30వ సినిమా. 'కార్తికేయ 2', 'ధమాకా' సినిమాలతో విజయాలు అందుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న తాజా చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రానికే నట సింహం బాలకృష్ణ 'రామ బాణం' టైటిల్ ఖరారు చేసింది. అన్నట్టు... ఆయన హీరోగా నటించిన 'డిక్టేటర్' సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించారు.'అన్‌స్టాపబుల్ 2' టాక్ షోలో ఆ సెంటిమెంట్ ప్రకారం, అక్షర బలం కూడా చూసి గోపీచంద్ కొత్త సినిమాకు బాలకృష్ణ 'రామబాణం' అని టైటిల్ పెట్టారు. ఆ తర్వాత ఆ టైటిలే ఖరారు చేశారు. ''ఎదురే లేని టైటిల్... గోపీచంద్ 30వ సినిమాకు 'రామ బాణం' టైటిల్ ఖరారు చేశాం'' అని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పేర్కొంది.
'రామబాణం' సినిమాలో గోపిచంద్ సరసన కథానాయికగా డింపుల్ హయతి నటిస్తున్నారు. జగపతి బాబు, ఖుష్బూ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : ఆస్కార్స్ - అమెరికా వెళ్ళిన రామ్ చరణ్