Ram Pothineni Speech: పక్కోడు... పకోడీలు... పట్టించుకుంటే పనులు జరగవ్ - రామ్ సెన్సేషనల్ స్పీచ్
Double iSmart Pre Release Event: 'డబుల్ ఇస్మార్ట్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉస్తాద్ రామ్ పోతినేని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా రివ్యూలపై, పూరి జగన్నాథ్ మీద మాట్లాడారు.
![Ram Pothineni Speech: పక్కోడు... పకోడీలు... పట్టించుకుంటే పనులు జరగవ్ - రామ్ సెన్సేషనల్ స్పీచ్ Ram Pothineni sensational comments on social media reviews in Double iSmart pre release event Ram Pothineni Speech: పక్కోడు... పకోడీలు... పట్టించుకుంటే పనులు జరగవ్ - రామ్ సెన్సేషనల్ స్పీచ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/12/ceed8069aa1ca243b98f65b0670e36c21723434334662313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Double iSmart Movie Release Date: 'డబుల్ ఇస్మార్ట్'తో ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తున్నారు ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni). తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి తెలంగాణలోని వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ వేడుకలో రామ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
పక్కోడి గురించి, పకోడీలు గురించి పట్టించుకోవద్దు!
సోషల్ మీడియాలో రివ్యూలను పట్టించుకోవద్దని ప్రేక్షకులకు రామ్ పోతినేని సలహా ఇచ్చారు. వాటి గురించి ఆయన మాట్లాడుతూ... ''ఇటీవల నేను సోషల్ మీడియాలో గానీ, బయట గానీ కొత్త ట్రెండ్ చూస్తున్నాను. 'అరే నీకు ఇది నచ్చిందా?' అంటే... 'వాళ్లకి నచ్చుతుంది ఏమో? ఇంకొకరికి నచ్చుతుంది ఏమో?' అని పక్కన ఉన్న వారివైపు చూస్తున్నారు. ముందు మనకి నచ్చిందా? అనేది చూసుకోవాలి. మనం తిన్న బిర్యానీ నచ్చిందంటే... చుట్టుపక్కల ఉన్న నలుగురు బాలేదని అంటే మన మీద మనకి డౌట్ రాకూడదు. 'నేను తిన్నాను. బావుంది' అని చెప్పాలి. అది బిర్యానీ అయినా, రేపు సినిమా అయినా, ఎల్లుండి మీ కెరీర్ అయినా! నీకు నచ్చింది నువ్ చెయ్. పక్కనోడి ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవ్ అన్నాయ్'' అని సూటిగా చెప్పారు.
పూరి లాంటి గన్ ప్రతి హీరోకి కావాలి! - రామ్
Ram Pothineni On Puri Jagannath: దర్శకుడు పూరి జగన్నాథ్ మీద రామ్ పోతినేని ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది ఆయన్ను చూసి వచ్చి ఉంటారని చెప్పారు. అంతే కాదు... తన ఫోనులో ఆయన పేరును 'గన్' అని సేవ్ చేసుకున్నట్టు చెప్పారు.
పూరి గురించి రామ్ మాట్లాడుతూ... ''నా ఫోనులో పూరి గారి పేరు 'గన్' అని ఉంటుంది. హీరోలు బుల్లెట్స్ వంటి వారు. పేలిస్తే వెళతారు. నేను పూరి గన్ నుంచి ఎంత ఫోర్సుతో వస్తాననేది ఆగస్టు 15న చూస్తారు. ప్రతి నటుడికి పూరి లాంటి గన్ అవసరం. ఆయనతో పని చేస్తే వచ్చే కిక్ వేరు'' అని చెప్పారు.
'ఇస్మార్ట్ శంకర్' ప్రీ రిలీజ్ వేడుక వరంగల్‌లో చేశారు. 'డబుల్ ఇస్మార్ట్' ప్రీ రిలీజ్ కూడా సేమ్ వెన్యూలో చేయడం, అక్కడికి వెళ్లడం చాలా సంతోషంగా ఉందని రామ్ చెప్పారు. ఇంకా సినిమా గురించి ఆయన మాట్లాడుతూ... ''మణిశర్మ గారు అద్భుతమైన పాటలు ఇచ్చారు. 'ఇస్మార్ట్ శంకర్'కి మించి చేశారు. స్క్రీన్ మీద చూస్తే పాటలు నెక్స్ట్ లెవల్ అనిపిస్తాయి. సంజయ్ దత్ తప్పితే ఆ పాత్రలో మరొకరు చేయలేరు. ఆయనతో నటించడం ఆనందంగా వుంది. కావ్య థాపర్ మంచి అమ్మాయి. సినిమా కోసం కష్టపడింది. ఛార్మి గారు ఫైటర్. ఆమె లేకుండా ఈ సినిమా సాధ్యం అయ్యేది కాదు'' అని చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)