Ram's The Warriorr Release Date: జూలై 14న 'ది వారియర్', తెలుగు - తమిళ భాషల్లో రామ్ సినిమాకు అది ప్లస్సే!
Tamil Telugu bilingual movie 'The Warriorr' official release date: ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్న 'ది వారియర్' విడుదల తేదీ ఖరారు చేశారు.
The Warriorr Movie Update: రామ్ పోతినేని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ 'ఇస్మార్ట్ శంకర్'. ఆ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది... 2019లో! మళ్ళీ మూడేళ్ళకు జూలైలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రామ్ రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'ది వారియర్'ను తనకు అచ్చొచ్చిన నెలలో విడుదల చేస్తున్నారు. అయితే... సేమ్ రిలీజ్ డేట్ కాదులెండి. సేమ్ మంత్ కానీ, ఆ విడుదల తేదీ కంటే ఒక నాలుగు రోజులు ముందుకు వచ్చారు.
లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'ది వారియర్'. ఇందులో కృతీ శెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి విలన్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూలై 14న విడుదల (The Warriorr Release Date) చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుతానికి జూలై భారీ సినిమాలు ఏవీ లేవు. సౌతిండియా హీరోలు నటించిన పాన్ ఇండియా సినిమాలు, టాలీవుడ్ స్టార్స్ సినిమాలు మే నెలాఖరుకు థియేటర్లలోకి వస్తున్నాయి. సో... ఇటు తెలుగులో, అటు తమిళంలో రామ్ సినిమాకు సోలోగా భారీ రిలీజ్ లభించే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజున 'ది వారియర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో విజయ్ మాస్టర్ నేతృత్వంలో భారీ ఎత్తున ఇంటర్వెల్ ఫైట్ తీస్తున్నామని, కంటెంట్ అండ్ కమర్షియల్ వేల్యూస్‌తో రూపొందుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత చెప్పారు.
Also Read: యూట్యూబ్‌లో ఆ రికార్డ్ సాధించిన ఫస్ట్ సౌతిండియన్ హీరో రామ్
'ది వారియర్'లో రామ్ పోలీస్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఆయన యూనిఫామ్ వేశారు. కర్నూల్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఆర్జే మహాలక్ష్మి పాత్రలో కృతీ శెట్టి కనిపించనున్నారు. అక్షరా గౌడ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
Also Read: జానీ మాస్టర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన కన్నడ స్టార్ సుదీప్
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.