By: ABP Desam | Updated at : 26 Mar 2022 07:43 AM (IST)
జానీ మాస్టర్, కిచ్చా సుదీప్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉన్నారు కదా! ఆయనకు కన్నడ స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడైన కిచ్చా సుదీప్ ఖరీదైన బహుమతి ఇచ్చారు. దాని విలువ 15 లక్షల రూపాయలకు పైగా ఉంటుంది. ఇంతకీ, ఏం బహుమతి ఇచ్చారంటే... ఫొటోలో ఉన్నది చూశారూ? ఆ మహీంద్రా జీప్! తనకు గిఫ్ట్ ఇచ్చిన సుదీప్‌కు జానీ మాస్టర్ థాంక్స్ చెప్పారు. అయితే... ఎందుకు గిఫ్ట్ ఇచ్చారనేది చెప్పలేదు.
కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'. త్వరలో విడుదల కానుంది. ఇందులో సుదీప్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ మీద చిత్రీకరించిన పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం సుదీప్‌తో ఇంకో పాట చేస్తున్నట్టు ఉన్నారు. ఇటీవల కపిల్ దేవ్‌ను సుదీప్, జానీ మాస్టర్ కలిశారు.
Also Read: మలయాళంలో బ్లాక్‌బస్టర్, తెలుగులో రీమేక్ చేస్తున్న కరణ్ జోహార్
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Jani Master (@alwaysjani)
జానీ మాస్టర్... తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ - ఏ ఇండస్ట్రీలో చూసినా ఆయన పేరు బాగా వినబడుతోంది. ఇటీవల విజయ్ 'బీస్ట్' నుంచి 'అరబిక్ కుతు...' సాంగ్ విడుదలైంది కదా! దానికి ఆయన కొరియోగ్రాఫర్. అందులో మరో పాటను కూడా చేశారు. ఆ మధ్య విడుదలైన సూర్య 'ఈటి - ఎవరికీ తలవంచడు' సినిమాలో పాటలు చేశారు. పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా 'జేమ్స్'లో సాంగ్ చేశారు. హిందీలో సల్మాన్ ఖాన్ 'రాధే'లో 'సీటీమార్' సాంగ్ చేశారు. తెలుగులో ఆయన పలు సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: 'నాటు నాటు' స్టెప్పులు వేయలేక అలసిపోయిన ఆ ఇద్దరూ ఏం పోస్ట్ చేశారో చూశారా?
‘విమానం’ ఎలా ఉంది? అనసూయను తిట్టిస్తున్న విజయ్? - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం
Varun-Lavanya Engagement: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల లవ్ స్టోరీ అలా మొదలైందా? పెద్ద కథే నడిచిందిగా!
Punch Prasad Health: 'జబర్దస్త్' ప్రసాద్‌కు ఏపీ సర్కారు అండ, కిడ్నీ మార్పిడి కోసం ఆర్థికసాయం
Chris Hemsworth: చెర్రీ, తారక్‌లతో కలిసి పనిచేయాలని ఉంది - ‘థోర్’ హీరో క్రిస్ హేమ్స్ వెల్లడి, RRRపై ప్రశంసలు
Siddharth: సుజాత ఎవరు? ఆమెను చూసి హీరో సిద్ధార్థ్ ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు?
Revant Reddy : సెప్టెంబర్ 17న మేనిఫెస్టో - ఖచ్చితంగా ధరణి రద్దు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్
WTC Final 2023: అజింక్య అదుర్స్! WTC ఫైనల్లో హాఫ్ సెంచరీ కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డు!
Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి