Ram gopal Varma: ఇక నుంచి పొలిటికల్ సినిమాలు తియ్యను - ఆర్జీవి సంచలనం నిర్ణయం
Ram gopal Varma: ఆర్జీవి.. వివాదాస్పద డైరెక్టర్. ఎప్పటికప్పుడు వివాదాస్పద సినిమాలు తీస్తూ వార్తల్లో నిలుస్తుంటారు ఆయన. అయితే, ఇప్పుడిక పొలిటికల్ సినిమాలకు దూరంగా ఉంటాను అంటున్నారు.
Ram gopal Varma About Political Movies: ఆర్జీవి.. వివాదాస్పదాలకు కేరాఫ్ అడ్రస్. కాంట్రవర్సీ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నాడు. సినిమాలే కాకుండా రాజకీయాల్లో, ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం అధికారిక వైసీపీకి సపోర్ట్ గా ఉన్న ఆయన.. 'వ్యూహం', 'శపథం' రెండు సినిమాలు తీశారు. ఇక గతంలో కూడా ఎన్నో పొలిటికల్ ఓరియెంటెడ్ సినిమాలు తీశారు ఆయన. అలాంటి ఆర్జీవి ఇప్పుడు పొలిటికల్ సినిమాలు తీయనని అంటున్నారు. వాటికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన ఈ విషయాల గురించి మాట్లాడారు.
ఇక నుంచి తియ్యను..
"ఆర్జీవి ఇక నుంచి పొలిటికల్ సినిమాలు తీయడు అనే టాక్ వచ్చింది. ఇక ఆ యాంగిల్ ముగిసినట్టేనా? జనాలు సినిమాలు చూడటం లేదని ఆ నిర్ణయం తీసుకున్నారా?" అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పారు. "ఎస్.. ఎస్.. నేను పొటిలికల్ కి చెందిన వ్యక్తిని కాదు. ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పొలిటికల్ కాబట్టి ఆ యాంగిల్ లో మాట్లాడను. ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి నేను చేయను అంటున్నాను. సినిమాని బట్టి.. టైంని బట్టి.. చాలా విషయాలు ఉంటాయి. టాపికల్ గా ఉన్నప్పుడు. ఆ టైమింగ్ కి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఎలాంటి పొలిటికల్ విషయాలపై ఇంట్రెస్ట్ గా లేను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని ఆర్జీవి చెప్పారు.
రూట్ మార్చిన ఆర్జీవి..
ఒకప్పుడు టాలీవుడ్ లో ఆర్జీవి ఫేమస్ డైరెక్టర్. ఎక్కువగా కమర్షియల్ సినిమాలు తీసేవారు. అవి సూపర్ డూపర్ హిట్లుగా మారాయి. అయితే, ఆ తర్వాత ఒక్కసారిగా ఆయన రూటు మార్చారు. ఎక్కువగా పొలిటికల్ జోనర్‌లోనే మూవీస్‌ను తెరకెక్కిస్తున్నారు. అవి కాస్త కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తున్నాయి. 'వంగవీటి'తో మొదలుకుని, 'రక్తచరిత్ర', 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'వ్యూహం', 'శపథం' లాంటి సినిమాలు తెరకెక్కించారు ఆయన. ఇక అవి ఏపీలో రాజకీయ దుమారమే లేపాయి.
'వ్యూహం', 'శపథం 'కాంట్రవర్సీ..
ఇటీవల ఆయన తెరకెక్కించిన 'వ్యూహం', 'శపథం' కాంట్రవర్సీగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమాలను ఆపేందుకు తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సైతం శతవిధాల ప్రయత్నించారు. కోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి సెన్సార్ అవ్వక, ఒకసారి కోర్టు ఆపేయడం, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మొత్తం మూడుసార్లు వాయిదా పడ్డాయి ఈ సినిమాలు. ఆ తర్వాత ఎట్టకేలకు రిలీజ్ అయ్యాయి. ఇక ఆ సినిమాలు పొలిటికల్ గా తీయడంతో ఒక వర్గం వారు మాత్రమే సినిమా గురించి గొప్పగా చెప్పుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణించిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఈ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఇక 'శపథం' విషయానికొస్తే.. వ్యూహం కి సీక్వెల్ శపథం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో నారా చంద్రబాబు అరెస్ట్ వరకు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరిగిందో ఈ సినిమాలో చూపించాడు ఆర్జీవి.
Also Read: కూతురు పుట్టినప్పుడు బాధపడ్డా, ఆరోగ్యంగా ఉన్నా ఛాన్సులివ్వండి - పంచ్ ప్రసాద్