అన్వేషించండి

Ram Charan Upasana Twins : రామ్ చరణ్, ఉపాసన ట్విన్స్‌ పేర్లు ఇవే - మనవడు, మనవరాలితో మెగా ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్

Ram Charan Upasana : రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవలల పేర్లు వెల్లడించారు. ఈ నెల 11న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో బారసాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రామ్ చరణ్, ఉపాసన తమ కవలలకు శివరామ్, అన్వీరా దేవి అని పేర్లు పెట్టారు.
  • శివరామ్ అంటే శివుడు, రాముడు, తండ్రి పేర్ల కలయిక అని వివరించారు.
  • అన్వీరా దేవి అంటే అపరిమిత ధైర్యం, దైవిక శక్తి అని అర్థం చెప్పారు.
  • పిల్లలకు ఆధ్యాత్మిక భావన కలిగేలా పేర్లు పెట్టామని దంపతులు తెలిపారు.

Ram Charan Upasana Couple Twins Names Announced : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు రీసెంట్‌గా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న చిన్నారుల బారసాల కార్యక్రమం నిర్వహించగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ పిల్లల పేర్లు వెల్లడించారు.

ట్విన్స్ నేమ్స్... వాటి అర్థం ఏంటంటే?

అబ్బాయి, అమ్మాయికి జన్మనివ్వగా... అబ్బాయి పేరు శివరామ్, అమ్మాయి పేరు అన్వీరా దేవి అని చరణ్ దంపతులు వెల్లడించారు. వారికి ఈ పేర్లు పెట్టడానికి గల కారణాలను కూడా వివరించారు. అమ్మానాన్నల సలహాలతో పాటు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా పిల్లల పేర్లు ఉండాలని అలా పెట్టినట్లు చెప్పారు. 'పిల్లలకు పేర్లు పెట్టడం కోసం నేను ఉపాసన చాలా ఆలోచించాం. వినగానే ఆధ్యాత్మిక భావం కలిగేలా ఉండాలనుకున్నాం.

అమ్మానాన్నల సలహాలు తీసుకుని అబ్బాయి పేరు శివరామ్, అమ్మాయి పేరు అన్వీరా దేవి. 'అన్' అంటే అపరిమితమైన, వీర అంటే ధైర్యం, దేవి అంటే దైవిక శక్తి. అపరిమితమైన ధైర్యాన్ని, దైవిక శక్తిని సూచించేలా ఈ పేరు పెట్టాం. ఇక శివరామ్ అంటే శివుడు, రాముడు పేర్లు కలిసేలా పెట్టాం. అలాగే మా నాన్న పేరు (శివ శంకర వరప్రసాద్) కలిసేలా శివరామ్ అని పెట్టాం.' అంటూ వివరించారు. 

Also Read : నాని 'ది ప్యారడైజ్' రిలీజ్ వాయిదా - అఫీషియల్ న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

మనవడు, మనవరాలితో చిరంజీవి

ఇక మనవడు, మనవరాలి బారసాల ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరు దంపతులు సందడి అంతా ఇంతా కాదు. మెగా వారసుడిని ఎత్తుకుని చిరు, సురేఖ దంపతులు బెస్ట్ మూమెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే ఫోటోలో క్లీంకార ఉండగా... ఆమె ఫోటో రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. 

డబుల్ ఆనందం

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇంతకు ముందు క్లీంకార జన్మించింది. రీసెంట్‌గానే మెగా ఫ్యామిలీలో డబుల్ ఆనందం వచ్చేలా వీరికి కవలలు జన్మించారు. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడిని కలిగి ఉండడం ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నానని చరణ్ పోస్ట్ పెట్టారు. మన జీవితంలో మహిళలే అత్యంత బలం అని... ఎప్పటికీ మాకు అండగా నిలిచిన కుటుంబం, అభిమానులు, శ్రేయోభిలాషులకు థాంక్స్ చెప్పారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget